దిగ్గజ సింగర్ ఎస్.జానకి చనిపోయారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలకు తోడు కుమారుడిని కోల్పోయిన వేదన ఓ వైపు ఉండగా శనివారం సాయంత్రం మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకుపైగా 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల్ని అలరించారు. మరి ఈమె పాడిన చివరి పాట ఏంటో తెలుసా?
2016 అక్టోబరులో రిటైర్మెంట్ ప్రకటించిన జానకి.. ఓవరాల్ కెరీర్ ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. చివరగా 'అమ్మాపోవిను' అనే మలయాళ పాటను రికార్డ్ చేసి.. ఇకపై పాటలు పాడదలుచుకోలేదని, సినిమాలతో పాటు వేదిక మీద కూడా పాడేది లేదని ప్రకటించారు. అలా జరిగి పదేళ్లు అయింది. ఇప్పుడు ఈమె శాశ్వతంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. సుదీర్ఘ సంగీత ప్రయాణంలో దాదాపు భారతీయ భాషలన్నింటిలో పాడిన జానకి.. 4 జాతీయ అవార్డులతో పాటు 32 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు.


