ఓటీటీలోకి వచ్చేసిన సింగర్ సునీత కొడుకు సినిమా | Kotha Malupu Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

OTT Movie: తెలుగు మూవీ.. సడన్‌గా ఓటీటీలో స్ట్రీమింగ్

Jul 6 2026 10:36 AM | Updated on Jul 6 2026 10:44 AM

Kotha Malupu Movie OTT Streaming Now

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. అయితే దాదాపుగా వీకెండ్‌లోనే రిలీజ్ అవుతూ ఉంటాయి. కానీ సింగర్ సునీత కొడుకు హీరోగా చేసిన ఓ మూవీ తాజాగా సోమవారం ఎలాంటి హడావుడి లేకుండా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎందులో చూడొచ్చు?

(ఇదీ చదవండి: ఓటీటీలోకి వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా)

టాలీవుడ్‌లో ఎన్నో ఏళ్లుగా అద్భుతమైన పాటలు పాడుతున్న సింగర్ సునీత.. పలువురు హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పింది. ఈమె కొడుకు ఆకాశ్..'సర్కౌర్ నౌకరి' అనే సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత 'కొత్త మలుపు' అనే మూవీ కూడా చేశారు. గత నెల 12న థియేటర్లలో రిలీజైంది. ఇదొచ్చిన సంగతి కూడా జనాలకు తెలియదు. ఇప్పుడు అలానే సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది.

'కొత్త మలుపు' విషయానికొస్తే.. బాధ్యతలు లేని హైదరాబాదీ కుర్రాడు కమల్ (ఆకాశ్).. ఫ్రెండ్స్‌తో ఎంజాయ్ చేస్తూ బతికేస్తుంటాడు. ఓసారి ఫ్యామిలీలో జరిగే ఓ పెళ్లి కోసం కోనసీమ జిల్లాలోని ఓ పల్లెటూరికి వెళ్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా)ని చూసి తొలి చూపులోనే మనసు పారేసుకుంటాడు. ఓరాత్రి అవమానకర పరిస్థితుల్లో చిక్కుకున్న కమల్‌ని గుర్తు తెలియని యువతి కాపాడుతుంది. ఆమెను వెతికి పట్టుకునేందుకు వరలక్ష్మితో కలిసి అన్వేషణ ప్రారంభిస్తాడు. అలా మొదలైన వీళ్లిద్దరి ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగింది?

ఈక్రమంలో కమల్‌కి కనిపించిన ఓ ఫొటో వల్ల వీళ్ల మధ్య ఎలాంటి అనుమానాలు, అపార్థాలు తలెత్తాయి? తాను వెతుకున్న అమ్మాయికి తను మనసు పారేసుకున్న వరలక్ష్మికీ ఏమైనా సంబంధం ఉందా? లేదా? ఆఖరికి ఈ ప్రేమకథ గెలిచిందా? అనేది మిగతా స్టోరీ. ఇద్దరి మధ్య ప్రేమలో ఓ అనుమానం మొదలైతే.. అదెంతటి ప్రమాదకర పరిస్థితులకు కారణమవుతుందో ఇందులో చూపించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement