శ్రీలంకతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 కోసం 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రకటించింది. ఈ జట్టుకు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహించనున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2026కు ముందు సల్మాన్ పీసీబీ వేటు వేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
కానీ పాక్ క్రికెట్ బోర్డు అతడిపై మరోసారి నమ్మకం ఉచింది. కాగా ఈ సిరీస్‌కు స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్‌లు దూరమయ్యారు. వీరు ముగ్గురు ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతుండడంతో సెలక్టర్లు పక్కన పెట్టారు. ఈ సీనియర్ త్రయం బిగ్ బాష్ పూర్తి సీజన్‌కు అందుబాటులో ఉండనున్నారు.
ఇక భుజం సర్జరీ కారణంగా ఈ ఏడాది జూన్ నుంచి జట్టుకు దూరంగా స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ రీఎంట్రీ ఇచ్చాడు. ప్రపంచకప్ ముందు అతడి రాక జట్టుకు పెద్ద బలంగా మారనుంది. మరోవైపు డొమాస్టిక్ క్రికెట్‌లో దుమ్ములేపుతున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఖవాజా నఫాయ్‌కు తొలిసారిగా జాతీయ జట్టులో చోటు దక్కింది. ఈ సిరీస్ జనవరి 7 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం మూడు మ్యాచ్‌లు డంబుల్లా వేదికగానే జరగనుంది. టీ20 ప్రపంచకప్ సన్నాహాకాల్లో భాగంగా ఈ సిరీస్ జరగనుంది.
మ్యాచ్‌ల షెడ్యూల్ (దంబుల్లా):
మొదటి టీ20: జనవరి 7
రెండవ టీ20: జనవరి 9
మూడవ టీ20: జనవరి 11
శ్రీలంకతో టీ20లకు పాక్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫాయ్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ సల్మాన్ మీర్జా, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్ (వికెట్ కీపర్), సైమ్ అయూబ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), ఉస్మాన్ తారిఖ్.
చదవండి: IND vs NZ: రిషబ్ పంత్‌కు భారీ షాక్.. జట్టులోకి డబుల్ సెంచరీ వీరుడు!


