టీమిండియా వరల్డ్‌ రికార్డు.. చరిత్రలో మొదటి జట్టు | Team India Completes 200 T20I wins, First Team in History | Sakshi
Sakshi News home page

టీమిండియా వరల్డ్‌ రికార్డు.. చరిత్రలో మొదటి జట్టు

Oct 25 2026 4:02 PM | Updated on Oct 25 2026 4:02 PM

Team India Completes 200 T20I wins, First Team in History

source: X

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ 4 వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించిన విజయం తెలిసిందే. ఈ గెలుపుతో టీమిండియా ఓ చారిత్రక మైలురాయిని అందుకుంది. అంతర్జాతీయ టీ20ల్లో 200 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. నిన్నటి మ్యాచ్‌తో కలిపి 300 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ ఈ ఘనత సాధించింది.

ఈ రికార్డుకు సంబంధించి భారత్‌ దరిదాపుల్లో కూడా ఏ జట్టూ లేదు. 176 విజయాలతో పాక్‌ రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌ 135, సౌతాఫ్రికా 129, ఇంగ్లండ్‌ 128, ఆస్ట్రేలియా 127, వెస్టిండీస్‌ 111, శ్రీలంక 105, ఉగాండ 101, ఆఫ్ఘనిస్తాన్‌ 99 విజయాలతో వరుస స్థానాల్లో ఉన్నాయి.

2006లో టీ20లు ఆడటం మొదలుపెట్టిన టీమిండియా 300 మ్యాచ్‌ల్లో 200 విజయాలు, 83 అపజయాలు తన ఖాతాలో వేసుకుంది. 7 మ్యాచ్‌లు టై కాగా.. పదింట ఫలితాలు రాలేదు. భారత్‌కు అత్యధిక టీ20 విజయాలు అందించిన కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ (50) చలామణి అవుతున్నాడు. అతని తర్వాతి స్థానాల్లో ఎంఎస్‌ ధోని, సూర్యకుమార్‌యాదవ్‌ ఉన్నారు. వీరిద్దరు భారత్‌కు తలో 42 విజయాలు అందించారు.

కాగా, నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన నిన్నటి టీ20లో తిలక్‌ వర్మ, నితీశ్‌ కుమార్‌ రెడ్డి అద్భుతంగా ఆడి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ జోడీ గెలవడం​ కష్టమనుకున్న మ్యాచ్‌లో భారత్‌ను గెలిపించింది. ఈ గెలుపుతో భారత్‌ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మూడో టీ20 అక్టోబర్‌ 27న జరుగనుంది. 

ఇదీ చదవండి: చెత్త రికార్డు.. జెమీమా సరసన మంధన


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement