చిత్తుగా ఓడిన స్విట్జర్లాండ్‌.. సెమీఫైన‌ల్లో అర్జెంటీనా | Argentina Beat Switzerland Extra-Time Enters Semi Final FIFA WC 2026 | Sakshi
Sakshi News home page

చిత్తుగా ఓడిన స్విట్జర్లాండ్‌.. సెమీఫైన‌ల్లో అర్జెంటీనా

Jul 12 2026 9:16 AM | Updated on Jul 12 2026 10:26 AM

Argentina Beat Switzerland Extra-Time Enters Semi Final FIFA WC 2026

సెమీస్‌ చేరిన జోష్‌లో మెస్సీ సంబరాలు

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌లో డిఫెండింగ్ చాంపియ‌న్ అర్జెంటీనా సెమీఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం ఉద‌యం జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైన‌ల్లో అర్జెంటీనా 3-1 తేడాతో స్విట్జ‌ర్లాండ్‌పై ఘన విజయాన్ని సాధించింది. నిర్ణీత సమయంలో ఒక గోల్‌ చేసిన అర్జెంటీనా ఆట అద‌న‌పు స‌మ‌యంలో మరో రెండు గోల్స్ చేసి స్విట్జ‌ర్లాండ్‌పై పూర్తి ఆధిపత్యాన్ని ప్ర‌ద‌ర్శించింది.

అర్జెంటీనా త‌ర‌ఫున అలెక్సిస్ మాక్ అలిస్ట‌ర్ (10వ నిమిషం), జులియ‌న్ అల్వ‌రెజ్ (112వ నిమిషం), లుటారో మార్టినేజ్ (121వ నిమిషం) ఆట అద‌న‌పు స‌మ‌యంలో గోల్ చేశాడు. స్విట్జ‌ర్లాండ్ త‌ర‌ఫున డాన్ నోయే (67వ నిమిషంలో) గోల్ కొట్టాడు. ఇక ఆట 72వ నిమిషంలో బ్రీల్ ఎంబోలో రెడ్‌కార్డ్‌కు గుర‌య్యాడు. దీంతో స్విట్జర్లాండ్‌ 10 మంది ఆటగాళ్లతోనే మిగతా మ్యాచ్‌ ఆడాల్సి వచ్చింది.

ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన పోరులో తొలి హాఫ్‌లో ఆట ప్రారంభ‌మైన కాసేప‌టికే అర్జెంటీనా గోల్ చేసింది. మెస్సీ నుంచి పాస్ అందుకున్న అలిస్ట‌ర్ బంతిని నేరుగా గోల్ పోస్ట్‌లోకి పంపించి 1-0తో అర్జెంటీనాకు ఆధిక్యం అందించాడు. తొలి అర్ధ‌భాగంలో విఫ‌ల‌మైన స్విట్జ‌ర్లాండ్ రెండో హాఫ్‌లో మాత్రం ఫుంజుకొని అర్జెంటీనాకు గ‌ట్టి పోటీనిచ్చింది.

ఈ నేప‌థ్యంలోనే 67వ నిమిషంలో డాన్ నోయె గోల్ కొట్టి స్కోరును స‌మం చేశాడు. ఆ త‌ర్వాత నిర్ణీత స‌మ‌యంతో పాటు స్టాపేజీ టైంలోనూ ఇరుజ‌ట్లు మ‌రో గోల్ చేయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో మ్యాచ్‌ అద‌న‌పు స‌మ‌యానికి దారి తీసింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో అర్జెంటీనా త‌ర‌ఫున జులియ‌న్ అల్వ‌రెజ్ 112వ నిమిషంలో మెరిసి అర్జెంటీనాకు రెండో గోల్ అందించాడు. మరో నాలుగు నిమిషాల్లో ఎక్స్‌ట్రా టైమ్‌ ముగుస్తుందనగా, 121వ నిమిషంలో లుటారో మార్టినేజ్‌ గోల్‌ చేసి ఆధిక్యాన్ని మూడుకు పెంచాడు. 

2022 ఫిఫా వరల్డ్‌కప్‌లో చాంపియన్‌గా నిలిచిన అర్జెంటీనా సెమీస్‌లో ఇంగ్లండ్‌ను ఎదుర్కోనుంది. మరో సెమీస్‌లో స్పెయిన్‌తో ఫ్రాన్స్‌ అమీతుమీ తేల్చుకోనుంది. అన్నీ కుదిరితే 2022 ఫిఫా ఫైనల్‌ మరోసారి రిపీటయ్యే అవకాశముంది. 2022 ఫిఫా ఫైనల్లో ఫ్రాన్స్‌ను పెనాల్టీ షూటౌట్‌లో మట్టికరిపించిన అర్జెంటీనా మూడోసారి ఫిఫా టైటిల్‌ను గెలుచుకుంది.

 

 

చదవండి: 25 ఏళ్ల‌కే స్టార్ ఫుట్‌బాల‌ర్ క‌న్నుమూత‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement