టీమిండియా యువ పేసర్ మయాంక్ యాదవ్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు. దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి వచ్చిన మయాంక్.. హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్నతొలి టీ20లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు.
గంటకు దాదాపు 150 వేగంతో బౌలింగ్ చేస్తూ జింబాబ్వే బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మయాంక్ ఇన్నింగ్స్ మొదటి బంతికే జింబాబ్వే స్టార్ బ్రియాన్ బెన్నెట్‌ను అవుట్ చేసి భారత్‌కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్లలోనూ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి మరో వికెట్ పడగొట్టాడు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మయాంక్‌తో పవర్‌ప్లేలోనే తన కోటాలోని మూడు ఓవర్లు బౌలింగ్ చేయించాడు. ఆఖరిలో మరో ఓవర్ అతడు బౌలింగ్ చేశాడు. మయాంక్ మొత్తంగా తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు సాధించాడు. ఈ ఢిల్లీ పేసర్ 2024లో భారత తరపున అరంగేట్రం చేశాడు.
కానీ వరుస గాయాలతో దాదాపు రెండేళ్ల పాటు జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున బరిలోకి దిగాడు. అక్కడ పెద్దగా రాణించికపోయినప్పటి అతడిపై మరోసారి బీసీసీఐ సెలక్షన్ కమిటీ నమ్మకం ఉంది. అర్ష్‌దీప్ సింగ్, బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వడంతో జింబాబ్వే టూర్‌కు మయాంక్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో తనకు లభించిన అవకాశాన్ని అతడు రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు.


