న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన షరతులకు ఇరాన్ ఒప్పుకోవాలని, లేదంటే ప్రపంచ పటం నుంచి ఇరాన్‌ను తుడిచేయాలా? అని హెచ్చరించారు.
న్యూయార్క్‌లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 81వ సాధారణ మహాసభల్లో ఇరాన్ లక్ష్యంగా నిప్పులు చెరిగారు. ట్రంప్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను కలకలం రేపుతున్నాయి. ప్రపంచ దేశాలు తీవ్ర భయాందోళనలోకి గురవుతున్నాయి.
ఐరాస వేదికగా ప్రపంచ దేశాల నాయకులను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ ఇరాన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలా? లేక ఆ దేశాన్ని ప్రపంచ పటం నుంచి శాశ్వతంగా తుడిచిపెట్టేయాలా?’అని హెచ్చరించారు.
ఈ సందర్భంగా పశ్చిమాసియాలో (మిడిల్ ఈస్ట్) ఇకపై ఇరాన్ ఆటలు సాగవు. ఆ ప్రాంతాన్ని శాసించే దుర్మార్గపు దాదాగిరికి తాము ఇప్పటికే చరమగీతం పలికాం. మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్ సాగిస్తున్న దౌర్జన్యాలు, ఆధిపత్య ధోరణి పూర్తిగా ముగిసిపోయాయని తేల్చిచెప్పారు. ట్రంప్ చేసిన ఈ హెచ్చరికలు రాబోయే రోజుల్లో అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే దానిపై సర్వత్రా ఆందోళనలు నెలకొన్నాయి.


