శ్రీలంక కెప్టెన్‌గా పవన్ రత్నాయకే | Sri Lanka Announce Squad For ACC Rising Stars Asia Cup 2026 | Sakshi
Sakshi News home page

శ్రీలంక కెప్టెన్‌గా పవన్ రత్నాయకే

Nov 12 2026 6:59 PM | Updated on Nov 12 2026 7:13 PM

Sri Lanka Announce Squad For ACC Rising Stars Asia Cup 2026

దోహా వేదికగా జరగనున్న 'ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026' టోర్నీ కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా యువ ఆటగాడు పవన్ రత్నాయకేను నియమించారు. 24 ఏళ్ల పవన్ రత్నాయకేకు సీనియర్ స్థాయి జట్టుకు నాయకత్వం వహించడం ఇదే తొలిసారి.

గతంలో ఏజ్-గ్రూప్ క్రికెట్‌లో కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ స్థాయిలో తన నాయకత్వ ప్రతిభను నిరూపించుకోవడానికి ఈ టోర్నీ అతడికి ఒక గొప్ప అవకాశంగా నిలవనుంది. ఇక ఈ జట్టులో సీనియర్‌ ఆటగాళ్లు  నిషాన్ మదుష్క, జనిత్ లియానగే, నిపున్ ధనంజయ, విజయకాంత్ వియాస్కాంత్‌లకు చోటు దక్కింది.

కాగా ఈ టోర్నీ నవంబర్ 19 నుంచి 29 వరకు 50 ఓవర్ల ఫార్మాట్‌లో జరగనుంది.  శ్రీలంక-ఏ జట్టు బంగ్లాదేశ్-ఏ, అఫ్గానిస్థాన్-ఏ, హాంకాంగ్ జట్లతో కలిసి 'గ్రూప్-ఏ'లో ఉంది. లంక జట్టు తమ తొలి మ్యాచ్‌లో నవంబర్ 19న అఫ్గానిస్థాన్-ఏతో తలపడనుంది. 

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026కు శ్రీలంక-ఏ జట్టు:
పవన్ రత్నాయకే (కెప్టెన్), లసిత్ క్రూస్‌పుల్లె, సినెత్ జయవర్ధనే, నిషాన్ మదుష్క, నిపున్ ధనంజయ, చమిక హీనటిగల, జనిత్ లియానగే, షరుజన్ షణ్ముగనాథన్, రవిందు ఫెర్నాండో, విజయకాంత్ వియాస్కాంత్, వనుజ సహన్, దులజ్ సముదిత, దువిందు రణతుంగ, లహిరు సమరకూన్, గరుక సంకేత్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement