breaking news
divija
-
ఎమోషనల్ డ్రామా.. వెంకట్రామయ్య గారి తాలూకా రివ్యూ
దినేష్ కుమార్, ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ జంటగా వచ్చిన మూవీ వెంకట్రామయ్య గారి తాలుకా. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ జూలై 17న థియేటర్లలో రిలీజైంది. తండ్రీ, కూతుళ్ల ఎమోషనల్ స్టోరీగా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రానికి సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించారు. మరి ఆ ఎమోషన్‌ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించారా? సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.అసలు కథేంటంటే..వెంకట్రామయ్య - సీత (మురళీధర్ గౌడ్, సుధ) దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. వ్యవసాయం చేస్తూ జీవిస్తూ ఉంటారు. పొలం, పిల్లలే వారికి ప్రాణం. ఒక రైతు ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లి చేయడమంటే మాటలా? ఇద్దరు ఆడపిల్లల కోసం తనకున్న ఐదెకరాల్లో రెండు ఎకరాల పొలం అమ్మేస్తాడు. కొడుకు తనకు రైల్వే జాబ్ వస్తుంది. రూ.20 లక్షలు కట్టాలంటే మరో ఎకరం అమ్మేస్తాడు. ఇక చిన్న కూతురు లత (దివిజ) తను ప్రేమించిన రాజు (దినేష్)ను పెళ్లి చేసుకుంటానంటుంది. కానీ రాజుకి సీత తన కూతురును రాజుకు ఇవ్వడానికి నిరాకరిస్తుంది. కానీ తను ఇష్టపడిన వ్యక్తితో కూతురి వివాహం చేయాలనుకున్న వెంకట్రామయ్య.. భార్యకు నచ్చజెప్పి వివాహం జరిపిస్తాడు. అయితే సీత భయపడిందంతా జరుగుతుంది. అత్తవారింట లత ఎన్నో కష్టాలు పడుతూ ఉంటుంది. మరోవైపు వెంకట్రామయ్య కొడుకు మురళి సైతం ఓ అమ్మాయిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. పిల్లలంతా వివాహాలవడంతో ఆడపిల్లలు అత్తవారిళ్లకు.. కొడుకు ఉద్యోగం కోసం సిటీకి వెళతాడు. ఇక ఉన్న ఒక ఎకరంతో ఎలాగైనా బతుకుదామనుకుంటే అనుకోని సంఘటన ఎదురవుతుంది. ఎకరం పొలం అమ్మాల్సిన అవసరం ఎందుకొచ్చింద? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే.ఎలా ఉందంటే..1992లో దాసరి నారాయణరావు దర్శకత్వంలో ఆయనే ప్రధాన పాత్రలో నటించిన సూరిగాడు చిత్రం వచ్చింది. ఆ సినిమా కూడా ఒక తండ్రి కథే. అప్పట్లో అది బ్లాక్ బస్టర్ హిట్. నలుగురు పిల్లలున్నా.. తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తాడు. అదే తల్లిదండ్రులు తరువాతి కాలంలో పిల్లలకు భారంగా ఎందుకు మారుతున్నారనేదే కథ. తొలి అర్థ భాగమంతా.. వెంకట్రామయ్య తన పొలాన్ని అపురూపంగా చూసుకోవడం.. పొలాన్ని పరువుగానూ.. గౌరవంగానూ భావించడం.. పిల్లల కోసం దాన్ని అమ్ముకోవల్సి రావడం అలా రోటీన్‌గా సాగుతుంది.ఇక సెకండాఫ్‌లో కంప్లీట్‌గా వెంకట్రామయ్య చుట్టూనే కథ నడుస్తుంది. ప్రతి ఒక్కరికీ వయసుతో సంబంధం లేకుండా సెకండాఫ్ చూస్తున్నప్పుడు తన తండ్రి గుర్తొస్తాడు. ఇక క్లైమాక్స్‌లో ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కుతుంది. కళ్ల నిండా నీళ్లతో బయటకు వస్తారు. పల్లెటూరి కథలు ఇటీవలి కాలంలో వచ్చినా కూడా లవ్ స్టోరీకే పరిమితమవుతున్నాయి. ఒక కంప్లీట్ ఫ్యామిలీ స్టోరీ అనేది రావడం లేదు.ఇది కేవలం ఒక కుటుంబ కథ మాత్రమే కాదు.. నేటి సమాజానికి అద్దం పట్టే భావోద్వేగ ప్రయాణం. సినిమా ప్రారంభంలో పాత్రల పరిచయం, వారి కుటుంబ పరిస్థితులు, గ్రామీణ జీవనశైలిని పరిచయం చేస్తాయి. ఆ తరువాత కథ భావోద్వేగాలతో ముందుకు సాగుతుంది. రెండో భాగంలో వచ్చే తండ్రీ, కూతుళ్ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి. ఎక్కడా అనవసరమైన కమర్షియల్ హంగులు, బలవంతపు కామెడీ, అసభ్య సంభాషణలు లేకుండా జాగ్రత్తపడ్డారు.కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రంగా దర్శకుడు రూపొందించారు. యాక్షన్, థ్రిల్లర్, హారర్ సినిమాల హవా కొనసాగుతున్న సమయంలో వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆకట్టుకుంది. ప్రస్తుత సమాజంలో డబ్బు కోసం పరుగులు తీస్తున్న మనుషులు.. క్రమంగా దూరమవుతున్న కుటుంబ బంధాలు... వృద్ధాప్యంలో ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న తల్లిదండ్రులు.. ఈ నేపథ్యంలో ఓ మధ్యతరగతి తండ్రి తన పిల్లల కోసం చేసే త్యాగాలే 'వెంకట్రామయ్య గారి తాలూకా' కథ. తల్లిదండ్రుల ప్రేమ, కుటుంబ బంధాలు, ఆత్మగౌరవం, మానవ సంబంధాల విలువలను హృదయానికి హత్తుకునేలా దర్శకుడు తెరపై ఆవిష్కరించారు. ఓవరాల్‌గా వెంకట్రామయ్య గారి తాలుకా’ ఓ ఫీల్ గుడ్ మూవీ.ఎవరెలా నటించారంటే..దివిజ, దినేశ్ ఇద్దరు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. మురళీధర్ గౌడ్ తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. సుధ తల్లిగా చాలా సహజంగా నటించారు. ఇక మిగిలిన నటీనటులంతా వారి పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు. సాంకేతికత విషయానికొస్తే ముఖ్యంగా ఎమోషన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. ఎడిటింగ్ విషయంలో మరింత కట్ చేయాల్సింది. మ్యూజిక్ విషయానికి వస్తే ఫర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమాకు తగినట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. -
'ఆడుకున్నదిక్కడే' పాట రిలీజ్
కుటుంబ బంధాలు, మానవ సంబంధాల విలువలు ఆవిష్కరిస్తూ తీసిన సినిమా 'వెంకట్రామయ్య గారి తాలుకా'. ఈనెల 17న థియేటర్లలో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ మూవీలోని మూడో పాట 'ఆడుకున్నదిక్కడే' లిరికల్ వీడియోని ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.(ఇదీ చదవండి: అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది)ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు విడుదల చేసిన ఆడుకున్నదిక్కడే పాట కూడా ప్రతి ఒక్కరిని హృదయానికి హత్తుకునేలా ఉంటుంది. కథలోని భావోద్వేగాలను ప్రతిబింబించే ఈ గీతం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని టీమ్ చెప్పింది. దినేష్ కుమార్, దివిజ ప్రభాకర్ హీరోహీరోయిన్లుగా నటించారు. సతీష్ ఆవాల దర్శకుడు. కోమలి మహేందర్, తొట్టె సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించారు.(ఇదీ చదవండి: బెంజ్ కారు కొన్న నటి హేమ.. ఎన్ని కోట్ల ఖరీదంటే?) -
హీరోయిన్గా ఈటీవీ ప్రభాకర్ కుమార్తె ఎంట్రీ.. దివిజ గ్లామర్ పిక్స్ చూశారా?
-
హీరోయిన్గా ఈటీవీ ప్రభాకర్ కుమార్తె ఎంట్రీ
దినేశ్ కుమార్, దివిజ జంటగా నటిస్తోన్న చిత్రం 'వెంకట్రామయ్య గారి తాలూకా'. ఈ సినిమాకు సతీష్ ఆవాల దర్శకత్వం వహించారు. ఈ మూవీని కోమలి క్రియేషన్స్ బ్యానర్‌పై కోమలి మహేందర్ తొట్టె, సోమేష్ సారిపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఈటీవీ ప్రభాకర్ కుమార్తె దివిజ ఈ మూవీతోనే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తోంది. తాజాగా ఈ మూవీ టీజర్, పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.దర్శకుడు సతీష్ ఆవాల మాట్లాడుతూ..."మన దేశ సంస్కృతిలో పెద్దలకు గౌరవం ఇవ్వడం గొప్ప సంప్రదాయం. కుటుంబాల్లో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమా చూపిస్తుంది. నేను జర్నలిజం నుంచి వచ్చిన వ్యక్తిని. కుటుంబ బంధాల విలువ నాకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో దివిజ వీడియోలు చూసి ఈ పాత్రకు సరిపోతుందని భావించి ఈటీవీ ప్రభాకర్ గారిని సంప్రదించా. మనసున్న ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుంది" అని తెలిపారు.ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ... "ముత్యాల సుబ్బయ్య గారి చిత్రాలను గుర్తు చేసే గొప్ప కథ ఇది. చాలా కాలం తర్వాత ఇలాంటి కథ వినడంతో మా అమ్మాయి దివిజను ఈ సినిమా చేయమని ప్రోత్సహించా. నిర్మాత కోమలి ఎంతో కష్టపడి సినిమా నిర్మించారు. దర్శకుడు సతీష్ ఆవాల తన భుజాలపై బాధ్యత తీసుకుని అద్భుతంగా తెరకెక్కించారు. నాన్న గొప్పతనం, తల్లిదండ్రుల విలువను ఎంతో హృద్యంగా చూపించారు. . డాక్టర్ అవుతుందనుకున్న మా అమ్మాయి ఈ సినిమాతో నటిగా పరిచయమవుతోంది. అందరూ ఆశీర్వదించాలి. ఈ చిత్రం ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నా" అని అన్నారు.తల్లిదండ్రుల విలువ, కుటుంబ బంధాలు, ఫాదర్ సెంటిమెంట్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ప్రస్తుత సమాజంలో డబ్బు చుట్టూ తిరుగుతున్న మానవ సంబంధాలు, వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను కథాంశంగా కుటుంబ కథా చిత్రమని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, సుధ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 18న థియేటర్లలో విడుదల కానుంది. -
హీరోయిన్గా బుల్లితెర మెగాస్టార్ కూతురు.. సినిమా రెడీ
సతీష్ ఆవాల దర్శకత్వంలో దినేష్ కుమార్ హీరోగా, దివిజ ప్రభాకర్ (ఈటీవీ ప్రభాకర్ కుమార్తె) హీరోయిన్గా పరిచయం అవుతున్న సినిమా 'వెంకట్రామయ్య గారి తాలూకా' విడుదలకు సిద్ధమైంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దివిజ సోదరుడు చంద్రహాస్ ఇప్పటికే హీరోగా ఒకటి రెండు సినిమాలు చేశాడు.(ఇదీ చదవండి: 'వారణాసి' విలన్ కొత్త సినిమా.. తెలుగు ట్రైలర్ రిలీజ్)ఈ చిత్ర నిర్మాత, ఫోక్ సింగర్ కోమలి మాట్లాడుతూ.. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని సినిమా రంగం మీద నాకున్న ఇష్టంతో నేను సినిమా తీయాలి అని ఒక ధ్యేయంతో చాలా ఒడుదుడుకులని ఎదుర్కొని వెంకట్రామయ్య గారి తాలూకా మూవీని పూర్తి చేసాం. ఈ సినిమా మొదలయినప్పటి నుంచి కంటినిండా నిద్ర కూడా పట్టేది కాదు. అన్ని కష్టాలు ఎదుర్కుని జులైలో మూవీ విడుదల చెయ్యడానికి రెడీ చేస్తున్నాం అని చెప్పింది.