క్రికెట్ మ్యాచ్‌కు చూసేందుకు స్టేడియం వెళ్లిన ఓ అభిమానిని అదృష్టం వరించింది. ఒక్క క్యాచ్‌తో రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. అవును మీరు విన్నది నిజమే. పూర్తి వివరాలు తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే. సౌతాఫ్రికా టీ20 లీగ్ 2025-26 తొలి మ్యాచ్‌లో పరుగుల వరద పారింది.
ఎంఐ కేప్ టౌన్, డర్బన్ సూపర్ జెయింట్స్ నువ్వానేనా అన్నట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ స్కోరు సాధించింది. డర్బన్ బ్యాటర్లలో డెవాన్ కాన్వే (64) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేన్ విలియమ్సన్ (40), మార్‌క్రమ్(35) రాణించారు. అనంతరం భారీ లక్ష్య చేధనలో ర్యాన్ రికెల్టన్ అద్భుతసెంచరీతో మెరిశాడు. మిగిత బ్యాటర్లను పెద్దగా సహకరం లభించనప్పటికి రికెల్టన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.
సూపర్ క్యాచ్..
ఈ క్రమంలో 13వ ఓవర్ వేసిన మఫాక బౌలింగ్‌లో నాలుగో బంతికి రికెల్టన్ భారీ సిక్సర్ బాదాడు. ఆ బంతి నేరుగా స్టాండ్స్‌లోకి వెళ్లగా అక్కడే ఉన్న ఓ అభిమాని ఒంటి చేత్తో అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో అతడు కోటీశ్వరుడయ్యాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్ నిబంధనల ప్రకారం.. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు ఎవరైనా సిక్స్ కొట్టినప్పుడు 2 మిలియన్ రాండ్లు(భారత కరెన్సీలో రూ. 1.08 కోట్లు) బహుమతిగా ఇవ్వనున్నారు.
ఈ సీజన్‌లో ఈ భారీ నగదు బహుమతిని గెలుచుకున్న మొదటి వ్యక్తి అతడే. ఒకవేళ టోర్నమెంట్ మొత్తం మీద మరికొంతమంది కూడా ఇలాంటి క్యాచ్‌లు పడితే, ఈ 2 మిలియన్ రాండ్ల మొత్తాన్ని వారందరికీ సమానంగా పంచుతారు. కాగా ఈ మ్యాచ్‌లో ఎంఐ కేప్ టౌన్‌పై 15 పరుగుల తేడాతో డర్బన్ సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది.
చదవండి: IND vs NZ: రిషబ్ పంత్‌కు భారీ షాక్.. జట్టులోకి డబుల్ సెంచరీ వీరుడు!
First match, first #BetwayCatch2Million catch 👌💯#BetwaySA20 #MICTvDSG #WelcomeToIncredible pic.twitter.com/ftDVL1CtWy
— Betway SA20 (@SA20_League) December 26, 2025


