ఫుట్‌బాల్ స్టార్.. మెస్సీ సంపద చూస్తే మతి పోవాల్సిందే! | Lionel Messi Net Worth 2026 Salary Endorsements Cars Properties and Luxury Assets | Sakshi
Sakshi News home page

ఫుట్‌బాల్ స్టార్.. మెస్సీ సంపద చూస్తే మతి పోవాల్సిందే!

Sep 1 2026 1:14 PM | Updated on Sep 1 2026 1:54 PM

Lionel Messi Net Worth 2026 Salary Endorsements Cars Properties and Luxury Assets

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ 'లియోనెల్ మెస్సీ' అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు పలికారు. ప్రపంచ కప్ ఫైనల్‌లో ఓటమి, అతని తండ్రి ఇటీవలి మరణం నేపథ్యంలో ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. అయినప్పటికీ.. మెస్సీ ఇంటర్ మయామి క్లబ్ తరపున ఫుట్‌బాల్ ఆడటం కొనసాగిస్తున్నారు. ఫుట్‌బాల్‌లో సాధించిన విజయాలతో పాటు, తన కెరీర్‌లో సంపాదించిన భారీ ఆదాయంతో.. మెస్సీ ప్రపంచంలోని అత్యంత సంపన్న క్రీడాకారుల్లో ఒకరిగా నిలిచాడు. ఈ కథనంలో మెస్సీ సంపద గురించి, లగ్జరీ లైఫ్‌స్టైల్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఫుట్‌బాల్ నుంచి సంపాదన
మెస్సీ ఆర్థిక సామ్రాజ్యానికి ప్రధాన కారణం ఆయన ఫుట్‌బాల్ కెరీర్. బార్సిలోనా తరఫున ఆడిన సమయంలో బోనస్‌లతో సహా భారీ వార్షిక ప్యాకేజీ ఉండేదని సమాచారం. ఆ తర్వాత అతడు పారిస్ సెయింట్-జెర్మైన్ (PSG)లో కూడా గణనీయమైన వేతనాలు పొందాడు. ప్రస్తుతం ఇంటర్ మియామితో ఉన్న ఒప్పందం కూడా ప్రత్యేకమైనదే. జీతంతో పాటు ఆదాయంలో వాటా, భవిష్యత్తులో క్లబ్‌లో వాటా పొందే అవకాశం వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నట్లు సమాచారం. మెస్సీకి ఏడాదికి సుమారు 70 నుంచి 80 మిలియన్ డాలర్ల విలువైన ప్యాకేజీ ఉండొచ్చని సమాచారం.

ప్రకటనల ద్వారా ఆదాయం
మెస్సీకి ఫుట్‌బాల్ ఎంత పేరు తెచ్చిందో, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు కూడా అంతే సంపదను తెచ్చిపెట్టాయి. అడిడాస్, పెప్సీ, గేటోరేడ్, మాస్టర్‌కార్డ్, బడ్‌వైజర్ వంటి ప్రపంచ ప్రసిద్ధ కంపెనీలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించాడు. ఫోర్బ్స్ ప్రకారం.. ప్రకటనలు, ఇతర వ్యాపారాల ద్వారా మెస్సీ తన కెరీర్‌లో 600 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ సంపాదించాడు. సోషల్ మీడియాలో కోట్లాది మంది అభిమానులు ఉండటంతో.. మెస్సీ ఇన్‌స్టాగ్రామ్ కంటెంట్ ద్వారా ఒక్కో పోస్ట్‌కు సుమారు 2.7 మిలియన్ డాలర్లు సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆస్తులు, ఇతర వ్యాపారాలు
మెస్సీ తన సంపాదనను కేవలం ఖర్చు చేయడానికి మాత్రమే కాకుండా.. ఆస్తులు, వ్యాపారాల్లో కూడా పెట్టుబడిగా పెట్టాడు. బార్సిలోనా, మియామి, అర్జెంటీనాలోని రొసారియో వంటి ప్రాంతాల్లో అతనికి విలాసవంతమైన ఇళ్లు, ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తులు ఉన్నట్లు సమాచారం. వీటి విలువ 200 మిలియన్ డాలర్లకు పైగా ఉండొచ్చని అంచనా. అలాగే MiM హోటల్స్ హాస్పిటాలిటీ బ్రాండ్ ద్వారా కూడా పెట్టుబడులు పెట్టాడు.

లగ్జరీ లైఫ్‌స్టైల్
మెస్సీకి ప్రైవేట్ జెట్, ఖరీదైన కార్లు వంటి విలాసవంతమైన వస్తువులు కూడా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. మెర్సిడెస్ బెంజ్, మసెరటి, రేంజ్ రోవర్, ఆడి వంటి కార్లు కూడా ఆయన వద్ద ఉన్నట్లు సమాచారం.

మొత్తం సంపద
మెస్సీ సంపద ఒక్క ఫుట్‌బాల్ ఆటద్వారా మాత్రమే వచ్చినది కాదు. ఫుట్‌బాల్ కాంట్రాక్టులు, ప్రకటనలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, పెట్టుబడులు కలిసి ఆయనను బిలియనీర్‌గా మార్చాయి. 2022 ప్రపంచకప్ గెలవడం కూడా ఆయన ప్రపంచవ్యాప్త బ్రాండ్ విలువను మరింత పెంచింది. ఇప్పుడు అర్జెంటీనా తరఫున ఆడటం ఆపేసినా.. ఇంటర్ మియామి, వ్యాపారాలు, పెట్టుబడులు, బ్రాండ్ ఒప్పందాల ద్వారా మెస్సీ ఆదాయం వస్తూనే ఉంటుంది. ఫోర్బ్స్ అంచనా ప్రకారం మెస్సీ నికర ఆస్తి విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10,450 కోట్లు).

ఇదీ చదవండి: NCLT సంచలన నిర్ణయం.. రూ.22 వేల కోట్లకు రూ.6.25 కోట్లేనా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement