శతక్కొట్టిన హర్మన్‌.. భారీ స్కోర్‌ దిశగా టీమిండియా | harmanpreet kaur slams 100 in 2nd ODI vs Zimbabwe | Sakshi
Sakshi News home page

శతక్కొట్టిన హర్మన్‌.. భారీ స్కోర్‌ దిశగా టీమిండియా

Oct 25 2026 5:01 PM | Updated on Oct 25 2026 5:01 PM

harmanpreet kaur slams 100 in 2nd ODI vs Zimbabwe

source: X

వడోదర వేదికగా జింబాబ్వే మహిళల జట్టుతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తాజా మాజీ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సూపర్‌ సెంచరీతో కదంతొక్కింది. 101 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో తన కెరీర్‌లో 8వ వన్డే సెంచరీ పూర్తి చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేస్తోంది.

19 పరుగులకే టీమిండియా ఇద్దరు స్టార్‌ బ్యాటర్ల వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధన డకౌట్‌ కాగా.. విధ్వంసకర బ్యాటర్‌ షఫాలీ వర్మ 8 పరుగులు చేసి ఔటైంది. ఇద్దరి వికెట్లు సిబండ తీసింది. ఈ దశలో మరో ఓపెనర్‌ ప్రతీకా రావల్‌ (61), హర్మన్‌ భారత ఇన్నింగ్స్‌ను నిర్మించారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 124 పరుగులు జోడించారు. అనంతరం ప్రతీకా ఔటైంది.

ఆ వెంటనే భారత్‌ మరో వికెట్‌ కూడా కోల్పోయింది. తేజల్‌ హజబ్నిస్‌ 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరింది. ఈ దశలో హర్మన్‌ దీప్తి శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను నిర్మించింది. ఓ పక్క హర్మన్‌ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడుతుంటే, మరోపక్క దీప్తి శర్మ చెలరేగిపోతుంది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయమైన 128 పరుగులు జోడించారు. 43 ఓవర్ల తర్వాత భారత్‌ స్కోర్‌ 276-4గా ఉంది. హర్మన్‌ 110, దీప్తి 83 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.  

కాగా, జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరీస్‌ తొలి మ్యాచ్‌లో భారత్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 

ఇదీ చదవండి: టీమిండియా వరల్డ్‌ రికార్డు.. చరిత్రలో మొదటి జట్టు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement