ఐపీఎల్ 2026 ప్రారంభానికి ఇంకా ఐదు నెలల సమయం ఉండగానే ఫ్రాంచైజీలన్నీ తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. ఆటగాళ్ల రిటెన్షన్‌కు నవంబర్ 15 డెడ్‌లైన్ కావడంతో మార్పులు చేర్పుల విషయంలో తలమునకలై ఉన్నాయి. మరో పక్క ట్రేడ్ డీల్స్ విషయంలోనూ చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి.
సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ను వీడి సీఎస్‌కేలో చేరడం.. రవీంద్ర జడేజా, సామ్ కర్రన్ సీఎస్‌కే నుంచి రాయల్స్‌కు ట్రేడ్ కావడం దాదాపుగా ఖరరాపోయింది. మరి కొంత మంది ఆటగాళ్ల విషయంలోనూ ట్రేడింగ్ జరిగే అవకాశం ఉందని ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి.
కేఎల్ రాహుల్ కోసం కేకేఆర్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కేకేఆర్ స్పిన్నర్ మయాంక్ మార్కండే, ఎస్‌ఆర్‌హెచ్ స్పిన్నర్ రాహుల్ చాహర్ కోసం ముంబై ఇండియన్స్ ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్ టైటాన్స్ సైతం ఓ కీలక ఆటగాడిని ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
రిటెన్షన్ ప్రక్రియ పూర్తయ్యాక, ఫ్రాంచైజీలు వేలంపై దృష్టి సారిస్తాయి. వేలంలో ఎవరెవరిని తీసుకోవాలో ఇప్పటి నుంచే ఓ ప్లాన్ వేసుకుంటున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్ దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. అర్జున్ టెండూల్కర్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ యత్నిస్తున్నట్లు సమాచారం.
ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడి కోసం ప్రయత్నించే అవకాశం ఉందన్న విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
కాగా, ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మెగా టోర్నీ మే 31న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. మినీ వేలం డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో జరిగే అవకాశం ఉంది.
చదవండి: హార్దిక్ పాండ్యా కీలక నిర్ణయం