సినిమా విషయానికొస్తే.. అందమైన పల్లెటూరులో వెంకట్రమయ్య అనే పరువు గల కుటుంబంలో జరిగే కథ ఇది. ప్రస్తుతం మనుషుల మధ్య ఉన్న బంధాలు డబ్బుతో ముడిపడ్డాయి. మానవీయ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలుగా మారిపోయాయి. తల్లి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను కడుపు కట్టుకుని ఎన్నో కష్టాలను భరిస్తూ పిల్లలను ఎంతో అల్లారు ముద్దుగా నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేస్తున్నారు. కానీ తల్లి తల్లిదండ్రుల చివరి దశలో నలుగురు పిల్లలు కలిసి వాళ్ళని పెంచలేకపోతున్నారు. తల్లిదండ్రుల గొప్పతనం తెలియచేసే సినిమా ఇది అని దర్శకుడు సతీష్ ఆవాల చెప్పాడు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఒక్కరోజే ఓటీటీల్లోకి 16 సినిమాలు) -
యూనివర్సల్ 2020 టైటిల్‌కు దివిజ
ఆదిలాబాద్‌టౌన్: ఆమె ఓ నాట్యమయూరి.. తన ప్రదర్శనలతో అందర్ని ఇట్టే ఆకట్టుకుంటోంది.. తాను నృత్యం చేస్తే కనురెప్పలు తిప్పకుండా చూస్తుండిపోవాల్సిందే. లలిత కళలతో పాటు చదువుల్లో కూడా ముందంజలో ఉంది. కర్ణాటక సంగీతం, కూచిపుడి నృత్యం, వీణా, క్యాషియో, గిటార్ వాయించడంలో ఆమె మేటి అని చెప్పడం అతిశయోక్తి కాదు. చిన్ననాటి నుంచే కళల వైపు మొగ్గు చూపుతుండడంతో తల్లిదండ్రులు సైతం ప్రోత్సాహం అందిస్తున్నారు. తండ్రి మహేష్ లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తుండగా, తల్లి కవిత డ్యాన్స్ మాస్టర్‌గా ఉన్నారు. దీంతో తల్లి చిన్ననాటి నుంచే ఆమెకు కళలను నేర్పించడంతో గురువును మించిన శిశురాలిగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రదర్శనలు ఇచ్చి ప్రశంసలు అందుకుంది. దీంతో పలు అవార్డులతో పాటు గిన్నీస్‌బుక్ ఆఫ్ రికార్డు సాధించింది. యూనివర్సల్ మల్టీ ట్యాలెంట్‌కు ఎంపిక.. ఆదిలాబాద్ పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన దివిజ యూనివర్సల్ 2020 మల్టీ ట్యాలెంట్‌కు ఎంపికైంది. తానా, తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు ఆమెను అభినందించారు. గత నెల 24, 25 తేదీల్లో ఆన్లైన్లో తానా, తెలుగు సాంస్కృతిక కార్యక్రమం ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా, కువైట్, న్యూజిలాండ్, యూఎస్ఏతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన కళాకారులు పాల్గొన్నారు. సౌందర్య లహరి నైపుణ్యాలు, కూచిపూడి, వీణా, గిటార్, క్యాషియో, తదితర రంగాలకు సంబంధించి 700మంది కళాకారులు పాల్గొన్నారు. అయితే మొదటి దశలో 25మందిని ఎంపిక చేశారు. వీరి ప్రదర్శనలు ఈ–మెయిల్ ద్వారా పంపారు. రెండో దశలో 25నుంచి 11మందిని ఎంపిక చేశారు. ఆ 11మందిలో దివిజ స్థానం సాధించింది. ప్రస్తుతం ఈమె డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. పలు రంగాల్లో ప్రావీణ్యం.. ♦2014లో హైదరాబాద్‌లోని గచ్చిబౌళిలో నిర్వహించిన సిలికాన్ ఆంధ్ర కూచిపుడి నృత్య సమ్మేళనంలో ప్రతిభ కనబర్చింది. వరల్డ్ గిన్నిస్‌బుక్‌లో రికార్డుకెక్కింది. ♦2016లో విజయవాడలో నిర్వహించిన సిలికాన్ ఆంధ్ర కూచిపుడి నృత్య సమ్మేళనంలో ప్రతిభ కనబర్చి మరోసారి గిన్నిస్‌బుక్‌లో రికార్డు సాధించింది. ♦2016లో గోదావరి పుష్కరాల్లో భాగంగా సరస్వతి దేవి పుణ్య క్షేత్రంలో స్వర సంగీత, శాస్త్రీయ నృత్య, కూచిపుడి నృత్య సమ్మేళన ప్రదర్శనతో ఆకట్టుకుంది. గోదావరి పుష్కర అవార్డును అందుకుంది. ♦2016లో జైనథ్‌లోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటీల్లో ప్రతిభ కనబర్చి ప్రముఖ కవి సుద్దాల అశోక్‌తేజ చేతుల మీదుగా అవార్డు అందుకుంది. ♦2017లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన శాస్త్రీయ నృత్య పోటీల్లో నాట్య కిరణం అవార్డును తమిళనాడు రాష్ట్ర గవర్నర్ రోశయ్య చేతుల మీదుగా అందుకుంది. ♦2017లో హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించి ఏబీసీ ఫౌండేషన్, భారత్ ఆర్ట్స్ అకాడమి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ కల్చరల్ ఫెస్టివల్లో తెలుగు వరల్డ్ రికార్డుకెక్కింది. ఆ అవార్డును లక్ష్మీపార్వతి చేతుల మీదుగా అందుకుంది. ఇలా చెప్పుకుంటుపోతే అనేక అవార్డులు ఆమె సొంతం.. చిన్ననాటి నుంచే ఇష్టంగా ముందుకు అమ్మ డ్యాన్స్ మాస్టర్ కావడంతో చిన్నప్పటి నుంచే నాకు లలిత కళలు అంటే ఇష్టం. నా ఇష్టాన్ని తెలుసుకొని అమ్మనాన్న ప్రోత్సాహం అందించడంతోనే ముందుకు సాగుతున్నాను. కరోనా నేపథ్యంలో తానా, తెలంగాణ సాంస్కృతి కార్యక్రమాలు ఆన్లైన్లో జరిగాయి. ఇందులో మల్టీ ట్యాలెంట్ టెస్ట్‌కు ఎంపికయ్యాను. ఆ సంస్థ వారు నన్ను అభినందించడం జరిగింది.– దివిజ -
యూఎస్‌లో కారు ప్రమాదం, టెకీ, కూతురు మృతి
సాక్షి, బెంగళూరు: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన తండ్రీ కుమార్తెలు మృత్యువాత పడ్డారు. బీదర్‌కు చెందిన టెక్కీ ముఖేశ్ శివాజీవార దేశ్‌ముఖ్ (27), ఆయన రెండేళ్ల కుమార్తె దివిజా రోడ్డు ప్రమాదంలో అసువులు బాసినట్లు ఇక్కడికి సమాచారం అందింది. బీదర్ జిల్లా భాల్కి తాలూకా కొంగళ్లికి చెందిన ముఖేశ్ అమెరికాలోని ఉత్తర కరోలినాలో ఐటీ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం తన సతీమణి మౌనిక, కుమార్తె దివిజాలతో కారులో వెళుతున్నారు. ముఖేశ్ కారును డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ సమయంలో కారు అదుపు తప్పి ఓ ట్రక్‌ను ఢీ కొట్టడంతో తండ్రీకుమార్తెలు ఇద్దరూ అక్కడికక్కడే మరణించగా, మౌనిక పరిస్థితి విషమంగా ఉంది. మృతదేహాలను త్వరగా స్వదేశానికి తీసుకొచ్చే విషయమై భారతీయ రాయబారి కార్యాలయంతో బీదర్ ఎంపీ భగవంత్ ఖోబా సంప్రదింపులు జరిపారు. -
తొలి రౌండ్లోనే దివిజ్–బోపన్న జంట ఓటమి
గత వారం స్వదేశంలో జరిగిన టాటా ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో టైటిల్ నెగ్గిన దివిజ్ శరణ్–రోహన్ బోపన్న జంటకు రెండో టోర్నమెంట్లో మాత్రం నిరాశ ఎదురైంది. సిడ్నీ ఓపెన్ ఏటీపీ–250 టోర్నీలో ఈ భారత జోడీ తొలి రౌండ్లోనే నిష్క్రమించింది. ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఎడువార్డో రోజర్ వాసెలిన్ (ఫ్రాన్స్) ద్వయంతో జరిగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో బోపన్న–దివిజ్ జంట 2–6, 4–6తో ఓడిపోయింది. 53 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జోడీ రెండు ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. తొలి రౌండ్లో ఓడినప్పటికీ భారత జంటకు 2,870 డాలర్ల (రూ. 2 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. -
