ప్రపంచం మొత్తం సాకర్ ఫీవర్ (FIFA World Cup 2026)తో ఊగిపోతున్న వేళ ఫుట్‌బాల్ ఆటలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కాసేపట్లో ఫిఫా 2026 క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్, నార్వే ఆట మొదలవుతుందనగా, స్టేడియంలోని బిగ్ స్క్రీన్‌పై సౌతాఫ్రికా ఫుట్‌బాల్ ప్లేయర్ జేడన్ ఆడమ్స్ (25) కన్నుమూసినట్లు ప్రత్యక్షమవ్వడం అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇంగ్లండ్, నార్వే ఆటగాళ్లు సహా అభిమానులంతా జేడన్ ఆడమ్స్ ఆకస్మిక మృతి పట్ల రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

మౌనం పాటిస్తున్న ఇంగ్లండ్, నార్వే ఆటగాళ్లు
సౌతాఫ్రికా మిడ్ ఫీల్డర్ అయిన జేడన్స్ ఆడమ్స్ 25 ఏళ్ల వయసులోనే తనువు చాలించాడు. అతడి ఆకస్మిక మృతి వెనుక కారణాలు ఏంటనేది తెలియదని పోలీసులు వెల్లడించారు. అయితే జేడన్ ఆడమ్స్ ఫుడ్ పాయిజన్ కారణంగా మరణించినట్టు కొందరు అనుమానిస్తుంటే, వ్యక్తిగత కారణాలతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు మరికొందరు పేర్కొంటున్నారు.

ఫిఫా ప్రపంచకప్ 2026లో జేడన్ ఆడమ్స్
సౌతాఫ్రికా ఫుట్‌బాల్ జట్టులో స్టార్ ఆటగాడిగా పేరు పొందిన జేడన్ ఆడమ్స ఇటీవలే ఫిఫా ప్రపంచకప్‌లో కూడా జట్టు తరఫున ఆడాడు. సౌతాఫ్రికా గ్రూప్ దశకే పరిమితమైనప్పటికీ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ జేడన్ ఆడమ్స్ ఆడాడు. మెక్సికోతో మ్యాచ్‌కు ముందు తన అమ్మమ్మ మరియానా ఆడమ్స్ మరణించిందన్న వార్తను దిగమింగుకొని బరిలోకి దిగిన జేడన్ ఆడమ్స్ మంచి ప్రదర్శన చేశాడు.
ఆ మ్యాచ్‌లో మెక్సికో 2-0తో విజయం సాధించింది. ఆ తర్వాత చెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌ను 1-1తో డ్రా చేసుకున్న సౌతాఫ్రికా.. తమ చివరి మ్యాచ్‌లో దక్షిణ కొరియాపై 0-1తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జేడన్ ఆడమ్స్‌సబ్‌స్టిట్యూట్‌గా వచ్చాడు. ఆడమ్స్ మృతి పట్ల ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ ఫాంటినో, దక్షిణాఫ్రికా క్రీడా మంత్రి గాయటన్ మెకెంజీలతో పాటు ఆటగాళ్లు సంతాపం ప్రకటించారు. సౌతాఫ్రికా తరపున 9 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జేడన్ ఆడమ్స్ రెండు గోల్స్ చేశాడు.
This video of Jayden Adams breaks my heart even more. This guy was going through the most 💔💔💔💔. pic.twitter.com/b4ot1fBvLK
— Mpho Alex⭐⭐ (@mphoalex11) July 11, 2026
Rest in peace, Jayden Adams, Grootman. 🕊️💔 pic.twitter.com/ERSkw8oCwv
— T. (@__T_touch) July 11, 2026
A moment of silence was held before Norway and England in honor of South Africa midfielder Jayden Adams who died at the age of 25 ❤️ pic.twitter.com/vlOrxzgSSg
— ESPN FC (@ESPNFC) July 11, 2026


