ఓటీటీలోకి మలయాళ హారర్ కామెడీ సినిమా.. తెలుగులోనూ | Karakkam Movie OTT Streaming Date Update | Sakshi
Sakshi News home page

Karakkam OTT: మ్యూజికల్ హారర్ కామెడీ.. ఓటీటీ స్ట్రీమింగ్‌కి రెడీ

Jun 30 2026 3:16 PM | Updated on Jun 30 2026 3:20 PM

Karakkam Movie OTT Streaming Date Update

ఈ వారం ఓటీటీల్లోకి పలు సినిమాలు రాబోతున్నాయి. వాటిలో మాలీవుడ్ టైమ్స్, అబ్సెషన్ చిత్రాలతో పాటు ఇసకపట్నం, సూపర్ సుబ్బు, మర్మదేశం, ముతస్సీ తదితర సిరీస్‌లు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మలయాళ హారర్ కామెడీ మూవీ ఒకటి స్ట్రీమింగ్‌కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: సంక్రాంతి సినిమా ఫ్లాప్.. పారితోషికం ఎగ్గొటేసిన నిర్మాత)

శ్రీనాథ్ బసి, ఫెమినా జార్జ్, సిద్ధార్థ్ భరతన్ ప్రధాన పాత్రలు చేసిన మలయాళ మ్యూజికల్ హారర్ కామెడీ సినిమా 'కరక్కం'. గత నెల 28న థియేటర్లలోకి వచ్చింది. ఓ మాదిరిగి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు దీన్ని ఈ శుక్రవారం(జూలై 03) నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తెలుగులోనూ అందుబాటులోకి రానుంది.

'కరక్కం' విషయానికొస్తే.. న్యూఇయర్ వేడుకల్లో భాగంగా ఇద్దరు స్నేహితులు ధనుష్(శ్రీనాథ్ భాసి), ఖాజా ఫుల్లుగా తాగి చర్చి స్మశానవాటికలో ఉన్న ఐదు శిలువలను పెకిలించి పారేస్తారు. ఆ తర్వాత వారిని ఐదు దెయ్యాలు వెంటాడటం మొదలుపెడతాయి. ఆ దెయ్యాల నుంచి వాళ్లు ఎలా తప్పించుకున్నారు? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ సెన్సేషన్ 'అబ్సెషన్')

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement