WPLపై ఆసీస్‌ స్టార్‌ విమర్శలు | Ellyse Perry Criticises WPL Scheduling | Sakshi
Sakshi News home page

WPLపై ఆసీస్‌ స్టార్‌ విమర్శలు

Oct 8 2026 6:59 PM | Updated on Oct 8 2026 7:25 PM

Ellyse Perry Criticises WPL Scheduling

source: X

భారత్‌లో జరిగే మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL)పై ఆసీస్‌ స్టార్‌ క్రికెటర్‌ ఎల్లిస్‌ పెర్రీ విమర్శలు చేసింది. టోర్నీ తదుపరి ఎడిషన్‌ షెడ్యూల్‌పై ఆమె అసంతృప్తి వెల్లగక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌కు మరింత సమయం ఇవ్వాలని డిమాండ్ చేసింది.

2027 మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు జరగనుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియాలో కీలక అంతర్జాతీయ షెడ్యూల్ ఉంది. WPL కారణంగా ఇందులో పాల్గొనే అవకాశాలు పరిమితంగా మారతయని పెర్రీ అభిప్రాయపడింది. WPL, అస్ట్రేలియా అంతర్జాతీయ షెడ్యూల్‌ క్లాష్‌ కావడం బాధాకరమని తెలిపింది.

ఎల్లిస్‌ పెర్రీ WPLలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తుంది. వ్యక్తిగత కారణాల చేత ఆమె గత సీజన్‌కు దూరమైంది. తదుపరి సీజన్‌కు ఆమె అందుబాటులో ఉంటుందో లేదో చూడాలి.

ఇదిలా ఉంటే, WPLకి ముందు ఆస్ట్రేలియాలో మహిళల బిగ్ బాష్ లీగ్ (WBBL) 2026 సీజన్‌ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు జరగనుంది. రోజుల వ్యవధిలో WPL 2027 ప్రారంభం కానుంది.

ఇదీ చదవండి: ఆసీస్‌తో తొలి టెస్ట్‌.. సౌతాఫ్రికా తుది జట్టు ప్రకటన.. స్టార్‌ ప్లేయర్‌ ఔట్‌


 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement