న్యూజిలాండ్‌ బ్యాటర్‌ విధ్వంసం.. 21 సిక్సర్లతో ఊచకోత | Bevon Jacobs Scripts Massive List A Feat With 21 Sixes, Joins Elite List | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ బ్యాటర్‌ విధ్వంసం.. 21 సిక్సర్లతో ఊచకోత

Nov 12 2026 1:05 PM | Updated on Nov 12 2026 1:05 PM

Bevon Jacobs Scripts Massive List A Feat With 21 Sixes, Joins Elite List

source: X

న్యూజిలాండ్ యువ బ్యాటర్ బెవాన్ జాకబ్స్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇటీవల భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో తన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న జాకబ్స్‌.. తాజాగా దేశవాళీ క్రికెట్‌లో సంచలనం సృష్టించాడు. ఫోర్డ్ ట్రోఫీలో భాగంగా ఆక్లాండ్ తరఫున ఆడుతూ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అంతేకాదు, లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు.

నవంబర్ 12న ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ ఔటర్ ఓవల్ వేదికగా ఒటాగోతో జరిగిన మ్యాచ్‌లో జాకబ్స్ ఈ ఘనత సాధించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 137 బంతుల్లోనే అజేయంగా 202 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 21 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. లిస్ట్-ఏ క్రికెట్‌లో జాకబ్స్‌కు ఇదే తొలి సెంచరీ, తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం.

లిస్ట్-ఏ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్లు
లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ల జాబితాలో జాకబ్స్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో డార్సీ షార్ట్ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడు. 
- 23 సిక్సర్లు - డార్సీ షార్ట్ (క్వీన్స్‌లాండ్‌పై, 2018)
- 21 సిక్సర్లు - బెవాన్ జాకబ్స్ (ఒటాగోపై, 2026)
- 17 సిక్సర్లు - గెర్రీ స్నైమన్ (యూఏఈపై, 2007)
- 17 సిక్సర్లు - ఇయాన్ మోర్గాన్ (ఆఫ్ఘనిస్థాన్‌పై, 2019)

మ్యాచ్‌ విషయానికొస్తే.. జాకబ్స్‌ విధ్వంసం సృష్టించడంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆక్లాండ్‌ 334 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అయితే ఆక్లాండ​్‌ నిర్దేశించిన లక్ష్యాన్ని ఒటాగో మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించడం విశేషం.

ఇదీ చదవండి: IPL 2027: కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్న అక్షర్..?


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement