breaking news
manjot kalra
-
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్.. ట్విస్ట్ ఇచ్చిన కల్రా!
ఫిక్సింగ్ వివాదంపై భారత అండర్-19 జట్టు మాజీ క్రికెటర్, లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) ఫ్రాంచైజీ జాఫ్నా కింగ్స్ సహ యజమాని మన్జోత్ కల్రా స్పందించాడు. తాను నిర్దోషినని.. తనను కావాలనే కుట్రపూరితంగా ఇరికించే ప్రయత్నం జరిగిందని వాపోయాడు. ప్రసుతం కేసు విచారణలో ఉన్నందున.. తాను దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకారం అందిస్తానని స్పష్టం చేశాడు.అదే సమయంలో నిజమైన దోషులకు శిక్ష పడుతుందనే నమ్మకం తనకు ఉందని కల్రా ఈ సందర్భంగా పేర్కొన్నాడు. తాను అవినీతికి పాల్పడ్డట్లు ఆధారాలు లేవని.. తమ న్యాయవాద బృందం తనను నిర్దోషిగా నిరూపించేందుకు కృషి చేస్తోందని తెలిపాడు.తనను ఫిక్సింగ్‌లో ఇరికించిన నిజమైన దోషులు త్వరలోనే బయటకు వస్తారని.. అంతిమంగా సత్యమే విజయం సాధిస్తుందని పేర్కొన్నాడు. ఈ మేరకు కల్రా తరఫున అతడి టీమ్ ప్రకటన విడుదల చేసింది.అరెస్టు చేసిన అధికారులుకాగా మన్జోత్ కల్రాను... శ్రీలంక క్రీడా అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం నాటి ఎల్పీఎల్ ఆరో సీజన్ ప్రారంభానికి ముందు ఓ ఆటగాడికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించిన ఆరోపణలపై అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని.. కొలంబో న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. ఈనెల 31 వరకు కల్రాకు రిమాండ్ విధించారు.ఎల్పీఎల్తో సంబంధం ఉన్న ఓ ఆటగాడిని డబ్బుతో ప్రలోభపెట్టడానికి ప్రయత్నించినట్లు కల్రాపై ఆరోపణలు వచ్చాయి. టోర్నీ ఆరంభానికి పది రోజుల ముందు నుంచే ఆ ప్లేయర్‌ను మన్జోత్ మభ్యపెడుతూ ఉండగా... అతడు అధికారులను అప్రమత్తం చేయడంతో శుక్రవారం కల్రాను అధికారులు అరెస్ట్ చేశారు. జాఫ్నా కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీలంక క్రికెటర్లు భానుక రాజపక్స, అవిష్క ఫెర్నాండో, దునిత్ వెల్లలాగే కల్రాపై ఫిర్యాదు చేసినట్లు శ్రీలంక పోలీసులు వెల్లడించారు. నాడు ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’గా నిలిచి... న్యూజిలాండ్ ఆతిథ్యమిచ్చిన 2018 అండర్–19 ప్రపంచకప్‌లో శుబ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, పృథ్వీ షా, రియాన్ పరాగ్‌లతో కలిసి మన్జోత్ కల్రా ఆడాడు. ఆస్ట్రేలియా జరిగిన ఫైనల్లో కల్రా అజేయ సెంచరీతో జట్టును గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డు గెల్చుకున్నాడు. 2018 ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కల్రాను కొనుగోలు చేసింది.తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో అయితే అతనికి ఐపీఎల్ మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. 2019లో కల్రా అసలు వయసును దాచి తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలు సమర్పించి అండర్–19 ప్రపంచకప్‌లో ఆడాడని విచారణలో తేలింది. దాంతో 2020లో ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) కల్రాపై రెండేళ్లపాటు నిషేధం విధించింది. అయితే ఈ నిషేధాన్ని తర్వాత ఎత్తి వేసినా సీనియర్ స్థాయిలో కల్రా కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. దాంతో అతడు వ్యాపార రంగంపై దృష్టి పెట్టాడు.ఇది కొత్తేం కాదుఈ ఏడాది ఆరంభంలోనే జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీలో వాటా కొనుగోలు చేశాడు. అయితే, ఈ ఫ్రాంఛైజీలో కల్రా వాటా అతి తక్కువ అని తాజా ప్రకటనలో అతడి టీమ్ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఎల్పీఎల్లో మ్యాచ్ ఫిక్సింగ్ వార్తలు రావడం ఇది కొత్తేం కాదు. ఈ ఏడాది ఆరంభంలో ఆటగాళ్లను బెట్టింగ్ వైపు పురిగొల్పిన ఓ ఫ్రాంచైజీ యజమానిపై లంక కోర్టు నాలుగేళ్ల నిషేధం విధించింది. -
మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు.. శుభ్‌మన్ గిల్ సహచరుడు అరెస్ట్
లంక ప్రీమియర్ లీగ్ (LPL) 2026 ప్రారంభానికి కొద్ది గంటల ముందు సంచలన పరిణామం చోటు చేసుకుంది. డిఫెండింగ్ చాంపియన్ జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీ సహ యజమాని మంజోత్ కల్రాను శ్రీలంక పోలీసుల ప్రత్యేక దర్యాప్తు విభాగం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ చేసింది. ఈ విషయాన్ని స్థానిక అధికారులు ధృవీకరించారు.టోర్నీ ప్రారంభానికి ముందే ఓ ఆటగాడిని మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రేరేపించే ప్రయత్నం చేశారనే ఆరోపణల నేపథ్యంలో మంజోత్ కల్రాపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని శ్రీలంక పోలీసులు వెల్లడించారు. క్రీడల్లో అవినీతి నిరోధానికి శ్రీలంకలో కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయి.టీమిండియా కెప్టెన్ సహచరుడుమంజోత్ కల్రా భారత అండర్-19 జట్టు మాజీ క్రికెటర్ 2018 అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయ శతకం బాది భారత్‌కు టైటిల్ అందించడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఆ జట్టులో పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ వంటి ఆటగాళ్లు కూడా ఉన్నారు.డిఫెండింగ్ చాంపియన్‌గా జాఫ్నామైదానం వెలుపల వివాదం నెలకొన్నప్పటికీ, జాఫ్నా కింగ్స్ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఎల్పీఎల్ 2026 బరిలోకి దిగుతోంది. భానుక రాజపక్స కెప్టెన్సీలో బరిలోకి దిగనున్న ఈ జట్టులో షకీబ్ అల్ హసన్, తస్కిన్ అహ్మద్, సందీప్ లామిచానే, అవిష్క ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, ఇబ్రహీం జద్రాన్, డేవిడ్ వీజ్ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఉన్నారు. టోర్నీ తొలి మ్యాచ్‌లో జాఫ్నా కింగ్స్ గాలే జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ ఇవాళ (జులై 17) రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. -
గిల్, పృథ్వీ షాతో కలిసి ఆడాడు.. కట్ చేస్తే! ఇప్పుడు ఓ జట్టునే కొనేశాడు
మన్జోత్ కల్రా.. ఈ క్రికెటర్ గురుంచి చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ 2018 అండర్-19 ప్రపంచకప్‌ను భారత్ సొంతం చేసుకోవడంలో అతడిది కీలక పాత్ర. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో అద్భుతమైన సెంచరీ సాధించి టీమిండియాను మన్జోత్ ఛాంపియన్‌గా నిలిపాడు.ఆ టోర్నమెంట్ సమయంలో పృథ్వీ షా, శుభమన్ గిల్ వంటి స్టార్లతో సమానంగా మన్జోత్ కల్రా పేరు కూడా మారుమోగింది. భారత క్రికెట్‌కు మరో సూపర్ స్టార్ దొరికాడని అంతా భావించారు. ఆ టోర్నీ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పట్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్) అతన్ని ఐపీఎల్ కోసం కొనుగోలు చేసింది. అయితే 2019లో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన కొద్దికాలానికే అతడి కెరీర్ ఊహించని మలుపులు తిరిగింది. వయస్సులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కల్రాపై ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఏడాది పాటు నిషేధం విధించింది. ఆ తర్వాత పునరాగనమం చేసినప్పటికి అతడు రాణించలేకపోయాడు. మన్జోత్ కల్రా చివరగా ఢిల్లీ తరపున 2021లో లిస్ట్-ఏ క్రికెట్లో ఆడాడు.ఫ్రాంచైజీ ఓనర్‌గా కల్రాఅయితే మన్జోత్ కల్రా మళ్లీ ఇప్పుడు ఐదేళ్ల తర్వాత క్రికెట్ ప్రపంచంలో సరికొత్త పాత్రలో కన్పించేందుకు సిద్దమయ్యాడు. లంక ప్రీమియర్ లీగ్‌లో జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీకి సహ-యజమానిగా అతడు మారాడు. మన్జోత్ .. ప్రముఖ పారిశ్రామికవేత్త మయాంక్ గోయెల్‌తో కలిసి 'స్పోర్ట్స్ కమ్యూన్' అనే సంస్థ ద్వారా జాఫ్నా కింగ్స్ జట్టులో వాటాలను కొనుగోలు చేశాడు.ఫ్రాంచైజీకి సంబంధించిన వ్యూహాలు, ఆటగాళ్ల ఎంపిక, ఆపరేషన్స్ బాధ్యతలను కల్రా పర్యవేక్షించనున్నాడు. లంక ప్రీమియర్ లీగ్-2026 సీజన్ జూలై 17 నుంచి ప్రారంభం కానుంది.చదవండి: అప్పటి నుంచి ధోని అస్సలు నచ్చలేదు: గంగూలీ -
భారత యువ క్రికెటర్‌పై ఏడాది నిషేధం
న్యూఢిల్లీ: రెండేళ్ల క్రితం న్యూజిలాండ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్–19 ప్రపంచకప్ ఫైనల్లో సెంచరీతో భారత్‌ను గెలిపించిన ఓపెనర్ మన్‌జ్యోత్ కాల్రాపై... రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో ఆడకుండా ఢిల్లీ జిల్లా క్రికెట్ సంఘం (డీడీసీఏ) ఏడాదిపాటు నిషేధం విధించింది. దేశవాళీ అండర్–16, అండర్–19 వయో విభాగాల్లో ఆడిన సమయంలో కాల్రా అసలు వయసుకంటే తక్కువ వయసు చూపి జట్లలోకి ఎంపికయ్యాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు తప్పని కాల్రా రుజువు చేయలేకపోయాడు. దాంతో కాల్రాపై ఏజ్ గ్రూప్ క్రికెట్ ఆడకుండా రెండేళ్లు... రంజీ ట్రోఫీ ఆడకుండా ఏడాదిపాటు నిషేధం విధిస్తున్నట్లు డీడీసీఏ అంబుడ్స్‌మన్ జస్టిస్ (రిటైర్డ్) బదర్ దురెజ్ ప్రకటించారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి రికార్డుల ప్రకారం మన్‌జ్యోత్ కాల్రా ప్రస్తుత వయస్సు 20 ఏళ్ల 351 రోజులుగా ఉంది. ఇటీవలే అండర్–23 క్రికెట్ టోర్నీలో బెంగాల్‌తో మ్యాచ్‌లో కాల్రా 80 పరుగులు చేశాడు. ఓపెనర్ ధావన్ లంకతో టి20 సిరీస్‌కు ఎంపిక కావడంతో అతని స్థానంలో కాల్రా ఢిల్లీ జట్టులోకి రావడం ఖాయమైంది. అయితే అంబుడ్స్‌మన్ తాజా నిర్ణయంతో కాల్రా ఎలాంటి క్రికెట్ ఆడే అవకాశం లేకుండా పోయింది. -
రెండో భారత క్రికెటర్‌గా..
మౌంట్ మాంగనీ: అండర్-19 వరల్డ్ కప్‌ను భారత్ సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన ఓపెనర్ మన్జోత్ కల్రా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అండర్-19 వరల్డ్ కప్ చరిత్రలో భాగంగా తుది పోరులో శతకం సాధించిన రెండో భారత క్రికెటర్‌గా మన్జోత్ నిలిచాడు. అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మన్జోత్(101 నాటౌట్) అజేయ శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఉన్ముక్త్ చంద్ తర్వాత సెంచరీ చేసిన భారత ఆటగాడిగా నిలిచాడు. 2012లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత ఆటగాడు ఉన్ముక్త్ చంద్ శతకం సాధించాడు. ఆ తర్వాత మెగా పోరు ఫైనల్లో శతకం సాధించిన టీమిండియా ఆటగాడు మన్జోత్ కల్రానే. ఓవరాల్‌గా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ సాధించిన ఐదో ఆటగాడు మన్జోత్.1988 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ ఆటగాడు బ్రెట్ విలియమ్స్ శతకం సాధించి తొలి ఆటగాడిగా నిలవగా, 1998 తుది పోరులో ఇంగ్లండ్ ఆటగాడు స్టీఫెన్ పీటర్స్ సెంచరీ సాధించాడు. 2002లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్ ఆటగాడు జారడ్ బర్క్ శతకం సాధించాడు.


