రిటైర్మెంట్ విష‌యంలోనూ మెస్సీ రికార్డు | Lionel Messi-Becomes 1st Player-Retirement Twice-Football-History | Sakshi
Sakshi News home page

రిటైర్మెంట్ విష‌యంలోనూ మెస్సీ రికార్డు

Sep 1 2026 3:58 PM | Updated on Sep 1 2026 5:02 PM

Lionel Messi-Becomes 1st Player-Retirement Twice-Football-History

Photo Credit: Twitter

అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ సోమ‌వారం రాత్రి అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు ప‌లికాడు. అయితే కొంత‌కాలం ఆడుతాడ‌ని అభిమానులు భావించిన‌ప్ప‌టికీ, త‌న రిటైర్మెంట్‌పై వ‌స్తున్న ఊహాగానాల‌ను నిజం చేస్తూ గుట్టుచ‌ప్పుడు కాకుండా ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా వీడ్కోలుకు సంబంధించి లేఖ‌ను విడుద‌ల చేసి మౌన మునిలా నిష్క్ర‌మించాడు.

అయితే గ‌తంలోనే మెస్సీ అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడ‌న్న విష‌యం మీలో ఎంత‌మందికి తెలుసు?  2007లో తొలి అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడిన మెస్సీ 19 ఏళ్ల అంత‌ర్జాతీయ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్ల‌ను అందుకున్నాడు. అయితే మెస్సీ రిటైర్మెంట్ విష‌యంలోనూ ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డు న‌మోదు చేశాడు. అదేంటంటే.. ఫుట్‌బాల్ చ‌రిత్ర‌లో అంత‌ర్జాతీయ కెరీర్‌కు రెండుసార్లు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన ప్లేయ‌ర్‌గా మెస్సీ నిలిచాడు.


Photo Credit: Twitter

క్ష‌ణికావేశంలో రిటైర్మెంట్
2016 కోపా అమెరికా కప్‌ ఫైనల్లో చిలీ చేతిలో ఓడటం, ఆ మ్యాచ్‌లో ఒక పెనాల్టీ కిక్‌ను స్కోర్‌ చేయలేకపోవడంతో నిరాశ‌కు లోనైన మెస్సీ క్ష‌ణికావేశంలో రిటైర్మెంట్ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించాడు. కానీ ఆ త‌ర్వాత మ‌నసు మార్చుకొని త‌న నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకున్నాడు. ఒక‌వేళ 2016లోనే మెస్సీ రిటైర్ అయ్యుంటే మాత్రం అర్జెంటీనా ప‌రిస్థితి వేరుగా ఉండేది. 

2022లో ఖతార్ వేదిక‌గా జ‌రిగిన ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌ను మెస్సీ ఖాతాలో వేసుకునే అవ‌కాశం చేజారేదే. అయితే మెస్సీ అంత‌ర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు ప‌లికిన‌ప్ప‌టికీ,  క్లబ్‌ ఫుట్‌బాల్‌లో కొనసాగనున్నాడు. ప్రస్తుతం అతను అమెరికాలోని ఇంటర్‌ మయామి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2028 వరకు మయామి జట్టుతో మెస్సీకి ఒప్పందం ఉంది. శనివారం సీఎఫ్‌ మాంట్రియల్‌తో జరిగిన మ్యాచ్‌లో మయామి 7–1 తో నెగ్గగా... మెస్సీ 4 గోల్స్‌ చేయడం విశేషం.


Photo Credit: Twitter

అంత‌ర్జాతీయంగా మెస్సీ సాధించిన రికార్డులు..
👉125- అర్జెంటీనా తరఫున మెస్సీ చేసిన గోల్స్‌. జాతీయ జట్టు తరఫున మెస్సీ 207 మ్యాచ్‌లు ఆడాడు.
👉21- తాను ఆడిన ఆరు ప్రపంచకప్‌లలో కలిపి మెస్సీ చేసిన గోల్స్‌.
👉2- మెస్సీ గెల్చుకున్న ‘గోల్డెన్‌ బాల్‌’ అవార్డులు. 2014  ప్రపంచకప్‌లో, 2022  ప్రపంచకప్‌లో మెస్సీ ఉత్తమ ప్లేయర్‌గా ఎంపికయ్యాడు.
👉1- ఒకే ప్రపంచకప్‌లో (2022) గ్రూప్‌ దశ, ప్రిక్వార్టర్, క్వార్టర్‌ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో గోల్‌ చేసిన ఏకైక ప్లేయర్‌ మెస్సీ. ప్రపంచ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (34) ఆడిన ప్లేయర్‌ రికార్డు... అత్యధిక మ్యాచ్‌ల్లో (27) కెప్టెన్‌గా వ్యవహరించిన రికార్డు కూడా మెస్సీ పేరిటే  ఉంది.

చదవండి: తరానికొక్కడు.. అల్విదా లియోనల్‌ మెస్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement