హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఇకపై తెలుగు బ్లాక్‌హాక్స్‌ | Hyderabad Volleyball Team Is Now Telugu Black Hawks | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ఇకపై తెలుగు బ్లాక్‌హాక్స్‌

Aug 18 2026 6:11 AM | Updated on Aug 18 2026 6:11 AM

Hyderabad Volleyball Team Is Now Telugu Black Hawks

పనాజీ: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) వ్యవస్థాపక ఫ్రాంచైజీలలో ఒకటైన హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ పేరు మారింది. ఈ ఏడాది నవంబర్‌ 30 నుంచి అహ్మదాబాద్‌లో జరిగే ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ ఐదో సీజన్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ జట్టు తెలుగు బ్లాక్‌హాక్స్‌ పేరుతో బరిలోకి దిగనుంది. ఈ సందర్భంగా తెలుగు బ్లాక్‌హాక్స్‌ ప్రధాన యజమాని కంకణాల అభిశేక్‌ రెడ్డి మాట్లాడుతూ ‘నాలుగేళ్ల క్రితం ఒక ప్రొఫెషనల్‌ వాలీబాల్‌ జట్టును నిర్మించాలనే కలతో మా ప్రయాణాన్ని ప్రారంభించాం. 

ఈ రోజు ఆ కల మరింత పెద్ద లక్ష్యంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు గర్వంగా తమ జట్టుగా భావించేలా బ్లాక్‌ హాక్స్‌ను నిర్మించడమే మా లక్ష్యం’ అని అన్నారు. పీవీఎల్‌ ఐదో సీజన్‌కు సంబంధించి సోమవారం ఆటగాళ్ల వేలం కార్యక్రమం జరిగింది. తెలుగు బ్లాక్‌హాక్స్‌ జట్టు: తనీశ్‌ చౌధరీ (రూ. 14 లక్షలు), వినీత్‌ కుమార్‌ (రూ. 8 లక్షలు), మౌషిన్‌ పా (రూ. 5 లక్షలు), నియాస్‌ అబ్దుల్‌ సలామ్‌ (రూ. 4 లక్షలు), బీఎస్‌ హరిప్రసాద్‌ (రూ. 3 లక్షలు), దీపక్‌ (రూ. 3 లక్షలు), మెట్టు సిరిల్‌ రెడ్డి (రూ. 1 లక్ష), నమిత్‌ (రూ. 1 లక్ష), శిఖర్‌ సింగ్, జాన్‌ జోసెఫ్, దీపు వేణుగోపాల్, ప్రీత్‌ కరణ్‌. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement