PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్‌పై గెలిచి ఫుల్ జోష్‌లో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌కు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ త్వరలోనే పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. వెన్ను గాయంతో బాధపడుతున్న మయాంక్ ప్రస్తుత బెంగుళూరులోని సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ (CoE)లో శరవేగంగా కోలుకుంటున్నాడు.
మరో పది రోజుల్లో అతడు లక్నో జట్టులో చేరే అవకాశముంది. ఏప్రిల్ 14న సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వైద్య బృందం అతడికి ఫిట్‌నెస్ పరీక్ష నిర్వహించనుంది. ఆ పరీక్షలో యాదవ్ ఉత్తీరణత సాధిస్తే.. అతడికి ఐపీఎల్‌లో ఆడేందుకు క్లియరెన్స్ లభించనుంది. ఈ విషయాన్నిసెంటర్ ఫర్ ఎక్సలెన్స్ వర్గాలు ధ్రువీకరించాయి.
మయాంక్ గాయంపై లక్నో హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ కూడా అప్‌డేట్ ఇచ్చాడు. మయాంక్ 90 శాతం ఫిట్‌నెస్ సాధించాడని, త్వరలోనే తిరిగి వస్తాడని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో లాంగర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. అదేవిధంగా ఈ విలేకరుల సమావేశంలో లాంగర్ తన చర్యతో అందరిని ఆకట్టుకున్నాడు.
అసలేమి జరిగిందంటే?
ప్రెస్ కాన్ఫరెన్స్ మొదలయ్యే ముందు వాయిస్ రికార్డు కోసం టేబుల్ పై ఉంచిన ఫోన్లలో ఒక ఫోన్ మోగింది. ఓ రిపోర్ట్‌కు తన అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే ఫోన్ తీసుకున్న లాంగర్. ఎవరి అమ్మ ఫోన్ చేశారు అని అడిగాడు. 
కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడాడు. అమ్మా.. అర్ధరాత్రి 12:08 అయింది. నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఉన్నాను" అని ఆ రిపోర్టర్ తల్లితో చెప్ని లాంగర్ కాల్ కట్‌చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇక  గతేడాది సీజన్‌తో ఐపీఎల్ అరంగేట్రం చేసిన మయాంక్ యాదవ్.. తన అద్భుతమైన ప్రదర్శనతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయాడు. అయితే తరుచుగా గాయాల బారిన పడడంతో మయాంక్ ఎక్కువగా బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన యాదవ్.. 7 వికెట్లు పడగొట్టాడు. గాయాలతో సతమతవుతున్నప్పటికి లక్నో మాత్రం అతడిపై నమ్మకం ఉంచింది. ఐపీఎల్-2025 సీజన్‌కు ముందు రూ.11 కోట్లకు అతడిని లక్నో రిటైన్ చేసుకుంది.
చదవండి: IPL 2025 MI Vs LSG: బెడిసికొట్టిన వ్యూహం.. ఏం చేస్తున్నావ్ హార్దిక్? .. ఆకాశ్ అంబానీ రియాక్షన్ వైరల్
Justin Langer picks up a call during the press conference. 🤣❤️pic.twitter.com/4lqRWcdfv1
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 4, 2025

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