సిటీ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు దివిజ్ శరణ్ జోడీ
భారత టెన్నిస్ అగ్రశ్రేణి డబుల్స్ ప్లేయర్ దివిజ్ శరణ్ సిటీ ఓపెన్ ఏటీపీ–500 టోర్నమెంట్లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. వాషింగ్టన్లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ క్వాలిఫయింగ్ చివరి రౌండ్లో శరణ్–అర్తెమ్ సితాక్ (న్యూజిలాండ్) జోడీ 7–5, 7–6 (8/6)తో ఇల్యా ఇవాష్క (బెలారస్)–డానిల్ మెద్వెదేవ్ (రష్యా) ద్వయంపై విజయం సాధించింది. మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్లో లియాండర్ పేస్ (భారత్)–జేమ్స్ సెరెటాని (అమెరికా)లతో శరణ్–సితాక్ తలపడతారు. ఇదే టోర్నీ పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ ఫైనల్ రౌండ్లో రామ్‌కుమార్ రామనాథన్ (భారత్) 3–6, 3–6తో క్రుగెర్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. -
సృజనకు పట్టం
రెక్కలు తొడిగిన ఊహలకు ఆ చిట్టి కుంచెలు అద్భుతమైన రూపాన్నిచ్చాయి. అబ్బురపరిచే కళను రంగులతో కలగలిపి కాన్వాస్‌పై ఒలకబోసి అదరహో అనిపించారు. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో జరిగిన రాష్ట్రస్థాయి పెయింటింగ్ పోటీలు చిన్నారుల ప్రతిభకు తార్కాణంగా నిలిచాయి. 50 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీలో హైదరాబాద్ చిన్నారులే మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. కోన సుధాకర్ రెడ్డి ఫుల్ హ్యాపీ గతంలో జరిగిన పోటీల్లో ప్రోత్సాహక బహుమతి వచ్చింది. ఈసారి ఫస్ట్ ప్రైజ్ రావడం ఆనందంగా ఉంది. తల్లిదండ్రులు, టీచర్ల ప్రోత్సాహంతోనే ఈ విజయం సాధించాను. భవిష్యత్తులో మంచి ఆర్టిస్ట్ అవుతాను. నీటికి ఉన్న ప్రాధాన్యాన్ని వివరిస్తూ పెయింటింగ్ వేశాను. - కె.దివిజ, ఏడో తరగతి,డీఏవీ పబ్లిక్ స్కూల్, కూకట్పల్లి మొదటిసారైనా.. ఇలాంటి పోటీలో నేను పాల్గొనడం ఇదే తొలిసారి. సెకండ్ ప్లేస్‌లో నిలవడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ ఆనందాన్ని ఫ్యామిలీ, టీచర్లు, స్నేహితులతో పంచుకుంటా. చిన్నపిల్లలు-నీటి సంర క్షణ కాన్సెప్ట్‌ను కాన్వాస్‌పై చూపాను. - జి.అమృత లక్ష్మి, ఎనిమిదో తరగతి,కేంద్రియ విద్యాలయం, బేగంపేట్. ఇదే స్ఫూర్తితో.. రాష్ట్రస్థాయిలో జరిగిన పోటీలో నాకు ప్రైజ్ రావడం ఆనందంగా ఉంది.లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి ఆంజనేయుడు సంజీవని పర్వతం తెచ్చిన ఘట్టాన్ని.. ప్రస్తుత పరిస్థితులకు అన్వయిస్తూ చిత్రం గీశాను. ఇలాంటి పోటీలు చిన్నారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఎంతగానో ఉపయోగపడతాయి. - ఇ.శ్వేత, తృతీయ బహుమతి విజేత, ఎనిమిదో తరగతి, ఆటమిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్- 1, ఈసీఐఎల్


