15 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర.. తొలిసారి సెమీస్‌లో సింధు | PV Sindhu Enters Maiden Japan Open Semis Ends 15 Years Wait | Sakshi
Sakshi News home page

Japan Open: 15 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర.. తొలిసారి సెమీస్‌లో సింధు

Jul 17 2026 12:25 PM | Updated on Jul 17 2026 12:53 PM

PV Sindhu Enters Maiden Japan Open Semis Ends 15 Years Wait

జ‌పాన్ ఓపెన్ సూప‌ర్-750 టోర్నీలో భార‌త టాప్ షట్ల‌ర్ పీవీ సింధు సెమీఫైన‌ల్లో అడుగుపెట్టింది. శుక్ర‌వారం మ‌హిళ‌ల సింగిల్స్ క్వార్ట‌ర్ ఫైన‌ల్లో మాజీ నంబ‌ర్‌వ‌న్ నొజోమి ఒకుహ‌రా రిటైర్డ్ కావ‌డంతో సింధుకు సెమీస్‌కు వాకోవ‌ర్ ల‌భించింది. దీంతో 15 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌దించుతూ పీవీ సింధు తొలిసారి జ‌పాన్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరింది. 

ఈ నేప‌థ్యంలో సైనా నెహ్వాల్ (2011) త‌ర్వాత జ‌పాన్ ఓపెన్‌లో సెమీస్ చేరిన‌ రెండో క్రీడాకారిణిగా సింధు రికార్డుల‌కెక్కింది. సెమీస్‌లో సింధు చైనాకు చెందిన చెన్ యూఫీని ఎదుర్కోనుంది. అయితే క్వార్ట‌ర్స్‌లో ఒకుహ‌రా, సింధు త‌ల‌ప‌డ‌తార‌ని తెలియ‌గానే  హోరాహోరీ పోరు త‌ప్ప‌ద‌ని అభిమానులంతా భావించారు. 

ఈ ఇద్ద‌రు ఇప్ప‌టివ‌ర‌కు వివిధ బీడ‌బ్ల్యూఎఫ్ టోర్నీల్లో 17 సార్లు త‌ల‌ప‌డితే సింధూ 9-8తో ఒకుహ‌రాపై ఎడ్జ్ అడ్వాంటేజ్‌తో పైచేయిలో ఉంది. జ‌పాన్ ఓపెన్‌లో సింధు మొద‌టినుంచి మంచి ప్ర‌దర్శ‌న క‌న‌బ‌రుస్తూ వ‌చ్చింది. మ‌లేషియాకు చెందిన వాంగ్ లింగ్ చింగ్‌ను చిత్తు చేసిన సింధు ప్రిక్వార్ట‌ర్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంక‌ర్ హాన్ యును 35 నిమిషాల్లోనే చిత్తు చేసి క్వార్ట‌ర్స్‌కు దూసుకెళ్లింది.

2026 సీజన్‌లో పీవీ సింధు స్థిరమైన ప్రదర్శన కొనసాగిస్తుంది. మలేషియా ఓపెన్ సూపర్-1000 టోర్నీలో సెమీస్ చేరిన సింధు ఇటీవలే ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్‌-500 టోర్నీలోనూ సెమీస్‌లో అడుగుపెట్టినప్పటికీ జపాన్ స్టార్ యమాగుచి చేతిలో పరాజయం చవిచూసింది. ఇక జపాన్ ఓపెన్‌లో సెమీస్ చేరిన సింధు ఈసారి టైటిల్ కొట్టాలనే ధృడ సంకల్పంతో ఉంది. తన స్థిరమైన ప్రదర్శన కారణంగా  బీడబ్ల్యూఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో మూడేళ్ల తర్వాత  పీవీ సింధు టాప్‌-10లో మరోసారి చోటు దక్కించుకోవడం విశేషం. 

 

Read: రోహిత్ భవితవ్యంపై టీమిండియా కోచ్‌ స్పందన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement