IND vs AUS: జట్లను ప్రకటించిన ఆస్ట్రేలియా | Australia announce A squad for India tour: Nikhil In Handscomb Return | Sakshi
Sakshi News home page

IND vs AUS: ఆసీస్‌ జట్ల ప్రకటన.. మూడేళ్ల తర్వాత అతడికి పిలుపు

Sep 1 2026 11:53 AM | Updated on Sep 1 2026 1:20 PM

Australia announce A squad for India tour: Nikhil In Handscomb Return

సామ్‌ కొన్‌స్టాస్‌, పీటర్‌ హాండ్స్‌కోంబ్‌ (PC: CA)

భారత్‌- ‘ఎ’ జట్టుతో జరిగే సిరీస్‌లకు క్రికెట్‌ ఆస్ట్రేలియా తమ జట్లను ప్రకటించింది. వన్డే జట్టులో ఒకప్పటి భారత క్రికెటర్‌ నిఖిల్‌ చౌదరికి చోటు దక్కగా.. ఫోర్‌- డే మ్యాచ్‌లు ఆడే టీమ్‌లో వెటరన్‌ ఆటగాడు పీటర్‌ హాండ్స్‌కోంబ్‌ స్థానం సంపాదించాడు.

ఎవరీ నిఖిల్‌ చౌదరి?
కాగా రెండు అనధికారిక టెస్టులు, మూడు అనధికారిక వన్డేలు ఆడేందుకు ఆసీస్‌-ఎ జట్టు భారత్‌లో పర్యటించనుంది. సెప్టెంబరు 22 నుంచి అక్టోబరు 11 వరకు ఈ టూర్‌ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ ఆస్ట్రేలియా ప్రకటించిన జట్టులో నిఖిల్‌ చౌదరికి చోటు దక్కడం ఆసక్తికరంగా మారింది.

ఢిల్లీలో జన్మించిన నిఖిల్‌ చౌదరి పంజాబ్‌లో పెరిగాడు. అతడు స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌. దేశీ క్రికెట్‌లో పంజాబ్‌ తరఫున అన్ని ఏజ్‌ గ్రూపులలో క్రికెట్‌ ఆడాడు. టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌, టీమిండియా స్టార్లు అభిషేక్‌ శర్మ, అర్ష్‌దీప్‌ సింగ్‌లతో కలిసి పంజాబ్‌ తరఫున లిస్ట్‌-ఎ క్రికెట్‌ ఆడాడు.

అయితే, భారత్‌లో ఆశించిన అవకాశాలు రాకపోవడంతో ఆస్ట్రేలియాకు వలస వెళ్లిన నిఖిల్‌ చౌదరి.. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి రాగా.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ఆస్ట్రేలియాలో శాశ్వత నివాస హోదా పొందిన నిఖిల్‌.. దేశీ క్రికెట్‌లో రాణించాడు.

ఆసీస్‌ తరఫున అరంగేట్రం. . ఇప్పుడు వన్డే జట్టులోకి!
ఈ క్రమంలో ఇటీవలే ఈ ఏడాది జూన్‌లో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ సందర్భంగా ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు నిఖిల్‌ చౌదరి. ఇప్పటికి మూడు టీ20లలో కలిపి 26 పరుగులు చేసిన ఈ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. రెండు వికెట్లు తీశాడు. ఇప్పుడు అనధికారిక వన్డేల్లో తాను జన్మించిన భారత గడ్డపై ఆసీస్‌-ఎ జట్టు తరఫున ఆడేందుకు సిద్ధమయ్యాడు.

మూడేళ్ల తర్వాత
మరోవైపు.. భారత్‌తో జరిగే అనధికారిక టెస్టు సిరీస్‌కు 35 ఏళ్ల పీటర్‌ హాండ్స్‌కోంబ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఈసారి గనుక సత్తా చాటితే భారత్‌లో జరిగే బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ (BGT) టోర్నీకి అతడి పేరును యాజమాన్యం పరిశీలించే అవకాశం ఉంది. కాగా 2023లో చివరగా BGT సందర్భంగానే హాండ్స్‌కోంబ్‌ చివరగా ఆసీస్‌ తరఫున ఆడాడు.

భారత్‌-ఎ జట్టుతో అనధికారిక వన్డేల్లో తలపడే ఆసీస్‌-ఎ జట్టు
మహ్లి బియర్డ్‌మాన్‌, నిఖిల్‌ చౌదరి, బెన్‌ డ్వార్షుయిస్‌, జాక్‌ ఎడ్వర్డ్స్‌, ఆరోన్‌ హార్డీ, స్పెన్సర్‌ జాన్సన్‌, సామ్‌ కొన్‌స్టాస్‌, నాథన్‌ మెక్‌స్వీనీ, టాడ్‌ మర్పీ, మిచెల్‌ ఓవెన్‌, జోష్‌ ఫిలిప్‌, తన్వీర్‌ సంఘా, లియామ్‌ స్కాట్‌, లాచ్లాన్‌ షా.

అనధికారిక టెస్టుకు ఆసీస్‌-ఎ జట్టు
బ్రెండన్‌ డగెట్‌, జాక్‌ ఎడ్వర్డ్స్‌, పీటర్‌ హాండ్స్‌కోంబ్‌, సామ్‌ హార్పర్‌, లియామ్‌ హాచెర్‌, కాంప్‌బెల్‌ కెల్లావే, సామ్‌ కొన్‌స్టాస్‌, నాథన్‌ మెక్‌స్వీనీ, టాడ్‌ మర్ఫీ, ఫెర్గూస్‌ ఒ నీల్‌, జోష్‌ ఫిలిప్‌, జై రిచర్డ్‌సన్‌, కోరే రొచిసియోలి, జేసన్‌ సంఘా, లియామ్‌ స్కాట్‌.

భారత్‌-ఎ వర్సెస్‌ ఆసీస్‌-ఎ షెడ్యూల్‌
వేదిక పుదుచ్చేరి
తొలి అనధికారిక టెస్టు- సెప్టెంబరు 22 నుంచి
రెండో అనధికారిక టెస్టు- సెప్టెంబరు 29 నుంచి
తొలి అనధికారిక వన్డే- అక్టోబరు 6
రెండో అనధికారిక వన్డే- అక్టోబరు 9
మూడో అనధికారిక వన్డే- అక్టోబరు 11.

చదవండి: ‘నువ్వెంత కష్టపడ్డావో చూశాను.. మన పిల్లలకు నువ్వే హీరో’ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement