బెంజ్ కారు కొన్న నటి హేమ.. ఎన్ని కోట్ల ఖరీదంటే? | Telugu Actress Hema Buys Benz GLS 450d Car And Cost Details | Sakshi
Sakshi News home page

Actress Hema: ఖరీదైన కారు కొన్న హేమ.. వీడియో వైరల్

Jul 11 2026 7:25 PM | Updated on Jul 11 2026 7:31 PM

Telugu Actress Hema Buys Benz GLS 450d Car And Cost Details

టాలీవుడ్ నటి హేమ ఎప్పటికప్పుడు ఏదోలా ఒకలా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం కొత్త బెంజ్ కారు కొనుగోలు చేసి సదరు వీడియోని సోషల్ మీడియాలో పంచుకుంది. తన కుటుంబంతో కలిసి వెళ్లి ఈ కారుతో కలిసి ఫొటోలకు పోజులిచ్చింది.

(ఇదీ చదవండి: అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది)

1989 నుంచి తెలుగు సినిమాల్లో నటిస్తున్న హేమ.. అత్త, అక్క, తల్లి తరహా పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఈ తరహా పాత్రలతోనే కామెడీ కూడా చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది. చివరగా 2023లో ఓ మూవీలో నటించింది. తర్వాత నుంచి పెద్దగా మూవీస్ ఏం చేయట్లేదు. కాకపోతే బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో ఈమె కూడా ఉందని చెప్పి ఆ మధ్య హడావుడి నడిచింది. పోలీసు కేసుల వరకు వెళ్లింది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని ఈమె చెప్పుకొచ్చింది.

గతంలో బిగ్‌బాస్ షోలోనూ పాల్గొన్నప్పటికీ ఒకటి రెండు వారాలకే ఎలిమినేట్ అయిపోయి బయటకొచ్చింది. మళ్లీ చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు బెంజ్ కంపెనీకి చెందిన జీఎల్ఎస్ 450డీ మోడల్ కారుని కొనుగోలు చేసింది. దీని ధర మార్కెట్‌లో రూ.1.40 కోట్ల నుంచి రూ.1.50 కోట్ల మధ్య ఉంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు హారర్ సినిమా.. మూడింటిలో స్ట్రీమింగ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement