కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య ప్రశాంత మరణం | S Janaki Demise And Her Grand Daughter Apsara Emotional | Sakshi
Sakshi News home page

S Janaki: సింగర్ జానకి మరణం.. మనవరాలి ఎమోషనల్ పోస్ట్

Jul 11 2026 9:27 PM | Updated on Jul 11 2026 9:27 PM

S Janaki Demise And Her Grand Daughter Apsara Emotional

ప్రముఖ గాయని ఎస్.జానకి(88) కన్నుమూశారు. మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఈమె మనవరాలు అప్సరా వైద్యుల.. సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్ట్‌లో ఆమెతో అనుబంధాన్ని, తుదిశ్వాస విడిచిన సందర్భం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

'దిగ్గజ గాయని, మా నానమ్మ చనిపోయారనే విషయాన్ని తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. ఈ విషాద సమయంలో మా కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అదే సమయంలో సంగీత ప్రపంచానికి ఆమె అందించిన అపూర్వమైన సేవలు, కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆమె గానమాధుర్యం పట్ల గర్వంగా, కృతజ్ఞతతో ఉన్నాం'

'ప్రపంచానికి ఎస్.జానకి ఒక దిగ్గజ గాయని, ఎన్నో తరాల జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వరం. మా కుటుంబానికి మాత్రం ప్రేమ, ఆప్యాయత, వినయం, దయ, మానవత్వం పంచిన మంచి నానమ్మ. ఈ క్లిష్ట సమయంలో మా ప్రైవసీ గౌరవించాలని ప్రజలు, అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి. మా కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రేమ, ప్రార్థనలు, సానుభూతి తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు' అని అప్సరా వైద్యుల తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.

(ఇదీ చదవండి: జానకి పాడిన చివరి పాట ఏంటంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement