breaking news
female singer
-
మూగబోయిన స్వర కోయిల
మైసూరు/బెంగళూరు/తెనాలి: తేనెలూరు తెలుగువారి గళ మాధుర్యాన్ని అనేక భాషల్లో శ్రోతలకు రుచి చూపించి మన కీర్తి పతాకను దశ దిశలా ఎగురవేసిన స్వర కోయిల మూగవోయిందన్న వార్త సంగీత ప్రియులను దిగ్భ్రాంతికి గురిచేసింది. తన పాటలతో జగమే ఊయల చేసిన మధుర గాయని ఎస్.జానకి ఇక లేరన్న చేదు వార్త విని సర్వత్రా ఆవేదన వ్యక్తమైంది. తన సుమధుర కంఠంతో ఆబాలగోపాలాన్ని ఓలలాడించిన బహుభాషా గాయని ఎస్.జానకి (88) శనివారం రాత్రి మైసూరు నగరంలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె పాత తాలూకాలోని నిజాంపట్నం మండలం పల్లపట్ల వాస్తవ్యురాలైన ఆమె ఆరేళ్లుగా మైసూరు బన్నూరు రోడ్డులోని ఫార్మ్‌హౌజ్‌లో నివాసం ఉంటున్నారు. ఎల్లప్పుడూ ధవళ వర్ణ సంప్రదాయ చీరకట్టులో కనిపించేవారు. కొన్నేళ్లుగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఇటీవలే బోగాది నగరలోని ఎస్బీఎం లేఔట్ నివాసంలో అద్దెకు ఉంటున్నారు. నవీన్, పవన్ అనే వ్యక్తులు ఆమెకు తోడునీడగా ఉంటూ సేవలు చేస్తూ వచ్చారు. వారం క్రితమే ఆమె మంగళూరుకు తన అక్క ఇంటికి వెళ్లి తిరిగి వచ్చారు. ఈ సమయంలో ఆమెతో పాటు కోడలు ఉమా, మనమరాలు అప్సరా కూడా ఉన్నారు. గత సంవత్సరం ఆమె తన కుమారుడు మురళీకృష్ణను కోల్పోవడంతో తీవ్ర మానసిక కుంగుబాటుకు గురయ్యారు. బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచుకుని మౌనంగా ఉండిపోయారు. ఈ క్రమంలో శనివారం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మధ్యాహ్నం 12.49 గంటలకు మైసూరులోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. అయినా ఆమె మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూల్ (బహుళ అవయవ వైఫల్యం)తో గుండెపోటుకు గురయ్యారు. రాత్రి 7.30 గంటలకు ఆమె మరణించారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకుని ఆమె బంధువులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అభిమానులు ఆస్పత్రి వద్దకు భారీగా తరలివచ్చారు. ఆమె అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం 5 గంటలకు మైసూరు బోగాది సమీపంలోని కణియర హుండి గ్రామంలోని ఫామ్‌హౌజ్‌లో జరుగుతాయని బంధువులు మీడియాకు తెలిపారు. అంతంకు ముందు ఆమె పార్థివ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మైసూరులోని మహారాజ కాలేజ్ గ్రౌండ్స్‌లో ఉంచుతారు. ప్రభుత్వ లాంఛనాలతో జానకి అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆటుపోట్ల జీవితం ఎస్.జానకి తన తీయని కంఠం ద్వారా ప్రజలను ఎంతగా ముగ్ధుల్ని చేశారో ఆమె జీవితం అంతగా ఆటుపోట్లకు గురైంది. 1938 ఏప్రిల్ 23న సత్యవతి, శ్రీరామమూర్తి దంపతులకు జన్మించారు. తండ్రి ఆయుర్వేద వైద్యుడు. ఆరుగురు అక్కాచెల్లెళ్లలో నాలుగో సంతానం జానకి. చదువంటే శ్రద్ధ లేదు. బడి అంటే ఆమడదూరం వెళ్లేవారు. రేడియోలో పాటలు వింటూ కాలక్షేపం. రోడ్డుపైకి వెళ్లినపుడు లతా మంగేష్కర్ పాటలు వింటూ, తాను పాడుతూ పెరిగారు. వివిధ కారణాలరీత్యా శ్రీరామమూర్తి కుటుంబం కొంతకాలం కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో, తర్వాత రాజమండ్రిలో ఉన్నారు. సిరిసిల్లలోనే తన బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తన చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఎండ్ల బండిలో వేములవాడకు వెళ్లి బాలనాగమ్మ సినిమాను చూసి వచ్చినట్లు ఓ ఇంటర్వ్యూలో జానకి గుర్తుచేసుకున్నారు. పాటలపై కూతురుకు గల ఆసక్తిని గమనించిన తల్లి సత్యవతి, రాజమండ్రిలో నాదస్వర విద్వాన్ గాడవల్లి పైడిస్వామి దగ్గర సంగీతంలో ప్రాథమిక శిక్షణ ఇప్పించారు. ఆ తర్వాత ప్రత్యేకంగా శాస్త్రీయ సంగీతం ఎవరి వద్దా నేర్చుకోలేదు. గురువు గారు కీర్తనలతో ఆరంభించినా, జానకి ధ్యాసంతా సినిమా పాటలపైనే ఉండేది. అక్కడుండే ‘క్రాంతి కళామండలి యూత్ అసోసియేషన్’లో సినిమా పాటల కచేరీల్లో పాటలు పాడుతున్న కాలంలో, అమ్మ మరణంతో మళ్లీ ఆ కుటుంబం హైదరాబాద్‌కు చేరుకుంది.జానకి మామయ్య ‘ఫన్ డాక్టర్’చంద్రశేఖర్ వేదికపై ప్రదర్శనలిస్తుండేవారు. మధ్యమధ్యలో జానకి పాటలు పాడుతూ వచ్చారు. ఆయన కుమారుడు వి.రాంప్రసాద్, జానకి స్వరంలోని ప్రత్యేకతను గమనించారు. కుమారుడు చేసిన సూచనతో చంద్రశేఖర్, చెన్నైలోని రెండు మూడు స్టూడియోలకు జానకి గురించి లేఖ రాశారు. ఏవీఎం స్టూడియో నుంచి ఆడిషన్‌కు రమ్మని కబురొచి్చంది. స్టూడియో స్టాఫ్‌గా ఎంపిక చేసుకున్నారు. తాను ఇష్టపడిన రాంప్రసాద్‌తోనే ఆమెకు 1959లో వివాహమైంది. పాటలకు సంబంధించిన ఒప్పందాలు, రెమ్యూనరేషన్, రాయల్టీలు అన్ని విషయాలు ఆయనే చూసుకున్నారు.1997లో గుండెపోటుతో భర్త మృతి చెందారు. చెన్నైలో స్థిరపడిన జానకి దంపతులకు ఏకైక కుమారుడు మురళీకృష్ణ కొన్ని సినిమాల్లో నటించినా ఎక్కువకాలం కొనసాగలేదు. కోడలు ఉమ నర్తకి. దూరదర్శన్ ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. తమిళనాడు ప్రభుత్వం ‘కలైమామణి’అవార్డు కూడా తీసుకున్నారు. ‘పాట నాకు ప్రాణం.. ప్రాణమున్నంతకాలం పాడుతూనే ఉంటాను’అంటుండే జానకి, భౌతికంగా ఊపిరి కోల్పోయినా ఆమె పాట ఇప్పటికీ, ఎప్పటికీ అభిమాన శ్రోతలను అలరిస్తూనే ఉంటుంది. కాగా, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంతోనూ ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తుమ్మలూరు గ్రామంలోని మ్యాక్ ప్రాజెక్టులో 279 నంబర్ విల్లాను కొనుగోలు చేసి కుమారుడు మురళీకృష్ణతో ఆమె నివసించారు. ఒక ఊపు ఊపిన ‘నీ లీల పాడెద దేవా..’ ⇒ 1957లో సంగీత దర్శకుడు టి.చలపతిరావు సంగీత దర్శకత్వంలో ‘విధియిన్ విళైయట్టు’తమిళ సినిమాలో రెండు పాటలు పాడించారు. ఆ సినిమా విడుదల కాలేదు. ఆ వెంటనే తెలుగులో ‘ఎంఎల్ఏ’సినిమా కోసం ‘నీ ఆశ అడియాశ చెయి జారే మణిపూస’పాటను ఘంటసాలతో కలిసి పాడారు. తొలిగా విషాదగీతంతో ఆరంభించినా, ఆమె సినీ కెరీర్ మధుర వెన్నెలలా కొనసాగింది. బావా మరదళ్లు సినిమాలో ‘నీలి మేఘాలలో గాలి కెరటాలలో’పాటతో బిజీ అయ్యారు. ⇒ ఆ క్రమంలోనే ‘మురిపించే మువ్వలు’సినిమాలో జానకి పాడిన ‘నీ లీల పాడెద దేవా’పాట దక్షిణాదిని ఒక ఊపు ఊపింది. తద్వారా సినీ రంగంలో ఆమెకో ప్రత్యేక స్థానం లభించింది. వాస్తవానికి ఆ పాటను పి.లీలతో పాడించాలని నిర్ణయించారు. అంత హైపిచ్‌తో తాను పాడలేనని, జానకిచే పాడించమని పి.లీల సూచించారు. ఆ పాటకు అభినయించే సావిత్రి మాత్రం సుశీలతో పాడించాలని పట్టుబట్టారు. ఆ చిత్ర సంగీత దర్శకుడు సుబ్బయ్యనాయుడు జానకి చేతనే పాడించారు. ⇒ ఇక జానకి వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. దిగ్గజ సంగీత దర్శకుల సంగీతానికి పాటలు పాడుతూ బిజీ అయ్యారు. మరో సంగీత దర్శకుడు ఎస్.రాజేశ్వరరావు జానకి పాటను అనుకోకుండా విన్నారు. వెంటనే పూజాఫలం సినిమాలో ‘పగలే వెన్నెలా.. జగమే ఊయల’పాడించటంతో మరింత బిజీ గాయనిగా మారారు. ⇒ ఆరాధనలో ‘ఆడదాని ఓరచూపులో’, రంగులరాట్నంలో ‘నడిరేయి ఏ జాములో’వంటి సూపర్ హిట్ పాటలతో జానకి సినిమా పాటల ప్రయాణం ప్రవాహంలా సాగింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, పంజాబి, ఒరియా, తుళు, కొంకణి, బడగ, సింహళం, ఇంగ్లి‹Ù, సంస్కృతం, జర్మన్, జపాన్ వంటి 20 భాషల్లో 48 వేలకు పైగా పాటలతో అలుపెరగని కోయిల అనిపించుకున్నారు. వీటిలో 17 వేలకు పైగా సినిమా పాటలు కాగా, మిగిలినవి ప్రైవేటు రికార్డులు, త్యాగరాజ కృతులు, మీరా భజన్లు. సొంత సంగీతంలో పాడారు. వీటితో పలు భక్తి సంగీత క్యాసెట్లు వచ్చాయి.ఎన్నెన్నో అవార్డులు, రివార్డులు ⇒ చిన్న పిల్లలకు పాడాలన్నా జానకమ్మనే పిలిచే వారు సంగీత దర్శకులు. ‘చందమామ రావే’(1987), ‘జడ్జిమెంట్’(1990) సినిమాల్లో బేబి సుజితకు డబ్బింగ్ చెప్పారు. ఉషాకిరణ్ మూవీస్ వారి ‘మౌన పోరాటం’సినిమాకు సంగీత దర్శకత్వం వహించారు. తన గాన మాధుర్యానికి వరించిన గౌరవాలెన్నో. ఆకాశవాణి పాటల పోటీల్లో ద్వితీయస్థానం సాధించి అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు. నాలుగుసార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని అవార్డును స్వీకరించారు. ⇒ 13 సార్లు కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు, ఆరుసార్లు తమిళనాడు ప్రభుత్వ అవార్డులు, మరో ఆరుసార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డులు, 12 నంది అవార్డులు (ఇందులో రెండు టెలివిజన్), ఒడిశా ప్రభు త్వ అవార్డులు లభించాయి. కలైమామణి, సుర్సింగార్, సింగర్ ఆఫ్ ది సెంచరీ, భారతీదాసన్ వంటి అవార్డులు మరికొన్ని. సంగీత ప్రపంచంలో రారా ణిగా వెలుగొందిన జానకి తమిళనాడు కోటాలో కేంద్ర ప్రభుత్వం ‘పద్మభూషణ్’పురస్కారాన్ని ప్రకటించింది. అప్పుడా గౌరవాన్ని జానకి తిరస్కరించటం దేశ వ్యాప్తంగా పెద్ద సంచలనం అయింది. అయిదు దశాబ్దాలకు పైగా సినీ రంగంలో చేసిన కృషికి ప్రభుత్వం ఆలస్యంగా స్పందించినా, దేశ ప్రజలందరి హృదయాల్లో తనకున్న స్థానమే చాలని ఆమె సంతృప్తి చెందారు. గాయనిగా ఉచ్ఛస్థితిలో ఉన్నపుడు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఎప్పుడో ఇస్తే ఎలాగని తిరస్కరించారని అంతా భావించారు. ⇒ ఎస్.జానకికి దైవ భక్తి ఎక్కువ. నంజనగూడులోని నంజుండేశ్వర, చాముండేశ్వరి, యోగా నరసింహస్వామి దేవాలయాల్లో తరచూ పూజలు చేసేవారు. అద్భుత సంగీత పయనం అనంతరం 2017 అక్టోబర్ 28న మైసూరు విశ్వవిద్యాలయం మానస గంగోత్రిలోని రంగమందిరంలో ఆమె తన పాటకు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇకపై తాను ప్రజా వేదికల్లో పాడబోనని ప్రకటిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారువైఎస్ జగన్ సంతాపం సాక్షి, అమరావతి: భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్.జానకి మరణం పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సినీ సంగీత రంగంలో దశాబ్దాల పాటు తన గాన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన ఎస్.జానకి సంగీత సరస్వతిగా అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్ జగన్ పేర్కొన్నారు.తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ తదితర భాషల్లో వేలాది పాటలు ఆలపించి, భారతీయ సంగీత చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని సృష్టించారని కొనియాడారు. తన స్వరంతో ఎన్నో తరాలను అలరించిన ఎస్.జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు. ఆమె పాడిన పాటలు, ఆమె అందించిన సంగీత వారసత్వం తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఎస్.జానకి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించానన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు, సంగీత ప్రియులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. సంగీత ప్రపంచానికి తీరని లోటు: గవర్నర్ సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి మృతిపై గవర్నర్ శివప్రతాప్ శుక్లా సంతాపం వ్యక్తంచేశారు. జానకి మృతి భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటన్నారు. తెలుగు నేల గర్వించదగ్గ మహోన్నత గాయని జానకి అని కొనియాడారు. జానకి గానామృతం తరతరాలపాటు సంగీతాభిమానుల హృదయాల్లో నిలిచిపోతుందన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానకి తెలుగు ప్రజలకు గర్వకారణం: సీఎం జానకి మృతి పట్ల సీఎం ఎ.రేవంత్‌రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. జానకమ్మ మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటని పేర్కొన్నారు. జానకి కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కిషన్‌రెడ్డి, సంజయ్, రాంచందర్‌రావు సంతాపం జానకి మృతి పట్ల కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. దశాబ్దాల పాటు శ్రోతలను అలరించిన జానకి కన్నుమూశారనే వార్త విచారకరమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. జానకి మరణం భారతీయ సంగీతానికి ఎంతో లోటని సంజయ్ తెలిపారు. ప్రపంచ సంగీతానికి జానకి మరణం తీరని లోటని రాంచందర్‌రావు పేర్కొన్నారు. జానకి మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు: కేసీఆర్ జానకి మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. జానకమ్మ మరణం దక్షిణ భారత సంగీత ప్రపంచానికి, భారతీయ చలనచిత్ర రంగానికి తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు. ఆరు దశాబ్దాలపాటు వేలాది పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు. ఆమె కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జానకి మరణవార్త ఎంతో బాధాకరం: కేటీఆర్ జానకి మరణం చలనచిత్ర రంగానికి తీరనిలోటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జానకి తన బాల్యంలో కొన్నేళ్లు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో నివాసం ఉన్నారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. -
ప్రముఖ గాయని ఎస్.జానకి (88) కన్నుమూత
-
కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య ప్రశాంత మరణం
ప్రముఖ గాయని ఎస్.జానకి(88) కన్నుమూశారు. మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కార్డియాక్ అరెస్ట్ కారణంగా తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఈమె మనవరాలు అప్సరా వైద్యుల.. సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ పోస్ట్‌లో ఆమెతో అనుబంధాన్ని, తుదిశ్వాస విడిచిన సందర్భం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.'దిగ్గజ గాయని, మా నానమ్మ చనిపోయారనే విషయాన్ని తెలియజేస్తున్నాను. కుటుంబ సభ్యుల ప్రేమాభిమానాల మధ్య ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. ఈ విషాద సమయంలో మా కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అదే సమయంలో సంగీత ప్రపంచానికి ఆమె అందించిన అపూర్వమైన సేవలు, కోట్లాదిమంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆమె గానమాధుర్యం పట్ల గర్వంగా, కృతజ్ఞతతో ఉన్నాం''ప్రపంచానికి ఎస్.జానకి ఒక దిగ్గజ గాయని, ఎన్నో తరాల జ్ఞాపకాలలో చిరస్థాయిగా నిలిచిపోయిన స్వరం. మా కుటుంబానికి మాత్రం ప్రేమ, ఆప్యాయత, వినయం, దయ, మానవత్వం పంచిన మంచి నానమ్మ. ఈ క్లిష్ట సమయంలో మా ప్రైవసీ గౌరవించాలని ప్రజలు, అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి. మా కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రేమ, ప్రార్థనలు, సానుభూతి తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు' అని అప్సరా వైద్యుల తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: జానకి పాడిన చివరి పాట ఏంటంటే?) View this post on Instagram A post shared by Apsara Vydyula (@apsaravydyula) -
కన్నుమూసిన జానకి.. చివరి పాట ఏంటంటే?
దిగ్గజ సింగర్ ఎస్.జానకి చనిపోయారు. వృద్ధాప్య సంబంధిత సమస్యలకు తోడు కుమారుడిని కోల్పోయిన వేదన ఓ వైపు ఉండగా శనివారం సాయంత్రం మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఉండగా గుండెపోటు వచ్చింది. దీంతో తుదిశ్వాస విడిచారు. ఆరు దశాబ్దాలకుపైగా 17 భాషల్లో 50 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల్ని అలరించారు. మరి ఈమె పాడిన చివరి పాట ఏంటో తెలుసా?2016 అక్టోబరులో రిటైర్మెంట్ ప్రకటించిన జానకి.. ఓవరాల్ కెరీర్ ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. చివరగా 'అమ్మాపోవిను' అనే మలయాళ పాటను రికార్డ్ చేసి.. ఇకపై పాటలు పాడదలుచుకోలేదని, సినిమాలతో పాటు వేదిక మీద కూడా పాడేది లేదని ప్రకటించారు. అలా జరిగి పదేళ్లు అయింది. ఇప్పుడు ఈమె శాశ్వతంగా లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. సుదీర్ఘ సంగీత ప్రయాణంలో దాదాపు భారతీయ భాషలన్నింటిలో పాడిన జానకి.. 4 జాతీయ అవార్డులతో పాటు 32 రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. -
ప్రముఖ గాయని జానకి కన్నుమూత
ప్రముఖ గాయని ఎస్.జానకి(88) కన్నుమూశారు. వయోభారంతో ఇబ్బందిపడుతున్న ఈమె మైసూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో శనివారం(జూలై 11) సాయంత్రం గుండెపోటుతో మరణించారు. అమెరికాలో ఉంటున్న కుమారుడు కొన్నాళ్ల క్రితం చనిపోవడంతో మనోవేదనకు గురయ్యారు. ఆ బాధకి తోడు అనారోగ్య సమస్యల కారణంగా ఇప్పుడు తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా, రేపల్లె సమీపంలోని పల్లపట్ల గ్రామంలో 1938 ఏప్రిల్ 23న జన్మించారు. చిన్నతనం నుంచే సంగీతంపై మక్కువ పెంచుకుని, నాదస్వరం విద్వాంసుడు పైడిస్వామి వద్ద ప్రాథమిక పాఠాలు నేర్చుకున్నారు.సినీ ప్రస్థానం: 1957లో తమిళ చిత్రం 'విధియిన్ విలయాత్తు' ద్వారా నేపథ్య గాయనిగా ప్రస్థానం ప్రారంభించారు. అదే ఏడాది 'ఎమ్మెల్యే' చిత్రంలో 'నీతియే జయమౌనురా' అనే పాట పాడారు. చిన్న పిల్లల గొంతు నుండి ముసలివారి వరకు ఏ వయసు పాత్రకైనా సరిపోయేలా తన స్వరంలో మార్పులు (Voice Modulation) చేయడం ఆమె ప్రత్యేకత.సంగీత ప్రయాణం: లెజండరీ గాయకుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో ఆమె పాడిన యుగళ గీతాలు భారతీయ సంగీత చరిత్రలో మైలురాళ్ళుగా నిలిచాయి. 17 భాషల్లో 50వేలకు పైగా పాటలు పాడారు ఎస్ జానకి.పురస్కారాలు జాతీయ అవార్డులు: ఉత్తమ నేపథ్య గాయనిగా 4 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి 12 నంది అవార్డులతో పాటు వివిధ దక్షిణాది రాష్ట్రాల నుండి 30కి పైగా అవార్డులు పొందారు. 1986లో కలైమామణి అవార్డు, 1997లో ఫిలింఫేర్, 2002లో అచీవర్ అవార్డు, 2005లో జేసుదాసు అవార్డులు ఆమెను వరించాయి. 2009లో మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. 2015లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2017లో వేటూరి జీవిత సాఫల్య పురస్కారం ఆమెకు లభించాయి. మౌనపోరాటం చిత్రానికి సంగీత దర్శకత్వం వహించారు జానకి.పద్మభూషణ్ తిరస్కరణ: 2013లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 'పద్మభూషణ్' పురస్కారాన్ని, దక్షిణాది కళాకారులకు గుర్తింపు ఆలస్యంగా లభిస్తోందని నిరసిస్తూ ఆమె గౌరవపూర్వకంగా తిరస్కరించారు. -
ప్రేమ ఒప్పుకోలేదని.. కెనడా నుంచి వచ్చి కిడ్నాప్- హత్య
పంజాబ్‌లో లేడీ సింగర్ హత్య ఉదంతం సంచలనం సృష్టించింది. యశిందర్ కౌర్ అలియాస్ ఇందర్ కౌర్ (29) మృతదేహాన్ని ఆరు రోజుల తర్వాత పోలీసులు నీటి కాలువలో గుర్తించారు. మే 13న రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఇందర్ కౌర్.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు మృతదేహం లభించడంతో అసలేం జరిగిందనే విషయాలు బయటకొచ్చాయి.(ఇదీ చదవండి: మీ నాన్నతో గొడవ క్లియర్ అయిందా? మనోజ్ సమాధానమిదే)హత్యకు గురైన ఇందర్ కౌర్ సోదరుడు జోటిందర్ సింగ్ ఫిర్యాదు ప్రకారం.. ఇందర్ మే 13న రాత్రి 8:30 గంటలకు కారులో సరుకులు కొనుగులు చేసేందుకు వెళ్లింది. కాసేపటి తర్వాత నుంచి ఆమె ఆచూకీ లభించలేదు. అయితే ఈమె కనిపించకపోవడం వెనక మోగా జిల్లాకు చెందిన సుఖ్విందర్ సింగ్ అలియాస్ సుఖా హస్తం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. మూడేళ్ల క్రితం ఇందర్ కౌర్‌కి ఇన్ స్టా ద్వారా సుఖ్విందర్ సింగ్ పరిచయమయ్యాడు. ప్రేమ పేరిట పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. కానీ అప్పటికే అతడికి పెళ్లయిందని తెలుసుకున్న ఇందర్ కౌర్, సుఖ్విందర్ని దూరం పెట్టింది. దీంతో కక్ష పెంచుకున్న అతడు.. ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు.పోలీసుల దర్యాప్తు ప్రకారం.. కెనడాలో ఉంటున్న సుఖ్విందర్, నేపాల్ గుండా పంజాబ్‌కి చేరుకున్నాడు. 13వ తేదీన తన సహచరులతో కలిసి ఇందర్ కౌర్ కారుని అడ్డగించి తుపాకీతో బెదిరించి ఆమెని కిడ్నాప్ చేశాడు. తర్వాత ఆమెని హత్య చేసి నీటి కాలువలో పడేశాడు. నేరం చేసిన వెంటనే నేపాల్ ద్వారానే తిరిగి కెనడాకి పారిపోయాడని తెలుస్తోంది.అయితే ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇందర్ కౌర్ కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 15వ తేదీనే జమాల్పూర్ పోలీస్ స్టేషన్లో సుఖ్విందర్ సింగ్, కరమ్‌జిత్ సింగ్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ, వెంటనే చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు. ఇందర్ కౌర్ మృతదేహాన్ని కాలువ నుంచి బయటకు తీసిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. నిందితులని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.(ఇదీ చదవండి: గర్ల్‌ఫ్రెండ్ బానిస కాదు.. కొత్త తెలుగు సినిమా) -
తిరుమలలో పెళ్లి చేసుకున్న 'కేజీఎఫ్' సింగర్
కన్నడ సినిమా రేంజుని 'కేజీఎఫ్' సినిమా ఎంతో మార్చేసింది. హీరోహీరోయిన్, దర్శకుడితో పాటు మూవీ కోసం పనిచేసిన చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే ఫ్రాంచైజీలో రెండు చిత్రాల్లోనూ చాలావరకు పాటలు పాడిన సింగర్ అనన్య భట్ కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె తిరుమలలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంది.(ఇదీ చదవండి: నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్)కన్నడలో ఫోక్ సింగ్స్, సినిమా పాటలు పాడే అనన్య భట్.. ఆదివారం (నవంబరు 09) వివాహం చేసుకుంది. తనలానే సంగీత పరిశ్రమకు చెందిన డ్రమ్మర్ మంజునాథ్‌తో ఏడడుగులు వేసింది. తిరుమలలో జరిగిన ఈ శుభకార్యం.. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో చాలా సింపుల్‌గా జరిగిపోయింది. తన పెళ్లి గురించి అనన్య.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సింగర్ మంగ్లీతో పాటు తోటి గాయనీగాయకులు అనన్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు.అనన్య.. 'కేజీఎఫ్' ఒరిజినల్ వెర్షన్‌లోని మెహబూబా, ధీర ధీర, సుల్తాన్ పాటలు పాడింది. అలానే తెలుగు వెర్షన్‌లోని 'తరగని బరువైనా' అంటూ సాగే తల్లి సెంటిమెంట్ సాంగ్ కూడా పాడింది. ఇది కాకుండా 'పుష్ప' కన్నడ వెర్షన్‌లోని 'సామి సామి' పాటలో వినిపించే గొంతు ఈమెదే. రీసెంట్ టైంలో తెలుగులో అయితే 'షష్టిపూర్తి', 'గరివిడి లక్ష్మి' సినిమాల్లో ఈమె పాటలు పాడింది.(ఇదీ చదవండి: సర్ప్రైజ్.. మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ రిలీజ్) -
భారీ రెమ్యునరేషన్ తీసుకునే టాప్ 10 లేడీ సింగర్స్ వీళ్లే!
సంగీత ప్రపంచంలో గాయణీమణులకు ప్రత్యేక స్థానం ఉంది. తమ అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది ప్రేమను పొందుతున్న లేడీ సింగర్స్ చాలా మందే ఉన్నారు. వారు ఆలపించే సినిమా పాటలకు యూట్యూబ్‌లో కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ చిత్ర పరిశ్రమలో ‘గాన కోకిల’లకు మంచి డిమాండ్ ఉంది. మేల్ సింగర్స్ కంటే వాళ్లే ఎక్కువ సంపాదించే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఒక్కో పాటకు లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ సినిమాలతో పాటు లైవ్ కాన్సర్ట్‌లు, ఈవెంట్ల ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు. ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న లేడీ సింగర్స్‌పై ఓ లుక్కేద్దాం.1. శ్రేయా ఘోషాల్: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయనీ శ్రేయా ఘోషాల్. ఈమె ఒక్కో పాటకు సుమారు రూ. 25-27 లక్షలు, లైవ్ కాన్సర్ట్‌లకు రూ. 40-45 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. 'బర్సో రే', 'దేవసేనా' వంటి పాటలతో ఆమె అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. సూసేకీ..(పుష్ప 2), హైలోస్సో..(తండేల్), నానా హైరానా..(గేమ్ ఛేంజర్) లాంటి అద్భుతమైన పాటలను ఆలపించి.. తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంది.2. సునిధి చౌహాన్సునిధి ఒక్కో పాటకు రూ. 20-25 లక్షలు, కాన్సర్ట్‌లకు రూ. 25-30 లక్షలు ఛార్జ్ చేస్తారట. నాలుగేళ్ల వయసులోనే ఆమె సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది. 'ఢూమ్ మచాలే', 'బీడీ జలైలే' వంటి పాటలతో బాలీవుడ్లో సంచలనం సృష్టించారు.ఇప్పటి వరకు ఆమె 10 భాషల్లో 2500 వరకు పాటలను పాడారు. ఓయ్ సినిమాలో ఆమె ఆలపించిన ‘సరదాగా చందమామనే..’ పాట సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఆ పాట చాలా మంది వింటుంటారు.3. కనికా కపూర్ బేబీ డాల్, చిట్టియక్కలాయాన్, టుకుర్ టుకుర్, జెండా ఫూల్ పాటలతో పాటు పుష్ప సినిమాలోని ఊ బోలెగా యా.. ఉఊ బోలేగా సాంగ్‌తో జనాలను ఉర్రూతలూగించిన ఈ అందాల గాయని ఒక్కో పాటకు 18-22 లక్షలు తీసుకుంటుందట. ఆమె ఆస్తుల విలువ దాదాపు 50 కోట్ల వరకు ఉంటుదని సమాచారం.4. నేహా కక్కర్యూత్లో భారీ ఫాలోయింగ్ ఉన్న సింగర్ నేహా కక్కర్. ఆమె ఒక్కో పాటకు రూ. 10-15 లక్షలు, ఈవెంట్లకు రూ. 25-30 లక్షలు తీసుకుంటారు. 'మైల్ హో తుమ్', 'గర్మీ' వంటి హిట్ డ్యాన్స్ నంబర్స్‌తో ఆమె ట్రెండ్‌సెట్టర్‌గా మారారు.5. అల్కా యాగ్నిక్: 90లో బాలీవుడ్ హిట్ల రాణి అల్కా ఒక్కో పాటకు రూ. 12 లక్షలు, కాన్సర్ట్‌లకు రూ. 15-20 లక్షలు తీసుకుంటారు. 'ఏక్ దో తీన్', 'చోలీ కే పీఛే' వంటి పాటలతో ఆమె లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు6. నీతి మోహన్బాలీవుడ్ ప్రముఖ సింగర్స్‌లో నీతి మోహన్ ఒకరు. ఆమె ఒక్కో పాటకు 8-10 లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటుంది.7. తులసి కుమార్మెలోడీ సాంగ్స్‌తో గుర్తింపు పొందిన తులసి ఒక్కో పాటకు రూ. 5-10 లక్షలు, లైవ్ షోలకు రూ. 8-10 లక్షలు తీసుకుంటారు. 'తుమ్ జో ఆయే', 'లవ్ హో గయా' వంటి పాటలతో ఆమె అభిమానులను సంపాదించారు.8. ఆషా భోస్లేదిగ్గజ గాయనీమణి ఆషా ఒక్కో పాటకు రూ.5-8 లక్షలు, ఈవెంట్లకు రూ. 10-15 లక్షలు ఛార్జ్ చేస్తారు. 'దమ్ మారో దమ్', 'పియా తు అబ్ తో ఆజా' వంటి ఐకానిక్ పాటలతో ఆమె మంచి గుర్తింపు పొందింది.9. శిల్పారావుతనగాత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుటున్న తెలుగమ్మాయి శిల్పారావు ఒక్కో పాటకు 5-10 లక్షల వరకు తీసుకుంటుంది. దేవర సినిమాలో ‘చుట్టమల్లే..’, జైలర్ లో కావాలయ్యా అనే పాట పాడింది ఈ సింగరే.10. మోనాలీ ఠాకూర్బహుముఖ ప్రతిభ కలిగిన మోనాలీ ఒక్కో పాటకు రూ.5-10 లక్షలు, లైవ్ షోలకు రూ. 15 లక్షల వరకు తీసుకుంటారు. 'జరా జరా టచ్ మీ', 'సావర్‌లూన్' వంటి పాటలతో ఆమె గుర్తింపు పొందారు. -
భర్తతో విడాకులు.. సింగర్‌కు క్యాబ్ డ్రైవర్ వేధింపులు!
హైదరాబాద్: భర్తతో విడాకులు తీసుకున్న ఓ ఫిమేల్ సింగర్‌ను క్యాబ్ డ్రైవర్ వేధింపులకు గురిచేశాడు. అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసి కుటుంబ సభ్యులకు పంపుతానని, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు.వివరాల్లోకి వెళితే..బేగంపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన గాయనికి 2012లో వివాహం జరగ్గా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా 2024లో విడాకులు తీసుకుంది. అయితే సింగర్ విడాకులు తీసుకున్న విషయం తెలుసుకున్న బల్కంపేటకు చెందిన క్యాబ్ డ్రైవర్ ఉమామహేష్ గతంలో 2006లో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను ఆమెకు పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్టార్ సింగర్స్ మధ్య మనస్పర్థలు.. బ్రేకప్ ట్వీట్ వైరల్
మన దేశంలో చాలామంది సింగర్స్ ఉన్నారు. వాళ్లలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే గాయకుల లిస్ట్ తీస్తే కచ్చితంగా ఉండే పేరు నేహా కక్కర్. ఇప్పుడు సింగింగ్ షో జడ్జిగా పేరు తెచ్చుకుంది గానీ ఒకప్పుడు పాటలు బాగానే పాడింది. అలాంటిది ఇప్పుడు ఈమె ఇంట్లో మనస్పర్థలు చోటుచేసుకున్నాయి.(ఇదీ చదవండి: మళ్లీ ఎప్పుడు కనబడతానో తెలీదు: ఎన్టీఆర్) నేహా కక్కర్ కు అక్క సోనూ కక్కర్, తమ్ముడు టోనీ కక్కర్ ఉన్నారు. వీళ్లు ముగ్గురు కూడా సింగర్స్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. కలిసి పాటలు పాడారు. స్టేజీ ఫెర్మార్మెన్స్ లు కూడా ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు అక్క సోనూ కక్కర్ షాకింగ్ ట్వీట్ చేసింది.తాను తమ్ముడు చెల్లి నుంచి విడిపోతున్నానని.. ఇక నుంచి వాళ్లకు తనకు సంబంధం లేదని సోనూ కక్కర్ ట్వీట్ చేసింది. తర్వాత కొన్ని గంటలకే ఈ ట్వీట్ డిలీట్ చేసింది. దీంతో నెటిజన్లు రెచ్చిపోయారు. ఇదంతా కొత్త ఆల్బమ్ కోసం చేస్తున్న స్టంట్ అని, పీఆర్ స్టంట్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏం జరిగిందనేది కక్కర్ సిస్టర్స్ చెబితే గానీ క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 21 సినిమాలు) -
27 ఏళ్లకే ప్రముఖ సింగర్ మృతి.. కారణమేంటి?
