సుందర్‌కు రూ. 75 లక్షల చెక్కును అందజేసిన తమిళనాడు సీఎం విజయ్‌ | tamil Nadu Chief Minister Joseph Vijay handed over 75 Lakhs to Washington Sundar | Sakshi
Sakshi News home page

సుందర్‌కు రూ. 75 లక్షల చెక్కును అందజేసిన తమిళనాడు సీఎం విజయ్‌

Oct 8 2026 7:32 PM | Updated on Oct 8 2026 7:40 PM

tamil Nadu Chief Minister Joseph Vijay handed over 75 Lakhs to Washington Sundar

ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన పురుషుల క్రికెట్‌ జట్టులోని కీలక సభ్యుడు వాషింగ్టన్‌ సుందర్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసఫ్‌ విజయ్‌ రూ. 75 లక్షల చెక్కును అందజేశారు.

ఇదే ఆసియా క్రీడల్లో స్వర్ణం​ సాధించిన మహిళల క్రికెట్‌ జట్టులోని కీలక సభ్యురాలు జి కమలినికి కూడా ఇదే క్యాష్‌ రివార్డును అందజేశారు. ఆసియా క్రీడల్లో భారత మహిళల, పురుషుల క్రికెట్‌ జట్లు స్వర్ణ పతకాలు సాధించిన వెంటనే సీఎం విజయ్‌ నజరానా ప్రకటించారు. ప్రకటించిన విధంగా సుందర్‌, కమలిని స్వరాష్ట్రానికి చేరకున్న కొద్ది రోజుల్లోనే క్యాస్‌ రివార్డును అందజేశారు.

కాగా, ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌ ఫైనల్లో భారత్‌ శ్రీలంకపై 147 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో టీమిండియా తమ చిరకాల ప్రత్యర్ది పాకిస్తాన్‌పై విజయం సాధించి, స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. మహిళలు, పురుషుల విభాగంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన  భారత జట్లు విజయవంతంగా స్వర్ణాన్ని నిలబెట్టుకున్నాయి. 

ఇదీ చదవండి: WPLపై ఆసీస్‌ స్టార్‌ విమర్శలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement