ఫ్రాన్స్‌, స్పెయిన్‌ మధ్య తొలి సెమీస్‌.. ఫైనల్‌ చేరేదెవరు? | FIFA World Cup 2026 France Vs Spain 1st Semi Final, Preview, Head To Head, Key Players, Match Time And Who Will Enters Final | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్‌, స్పెయిన్‌ మధ్య తొలి సెమీస్‌.. ఫైనల్‌ చేరేదెవరు?

Jul 14 2026 8:33 AM | Updated on Jul 14 2026 10:30 AM

FIFA World Cup 2026-France-Vs-Spain-1st Semi Final Who-Enters-Final

Photo Credit : FIFA Twitter

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో భాగంగా ఇవాళ‌ ఫ్రాన్స్‌, స్పెయిన్ మ‌ధ్య తొలి సెమీఫైన‌ల్ జ‌ర‌గ‌నుంది. 16 ఏళ్ల తర్వాత ఫిఫాలో ఫైనల్ చేరాలని స్పెయిన్ భావిస్తుంటే.. మరోవైపు వరుసగా మూడో ఫిఫాలోనూ ఫైనల్ చేరాలనే పట్టుదలతో ఫ్రాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య హోరాహోరీ పోరు తప్పేలా లేదనిపిస్తోంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి 12.30 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. 

గతంలో జర్మనీ (1982, 1986, 1990), బ్రెజిల్‌ (1994, 1998, 2002) జట్ల తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్‌ టోర్నీల్లో ఫైనల్ చేరాయి. తాజాగా వరుసగా మూడోసారి ఫిఫా ఫైనల్ చేరడం ద్వారా మూడో జట్టుగా  గుర్తింపు పొందాలని ఫ్రాన్స్ ఉబలాటపడుతోంది.  టైటిల్‌ ఫేవరెట్‌గా అడుగుపెట్టిన ఫ్రాన్స్‌ అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ అజేయంగా సెమీఫైనల్‌కు దూసుకొచ్చింది.

కెప్టెన్‌ ఎంబాపె (8 గోల్స్‌), డెంబెలె (5 గోల్స్‌), బార్కోలా (2 గోల్స్‌), డిజైర్‌ డుయి (1 గోల్‌) అద్భుత ఆటతీరుకు ప్రత్యర్థి జట్లు ఓటమివైపు నిలవాల్సి వస్తోంది. మరోవైపు స్పెయిన్‌ కూడా ఓటమి లేకుండానే సెమీఫైనల్‌కు చేరుకుంది. ఫ్రాన్స్‌ మాదిరిగానే స్పెయిన్‌ ఏ ఒకరిద్దరి ఆటతీరుపైనే ఆధార పడటం లేదు. మికెల్‌ ఒయర్‌జబాల్‌ (4 గోల్స్‌), మికెల్‌ మెరీనో (2 గోల్స్‌), బయేనా (1 గోల్‌), రూయిజ్‌ (1 గోల్‌), పెడ్రో (1 గోల్‌), లమీన్‌ యమాల్‌ (1 గోల్‌) సమష్టి ప్రదర్శనతో స్పెయిన్‌ అనూహ్యంగా టైటిల్‌ రేసులోకి వచ్చింది. 


Photo Credit: FIFA Twitter

ముఖాముఖి పోరులో ఫ్రాన్స్‌పై స్పెయిన్‌దే పైచేయిగా ఉంది. రెండు జట్లు ఇప్పటి వరకు 38 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. 18 మ్యాచ్‌ల్లో స్పెయిన్, 13 మ్యాచ్‌ల్లో ఫ్రాన్స్‌ గెలిచాయి. ఏడు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. ప్రపంచకప్‌లో మాత్రం ఫ్రాన్స్, స్పెయిన్‌ ఒక్కసారే ప్రత్యర్థులుగా నిలిచాయి. 2006 ప్రపంచకప్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ఫ్రాన్స్‌ 3–1తో స్పెయిన్‌ను ఓడించింది.  

చదవండి: సీఎస్‌కే హెడ్‌కోచ్‌ పదవి.. రేసులో ఊహించని పేర్లు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement