సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌కు జాక్‌పాట్‌.. కెప్టెన్‌గా ప్రమోషన్‌ | SRHs IPL Star Named Captain In Renowned T20 League With Kusal Mendis Injury | Sakshi
Sakshi News home page

సన్‌రైజర్స్‌ ఆల్‌రౌండర్‌కు జాక్‌పాట్‌.. కెప్టెన్‌గా ప్రమోషన్‌

Jul 23 2026 5:11 PM | Updated on Jul 23 2026 5:38 PM

SRHs IPL Star Named Captain In Renowned T20 League With Kusal Mendis Injury

లంకా ప్రీమియర్ లీగ్ (LPL) 2026 సీజన్ మధ్యలోనే 'కొలంబో క్యాప్స్' జట్టుకు భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ కుశాల్ మెండిస్ తొడ కండరాల గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగాడు. ఈ క్రమంలో కొలంబో క్యాప్స్ మేనెజ్‌మెంట్‌ తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఆల్‌రౌండర్ కమిందు మెండిస్‌కు అప్పగించింది.

గురువారం దాంబుల్లా వేదికగా క్యాండీ రాయల్స్‌తో మ్యాచ్‌లో కొలంబో కెప్టెన్‌గా కమిందు వ్యవహరిస్తున్నాడు. అయితే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లో మెండిస్ నిరాశపరిచాడు. కేవలం​ ఒక్క పరుగు మాత్రమే చేసి షాహీన్ అఫ్రిది బౌలింగ్‌లో ఔటయ్యాడు. 2020 లో ఎల్‌పీఎల్‌ అరంగేట్రం చేసిన కమిందు ఇప్పటివరకు 43 మ్యాచ్‌ల్లో 877 పరుగులతో పాటు 8 వికెట్లు తీశాడు. 

ఈ శ్రీలంక ఆల్‌రౌండర్ ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఐపీఎల్ 2025లో 'బెస్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్' అవార్డును అతడు గెలుచుకున్నాడు. అంతేకాకుండా ఒకే ఓవర్‌లో రెండు యాక్షన్స్‌తో బౌలింగ్ అందరిని ఆశ్చర్చపరిచాడు. కానీ ఐపీఎల్‌-2026లో మాత్రం కమిందు మెండిస్‌కు ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు.
చదవండి: IND vs ZIM: టీమిండియా తరఫున అతడి అరంగేట్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement