నేరుగా ఓటీటీలోకి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా | Brahmaji Suspense Thriller Hangman Movie Set For Direct OTT Release, Check Out Release Date And Streaming Platform Details | Sakshi
Sakshi News home page

Hangman OTT: తలారి జీవితంపై మూవీ.. ఓటీటీ ట్రైలర్ రిలీజ్

Jul 1 2026 10:16 AM | Updated on Jul 10 2026 11:33 AM

Hangman Movie OTT Release Date And Trailer

ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు మాత్రం థియేటర్లలో కాకుండా నేరుగా స్ట్రీమింగ్‌లోకి తీసుకొచ్చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటిలో చాలా తక్కువ వాటిలో మాత్రమే ఆకట్టుకునే కథాకథనాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటించిన ఓ తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఇంతకీ సినిమా ఎప్పుడు రాబోతుందంటే?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ సినిమా.. తెలుగులోనూ)

బ్రహ్మాజీ మాత్రమే ఈ 'హ్యాంగ్ మ్యాన్' మూవీలో తెలిసిన ముఖం కాగా.. వియన్, బన్నీ అభిరామ్ తదితరులు ఇతర పాత్రలు చేశారు. చాలా ఏళ్ల క్రితమే ఈ ప్రాజెక్ట్ మొదలైంది. ఇప్పటికి పూర్తి చేసి డైరెక్ట్ సన్ నెక్స్ట్ ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు. ఈ శుక్రవారం నుంచే తెలుగులో స్ట్రీమింగ్ కాబోతుంది. ఉరి తీసే తలారి జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

'హ్యంగ్ మ్యాన్' విషయానికొస్తే.. వారసత్వంగా వచ్చే తలారి పని చేస్తుండే ఓ వ్యక్తి (బ్రహ్మాజీ), ఉరిశిక్షలని అమలు పరుస్తూ ఉంటాడు. ఇతడి జీవితంలో ఉరిశిక్ష అనేది ఎలాంటి మానసిక సంఘర్షణకు కారణమైంది? చివరకు ఏం జరిగింది? అనేది స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్ చూడటానికి ఆసక్తికరంగానే ఉంది కానీ మూవీ ఏ మేరకు మెప్పిస్తుందనేది చూడాలి? 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 15 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement