6న విజయవాడలో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌ | Hyderabad Blackhawks selection trials in Vijayawada on 6th august | Sakshi
Sakshi News home page

6న విజయవాడలో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ సెలక్షన్‌ ట్రయల్స్‌

Aug 1 2026 3:59 AM | Updated on Aug 1 2026 3:59 AM

Hyderabad Blackhawks selection trials in Vijayawada on 6th august

సాక్షి, హైదరాబాద్‌: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌) ఫ్రాంచైజీ హైదరాబాద్‌ బ్లాక్‌ హాక్స్‌ ఈనెల 6వ తేదీన అండర్‌–21
సెలక్షన్‌ ట్రయల్స్, సీనియర్‌ ఓపెన్‌ ట్రయల్స్‌ నిర్వహించనుంది. విజయవాడలోని వీఆర్‌ సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజీ ఇండోర్‌ స్టేడియంలో ఈ ట్రయల్స్‌ జరుగుతాయి. ఉదయం ఎనిమిది గంటలకు అండర్‌–21 పురుషుల కేటగిరీ కోసం... సాయంత్రం ఐదు గంటలకు పీవీఎల్‌ వచ్చే సీజన్‌లో పాల్గొనే హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ప్రధాన జట్టు కోసం ట్రయల్స్‌ ఏర్పాటు చేశారు.

పీవీఎల్‌ తదుపరి సీజన్‌లో హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ప్రధాన జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్లేయర్లు ఓపెన్‌ ట్రయల్స్‌కు హాజరుకావచ్చు. ‘ఈ సీజన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్లు బ్లాక్‌హాక్స్‌కు ప్రాతినిధ్యం వహించాలన్నదే మా కోరిక. ఓపెన్‌ ట్రయల్స్‌ వారికి ఈ అవకాశం కల్పిస్తుంది’ అని హైదరాబాద్‌ బ్లాక్‌హాక్స్‌ ప్రధాన యజమాని కంకణాల అభిషేక్‌ రెడ్డి తెలిపారు. అండర్‌–21 ట్రయల్స్‌ ఎంట్రీలు ముగియగా... ఓపెన్‌ ట్రయల్స్‌లో పాల్గొనాలనుకునేవారు తమ పేర్లను  primevolleyballleague.com/player-registration  వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement