టీమిండియా ప్రపంచ రికార్డు | India Women Create World Record vs Sri Lanka In Asian Games 2026 | Sakshi
Sakshi News home page

టీమిండియా ప్రపంచ రికార్డు

Sep 22 2026 11:40 AM | Updated on Sep 22 2026 11:44 AM

India Women Create World Record vs Sri Lanka In Asian Games 2026

source: BCCI X

భారత మహిళల క్రికెట్‌ జట్టు మరో ప్రపంచ రికార్డు సమం చేసింది. మహిళల టీ20 అంతర్జాతీయాల్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన జట్టుగా ఇంగ్లండ్‌ సరసన నిలిచింది. ఏషియన్‌ గేమ్స్‌ 2026లో భాగంగా శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న స్వర్ణ పతక మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది.

ఈ మ్యాచ్‌లో భారత్‌ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సంఖ్య 233కు చేరింది. ప్రస్తుతం ఇంగ్లండ్‌ కూడా అన్నే మ్యాచ్‌లతో భారత్‌ సరసన ఉంది. ఈ జాబితాలో భారత్‌, ఇంగ్లండ్‌ తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (213), వెస్టిండీస్‌ (206), పాకిస్తాన్‌ (205), న్యూజిలాండ్‌ (204)  ఉన్నాయి.

2006లో మొదలైన ‍ప్రయాణం
మహిళల టీ20ల్లో భారత్‌ ప్రయాణం 2006లో ప్రారంభమైంది. ఇప్పటివరకు ఆడిన 233 మ్యాచ్‌ల్లో 130 విజయాలు, 95 పరాజయాలు నమోదు చేసింది. ఒక మ్యాచ్‌ టై కాగా, ఆరు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. స్వర్ణ పతక మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేస్తుంది. 16 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోర్‌ 157-2గా ఉంది. షఫాలీ వర్మ (48), హర్మన్‌ప్రీత్‌ (19) ఔట్‌ కాగా.. స్మృతి మంధన (79), రిచా ఘోష్‌ (10) క్రీజ్‌లో ఉన్నారు. 

ఇదీ చదవండి: చరిత్ర సృష్టించి టీమిండియా ఓపెనర్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement