
టీమిండియా స్పీడ్ స్టార్, లక్నో సూపర్ జెయింట్స్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ మరోసారి గాయపడ్డాడు. మయాంక్ యాదవ్ వెన్ను గాయం కారణంగా ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని లక్నో ఫ్రాంచైజీ గురువారం ధ్రువీకరిచింది. కాగా మయాంక్ ఈ ఏడాది సీజన్ మధ్యలో గాయం నుంచి కోలుకుని లక్నో జట్టులో చేరాడు.
ఈ క్రమంలో కేవలం రెండు మ్యాచ్‌లు ఆడిన యాదవ్‌కు తన వెన్నుగాయం తిరగబెట్టింది. దీంతో అతడు మళ్లీ బెంగళూరులోని ఏన్సీఎకు వెళ్లనున్నాడు. తరుచూ గాయాల బారిన పడతుండడంతో అతడి కెరీర్ ప్రశ్నార్ధకంగా మారింది. ఇక మయాంక్ యాదవ్ స్ధానాన్ని న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ విలియం ఓరూర్క్‌తో లక్నో భర్తీ చేసింది.
కివీ పేసర్‌ను రూ. 3 కోట్ల రిజర్వ్ ధరకు సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. ఓ రూర్క్ న్యూజిలాండ్ జట్టులో ప్రస్తుతం కీలక సభ్యునిగా కొనసాగుతున్నాడు. భారతగడ్డపై న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంలో రూర్క్‌ది కీలక పాత్ర. ఈ క్రమంలోనే అతడితో లక్నో ఒప్పందం కుదుర్చుకుంది.
మరోవైపు పంజాబ్ కింగ్స్ కూడా గాయపడిన లాకీ ఫెర్గూసన్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని ప్రకటించింది. మరో న్యూజిలాండ్ స్పీడ్ స్టార్ కైల్ జామీసన్ పంజాబ్ తమ జట్టులోకి తీసుకుంది. జామీసన్ గతంలో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాడు. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తల కారణంగా ఆర్ధరంతరంగా ఆగిపోయిన ఈ ఏడాది ఐపీఎల్ సీజన్.. తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: IND vs ENG: ఇంగ్లండ్ టూర్‌కు భారత జట్టు ప్రకటన.. విధ్వంసకర ఓపెనర్ రీ ఎంట్రీ