కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలు ఆవిష్కరిస్తూ తీసిన సినిమా 'వెంకట్రామయ్య గారి తాలుకా'. ఈనెల 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీలోని మూడో పాట 'ఆడుకున్నదిక్కడే' లిరికల్ వీడియోని ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
(ఇదీ చదవండి: అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది)
ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు విడుదల చేసిన ఆడుకున్నదిక్కడే పాట కూడా ప్రతి ఒక్కరిని హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. కథలోని భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ గీతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని టీమ్ చెప్పింది. దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ హీరోహీరోయిన్లుగా నటించారు. సతీష్ ఆవాల దర్శకుడు. కోమలి మహేందర్, తొట్టె సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించారు.
(ఇదీ చదవండి: బెంజ్ కారు కొన్న నటి హేమ.. ఎన్ని కోట్ల ఖరీదంటే?)


