కోర్ట్ రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌' ప్రారంభం | Due Date Movie Launch Details | Sakshi
Sakshi News home page

కోర్ట్ రూమ్‌ డ్రామా 'డ్యూ డేట్‌' ప్రారంభం

Jul 8 2026 3:54 PM | Updated on Jul 8 2026 4:03 PM

Due Date Movie Launch Details

పీఆర్‌ఓ, జర్నలిస్ట్‌గా తెలుగు సినీ పరిశ్రమలో సుపరిచితుడైన ఏలూరు శ్రీను నిర్మాతగా మారి, పవన్‌ తరిగోపులతో కలిసి నిర్మిస్తున్న చిత్రం 'డ్యూ డేట్‌' హైదరాబాద్‌లో బుధవారం పూజా కార్యక్రమంతో లాంఛనంగా మొదలైంది. ఆనంద్‌.కె. దర్శకుడు. హీరో లోమేష్‌, హీరోయిన్‌ జయశ్రీ‌తో పాటు కీలక పాత్రల్లో కనిపించబోతున్న ప్రణీత పట్నాయక్‌, విజ్క్షానిలపై  చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు మారుతి క్లాప్‌ నివ్వగా, సక్సెస్‌ఫుల్ నిర్మాత బన్నీవాస్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు.

ప్రస్తుత సమాజంలోని వివాదాస్పద అంశం ఆధారంగా అల్లుకున్న ఈ కమర్షియల్‌ కోర్ట్ రూమ్‌ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement