న్యూజిలాండ్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు | Mitchell Santner becomes first bowler with multiple T20I four-wicket hauls vs India | Sakshi
Sakshi News home page

IND vs NZ: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ ప్రపంచ రికార్డు

Oct 25 2026 4:44 PM | Updated on Oct 25 2026 5:02 PM

Mitchell Santner becomes first bowler with multiple T20I four-wicket hauls vs India

క్రైస్ట్‌చ‌ర్చ్ వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన రెండో టీ20లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్‌లో కివీస్ ఓడిపోయిన‌ప్ప‌టికి కెప్టెన్ మిచెల్ శాంట్న‌ర్ మాత్రం అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. అత‌డు త‌న స్పిన్ మాయాజాలంతో భార‌త బ్యాట‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

శాంట్నర్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. తద్వారా బ్లాక్ క్యాప్స్ కెప్టెన్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.  భారత్‌పై టీ20 ఫార్మాట్‌లో ఒకటి కంటే ఎక్కువసార్లు ఫోర్‌ వికెట్ల హాల్‌ సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.

టీమిండియాపై శాంట్నర్ 4 వికెట్ల ఘనత సాధించడం ఇది రెండో సారి. అతడికంటే ముందు ఏ బౌలర్ కూడా భారత్‌పై రెండుసార్లు ఫోర్ వికెట్ల హాల్ సాధించలేదు. శాంట్నర్ తొలిసారి 2016 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌పై 11 పరులిచ్చి 4 వికెట్లు తీశాడు. మళ్లీ ఇప్పుడు పదేళ్ల త‌ర్వాత అత‌డు 4 వికెట్ల హాల్ న‌మోదు చేశాడు.

అదేవిధంగా టీ20ల్లో భార‌త్‌పై అత్య‌ధిక వికెట్ల తీసిన జాబితాలో శాంట్న‌ర్‌(29) రెండో స్ధానంలో ఉన్నాడు. అత‌డి స‌హచ‌ర ప్లేయ‌ర్ ఇష్ సోధీ(30) అగ్ర‌స్ధానంలో ఉన్నాడు.
చదవండి: IND vs NZ: 'ప్లీజ్‌.. అతడిని ఏమి అనొద్దు! కాస్త స‌మ‌యం ఇవ్వండి'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement