కొత్త సినిమా.. 100 మంది కొత్త నటీనటులకు అవకాశం | Kotha Cinema Movie New Song Launch | Sakshi
Sakshi News home page

'మేము కూడా సినిమా తీసినామురో' సాంగ్ లాంచ్

Jul 8 2026 4:28 PM | Updated on Jul 8 2026 4:36 PM

Kotha Cinema Movie New Song Launch

కొత్త దర్శకుడు అజర్.. లోకల్ టాలెంట్‌తో స్థానికంగా తీసిన చిత్రం 'కొత్త సినిమా'. దీనితో వంద మంది కొత్త నటీనటులు టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. సురేశ్, రాకేష్ ప్రధాన పాత్రలు చేశారు. మహమ్మద్ వాసిమ్ అక్రమ్, సాగి సుధీర్ రావు, యడండ్ల సతీష్ యాదవ్ నిర్మాతలు. ఈ సినిమా కోసం చరణ్ అర్జున్.. లిరిక్స్ రాసి కంపోజ్ చేసిన 'మేము కూడా సినిమా తీసినామురో..' పాటను బుధవారం, హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ సాయిలు కంపాటి, నటుడు ఆర్కే సాగర్ అతిథులుగా పాల్గొన్నారు.

డైరెక్టర్ అజర్ మాట్లాడుతూ - మేం కింద స్థాయి నుంచి వచ్చామని చాలామంది చెబుతుంటారు. మేము ఇంకా కింద స్థాయి నుంచి భూమి లోతుల్లోంచి, బొగ్గు బాయిలోంచి వచ్చాం. చీకటిలో వెలికితీసే బొగ్గు నుంచి వెలుగు పంచే ప్రాంతం రామగుండం నుంచి వచ్చిన వాళ్లం. ఎందరో గొప్ప తెలుగు దర్శకులు సినిమాను మన దగ్గరకు చేర్చారు, మనల్ని ఇన్స్ పైర్ చేశారు. నేను ఈ సినిమాను మరింత దగ్గరగా తీసుకెళ్లాలని అనుకున్నానని చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement