హరారే వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయ్యర్ టాస్ గెలవడం ఇది వరుసగా ఎనిమిదో సారి. దీంతో అంతర్జాతీయ టీ20లలో వరుసగా 8 టాస్‌లు గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా శ్రేయస్ రికార్డులెక్కాడు.
ఇప్పటివరకు ఈ రికార్డు భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని పేరిట ఉండేది. ధోని టీమిండియా సారథిగా 2010-12 మధ్య కాలంలో వరుసగా 7 సార్లు టాస్ గెలిచాడు. తాజా మ్యాచ్‌తో ధోనిని అయ్యర్ అధిగమించాడు.
టీ20ల్లో వరుసగా టాస్‌లు గెలిచిన భారత కెప్టెన్‌లు వీరే
శ్రేయస్ అయ్యర్: 8 (జూన్ 2026 – జూలై 2026)
ఎం.ఎస్. ధోని: 7 (మే 2010 – ఫిబ్రవరి 2012)
విరాట్ కోహ్లి: 6 (ఆగస్టు 2019 – డిసెంబరు 2019)
రోహిత్ శర్మ: 5 (ఫిబ్రవరి 2020 – ఫిబ్రవరి 2022)
ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్‌లో ఈ రికార్డు వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారన్ సామీ పేరిట ఉంది. సామీ 2015-16 మధ్య కాలంలో టీ20ల్లో వరుసగా 10 టాస్‌లు గెలిచాడు. ఆ తర్వాత రెండో స్ధానంలో పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘా(9) ఉన్నాడు. వీరిద్దరి తర్వాత స్ధానంలో హ్యారీ బ్రూక్(8), ఆరోన్ ఫించ్(8)లో కలిసి శ్రేయస్ సంయుక్తంగా నిలిచాడు.
కాగా అయ్యర్ టాస్‌లు గెలుస్తున్నప్పటి మ్యాచ్‌లు మాత్రం గెలవడం లేదు. ఇప్పటివరకు అతడి సారథ్యంలో 7 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా.. 6 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది.


