రుద్రాంక్ష్ గురి బంగారం అర్జున్‌కు రజతం | Indias medal hunt continues at the Asian Senior Shooting Championship | Sakshi
Sakshi News home page

రుద్రాంక్ష్ గురి బంగారం అర్జున్‌కు రజతం

Feb 7 2026 4:32 AM | Updated on Feb 7 2026 4:32 AM

Indias medal hunt continues at the Asian Senior Shooting Championship

న్యూఢిల్లీ: ఆసియా సీనియర్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ పతకాల వేట కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో వ్యక్తిగత విభాగంలో స్వర్ణం, రజతం... టీమ్‌ విభాగంలో బంగారు పతకం లభించాయి. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్‌ పద్ధతిలో జరిగిన ఫైనల్లో రుద్రాంక్ష్ పాటిల్‌ 251.9 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. భారత్‌కే చెందిన అర్జున్‌ బబూతా 250.7 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని గెలిచాడు. 

రుద్రాంక్ష్ , అర్జున్, విశాల్‌ సింగ్‌లతో కూడిన భారత బృందం 1884.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించింది. జూనియర్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో భారత షూటర్లు క్లీన్‌స్వీప్‌ చేశారు. హిమాన్షు (250 పాయింట్లు) స్వర్ణం నెగ్గగా... అన్‌‡్ష దబాస్‌ (247.9 పాయింట్లు) రజతం... సురేశ్‌ ప్రణవ్‌ (226.8 పాయింట్లు) కాంస్యం గెలిచారు. హిమాన్షు, అన్‌‡్ష, సురేశ్‌ ప్రణవ్‌లతో కూడిన భారత జట్టు 1887.8 పాయింట్లతో పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.    

Advertisement
 
Advertisement
Advertisement