దక్షిణాఫ్రికా టీ20 లీగ్ (SA20) 2025-26 సీజన్‌ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ ఘనంగా ఆరంభించింది. ఈ టోర్నీలో భాగంగా శనివారం బోలాండ్ పార్క్ వేదికగా పార్ల్ రాయల్స్‌లో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 137 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పార్ల్ రాయల్స్.. 11.5 ఓవర్లలో కేవలం 42 పరుగులకే కుప్పకూలింది.
సన్‌రైజర్స్ బౌలర్ల దాటికి పార్ల్ బ్యాటింగ్ ఆర్డర్ పేక మేడలా కుప్పకూలింది. ఒక్కరంటే ఒక్కరు పట్టుమని పది నిమిషాల కూడా క్రీజులో నిలవలేకపోయారు. మొత్తం తొమ్మిది మంది బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితమయ్యారు. కెప్టెన్ మిల్లర్(7) కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. సన్‌రైజర్స్ స్పీడ్ స్టార్ అన్రిచ్ నోర్జే 4 వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ఆడమ్ మిల్నే, తరిందు రత్నాయకే తలా రెండు వికెట్లు సాధించారు.
హెర్మన్ హాఫ్ సెంచరీ..
అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోర్ సాధించింది. జోర్డాన్ హెర్మన్(5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. క్వింటన్ డికాక్(42) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
పార్ల్ రాయల్స్ చెత్త రికార్డు..
ఈ మ్యాచ్‌లో 49 పరుగులకే ఆలౌటైన పార్ల్ రాయల్స్ అత్యంత చెత్త రికార్డును తమ పేరిట లిఖించుకుంది. సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా రాయల్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఇంతకుముందు ఈ రికార్డు ప్రిటోరియా క్యాపిటల్స్(52) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో ప్రిటోరియాను రాయల్స్ అధిగమించింది.
చదవండి: వరల్డ్‌కప్ జట్టులో హైదరాబాద్ కుర్రాడు.. ఎవరీ ఆరోన్ జార్జ్?


