'బిగ్‌బాస్' మొదలవకముందే నెగిటివిటీ.. జడ్జిలనే తిడుతూ వీడియోలు | Bigg Boss Telugu Agnipariksha Negativity And Latest Promo | Sakshi
Sakshi News home page

Bigg Boss 10 Telugu: అగ్నిపరీక్ష వల్ల రచ్చ.. అసలేం జరుగుతోంది?

Aug 15 2026 8:18 PM | Updated on Aug 15 2026 8:24 PM

Bigg Boss Telugu Agnipariksha Negativity And Latest Promo

ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా బిగ్‌బాస్ షో మొదలవనుంది. వచ్చే నెల నుంచి 10వ సీజన్ షురూ కానుందని లేటెస్ట్‌గా ప్రోమో వదిలారు. ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం పక్కనబెడితే అగ్నిపరీక్ష కారణంగా సోషల్ మీడియాలో షోపై విపరీతమైన వ్యతిరేకత ఏర్పడుతోంది. ఇంకా చెప్పాలంటే జడ్జిల్లో ఒకరైన నవదీప్‌ని పలువురు ఇన్ఫ్లుయెన్సర్లు ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారు. ఎందుకీ పరిస్థితి వచ్చింది? దీనికి ఏంటి కారణం?

ఈ షో మొదలైన తర్వాత 8 సీజన్ల వరకు పల్లవి ప్రశాంత్ లాంటి సామాన్యులని పలువురిని తీసుకున్నారు గానీ వారిని ఎలా ఎంపిక చేశారు లాంటివి బయటపెట్టలేదు. కానీ గతేడాది అగ్నిపరీక్ష పేరుతో పోటీ పెట్టి, ఆరుగురు సామాన్యులని ఎంపిక చేసి షోలో పాల్గొనే అవకాశం కల్పించారు. అందులో ఒకడైన కల్యాణ్ పడాల ఏకంగా విజేత కూడా అయ్యాడు. ఈసారి అలానే అగ్నిపరీక్ష పోటీ నిర్వహించారు. వేలాది అప్లికేషన్లు రాగా వాటిలో 70 మందిని ఎంచుకుని వాళ్లలో 15 మందిని ఫైనల్ చేశారు.

ఆ 15 మంది ఎవరనేది జనాలకు కూడా పెద్దగా తెలీదు కాబట్టి ఆ విషయాన్ని కాసేపు పక్కనబెడదాం. అయితే రిజెక్ట్ అయిన మిగిలిన 55 మందిలో ఉప్పల్ బాలు, అక్షయ్ లాంటి జనాలకు తెలిసిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. వీళ్లని ఏ కారణాలతో రిజెక్ట్ చేశారో పక్కనబెడితే వీరిద్దరితో పాటు మరికొందరు ఏకంగా చిన్నాచితకా యూట్యూబ్ ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ జడ్జిలైన నవదీప్, బిందుమాధవి, అభిజిత్‌లని ఇష్టమొచ్చినట్లు విమర్శిస్తున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు.

ఓ షో కోసం ఒక వ్యక్తిని తీసుకోవాలా వద్దా అనేది జడ్జిలతో పాటు నిర్వహకులకు ఉండే చాలా లెక్కలపై ఆధారపడి ఉంటుంది. దీని వెనక పెద్ద తతంగం ఉంటుంది. కానీ కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు ఇష్టరీతినా ఏకంగా జడ్జిలనే తిడుతుండటం షోపై వ్యతిరేకత పెంచుతోంది. పోనీ ఈ ఇన్ఫుయెన్సర్లు ఏమైనా సమాజానికి పనికొచ్చేది చేస్తున్నారా అంటే కాదు. ప్రతిరోజు ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోలో లేదంటే మోటివేషన్ వీడియోలో చేస్తూ ఫాలోవర్లని సంపాదించుకుంటున్నారు. అలాంటి వీళ్లు.. తమని రిజెక్ట్ చేసేసరికి తట్టుకోలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు.

షో మొదలుకాకముందే ఇలా ఉందంటే.. ఒకసారి ప్రారంభమైన తర్వాత ఇంకెన్ని విమర్శలు, ట్రోల్స్ వస్తాయోననే సందేహం కలుగుతోంది. గతేడాది కల్యాణ్ పడాలని విజేత చేసినప్పుడే చాలామంది సందేహపడ్డారు. తనూజ విజేత కావాల్సిన కంటెస్టెంటే కానీ కల్యాణ్ ఎలా విన్నర్ అయ్యాడు అని మాట్లాడుకున్నారు. పోని షో అయిపోయిన తర్వాత విజేతలకు వరస ఛాన్సులు వచ్చాయా అంటే అలాంటిదేం జరగలేదు. ఒకటి రెండు అవకాశాలు వచ్చాయంతే! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement