Source: The Bridge
లంక ప్రీమియర్ లీగ్ (LPL) 2026 ప్రారంభానికి కొద్ది గంటల ముందు సంచలన పరిణామం చోటు చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీ సహ యజమాని మంజోత్ కల్రాను శ్రీలంక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు విభాగం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు.
టోర్నీ ప్రారంభానికి ముందే ఓ ఆటగాడిని మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రేరేపించే ప్రయత్నం చేశారనే ఆరోపణల నేపథ్యంలో మంజోత్ కల్రాపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని శ్రీలంక పోలీసులు వెల్లడించారు. క్రీడల్లో అవినీతి నిరోధానికి శ్రీలంకలో కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి.

టీమిండియా కెప్టెన్ సహచరుడు
మంజోత్ కల్రా భారత అండర్-19 జట్టు మాజీ క్రికెటర్ 2018 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ శతకం బాది భారత్‌కు టైటిల్ అందించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఆ జట్టులో పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు.
డిఫెండింగ్ చాంపియన్‌గా జాఫ్నా
మైదానం వెలుపల వివాదం నెలకొన్నప్పటికీ, జాఫ్నా కింగ్స్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఎల్‌పీఎల్ 2026 బరిలోకి దిగుతోంది. భానుక రాజపక్స కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న ఈ జట్టులో షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్, సందీప్ లామిచానే, అవిష్క ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, ఇబ్రహీం జద్రాన్, డేవిడ్ వీజ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ గాలే జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఇవాళ (జులై 17) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.