ప్రముఖ లేడీ సింగర్ రుక్సానా బానో (27) చనిపోయింది. ఒడిశా సంబల్‌పూర్‌కి చెందిన ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ బాగానే గుర్తింపు తెచ్చకుంది. అనారోగ్య సమస్యలతో ఆగస్టు 27న ఆస్పత్రిలో చేరిన ఈమె.. ఇప్పుడు ఇలా చనిపోవడం అభిమానులకు షాక్‌కి గురిచేసింది. మరి చిన్న వయసులోనే తనువు చాలించడంపై ఆమె తల్లి, సోదరి చేసిన కామెంట్స్ మాత్రం చర్చనీయాంశంగా మారిపోయాయి.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీలోకి వచ్చేసిన 22 సినిమాలు)ఒడియా సాంగ్స్ పాడుతూ ఫేమస్ అయిన రుక్సానా బానో.. కొన్నాళ్ల క్రితం షూటింగ్ కోసం బోలంగిర్ అనే ఊరు వెళ్లింది. జ్యూస్ తాగిన తర్వాత అనారోగ్యానికి గురైంది. వెంటనే భవానీపట్నలోని ఆస్పత్రిలో చేర్పించారు. ఇదంతా ఆగస్టు 27న జరిగింది. బోలంగిర్‌లోని పెద్దస్పత్రిలో చూపించినప్పటికీ ఫలితం లేకపోవడంతో బార్గర్ ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. అక్కడి కూడా అవ్వకపోయేసరికి భువనేశ్వర్‌లోని ఎయిమ్స్‌కి తరలించారు. అప్పటినుంచి చికిత్స అందించారు కానీ ఫలితం కనిపించలేదు. ఈ బుధవారం రాత్రి చనిపోయింది.ఆస్పత్రి వర్గాలు.. రుక్సానా బానో విషపురుగు కాటుకి గురైందని అంటుడగా ఈమె తల్లి, సోదరి మాత్రం ప్రత్యర్థి సింగర్ ఈమెకు విషమిచ్చి చంపేసిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయం ఒడిశా సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన నటుడు అమితాబ్ బచ్చన్) -
దేశంలో రిచెస్ట్ సింగర్.. వందల కోట్ల ఆస్తి.. ఈమె ఎవరో తెలుసా?
మన సినిమాల్లో పాటలు ఎంత ముఖ్యమో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీటివల్ల మ్యూజిక్ డైరెక్టర్స్, సింగర్స్ ఫేమస్ అవుతారు. సంపాదన విషయానికొచ్చేసరికి మాత్రం సింగర్స్‌కి వచ్చేది నామమాత్రమే అని చెప్పొచ్చు. స్టార్ సింగర్స్‌కి తప్పితే మిగతా వాళ్లందరికీ వేలల్లోనే ఇస్తుంటారు. అలాంటిది మన దేశంలోనే రిచెస్ట్ సింగర్ ఒకరున్నారు. ఆమె ఆస్తే వందల కోట్లు ఉంటుందని మీకు తెలుసా? అవును పైన చెప్పింది కరెక్టే. భారతీయ సినిమాల్లో పాటలు పాడే ఓ లేడీ సింగర్ ఆస్తి అక్షరాలా రూ.200 కోట్లు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. అయితే ఈమె మీరనుకున్నట్లు అత్యంత ధనిక సింగర్ శ్రేయా ఘోషల్, నేహా కక్కర్, ఆశా భోంస్లే కాదు తులసి కుమార్. ఈమె ఎవరబ్బా? ఎప్పుడు పేరే వినలేదు అనుకుంటున్నారు కదా! అవును ఎక్కువగా హిందీ పాటలే పాడుతూ బాలీవుడ్ లో ఉండటం వల్ల ఈమె దక్షిణాది సంగీత ప్రియులకు పెద్దగా పరిచయం లేదు. (ఇదీ చదవండి: ట్రాక్ తప్పుతున్న రైతుబిడ్డ.. నామినేషన్స్‌లో ఒక్క పాయింట్ తిన్నగా లేదు!) అయితే ఈమె పాటలు మాత్రం మీరు కచ్చితంగా వినే ఉంటారు. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్‌కి ఈమె స్వయానా చెల్లెలు అవుతుంది. 2009లో 'లవ్ హో జాయేగా' ఆల్బమ్‌తో గాయని కెరీర్ ప్రారంభించిన తులసి కుమార్. ఆ తర్వాత అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాల్ లాంటి స్టార్ హీరోల సినిమాల్లో పాడింది. 'ఆషికి 2'లోని హమ్ మర్ జాయేంగే, పియా ఆయేనా లాంటి పాటలతో పాటు బోలెడన్ని సాంగ్స్ ఈమె పాడింది. ఒక్కో పాటకు రూ.35 లక్షల వరకు పారితోషికం అందుకుంటున్న తులసి కుమార్.. ఓ సినిమాకు గానూ రూ.80 లక్షలు అందుకుంటోంది. బ్రాండ్స్, లైవ్ షోలు, యాడ్స్ ఇవన్నీ అదనం. అలా ప్రతి ఏడాది ఆదాయంతో పాటు ఆస్తిని పెంచుకుంటున్న తులసి కుమార్‌కి ప్రస్తుతం రూ.200 కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఈమె తర్వాత ఎక్కువ ఆస్తి ఉన్న సింగర్స్‌లో స్థానాల్లో శ్రేయా ఘోషల్, సునిధి చౌహాన్, ఆశా భోంస్లే, నేహా కక్కర్ ఉంటారు. (ఇదీ చదవండి: జాతీయ అవార్డు అందుకున్న అల్లు అర్జున్.. సరికొత్త చరిత్ర) View this post on Instagram A post shared by Tulsi Kumar 🧿 #TrulyKonnected #BoloNa (@tulsikumar15) -
వాణీ జయరాం ముఖంపై తీవ్రగాయాలు.. అసలేం జరిగింది!
ప్రముఖ గాయని వాణీ జయరాం మృతిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె నుదురు, ముఖంపై బలమైన గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెన్నైలోని ఆమె ఇంటిని స్వాధీనం చేసుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పని మనిషి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె ఇంటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరీశీలిస్తున్నారు. ఆమెది సాధారణ మృతి కాదని, ఎవరో హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కాలింగ్ బెల్ కొట్టినా తలుపులు తీయకపోవడంతో పగలగొట్టి లోపలికి వెళ్లినట్లు పనిమనిషి పోలీసులకు తెలిపింది. ఇటీవలే ఆమెకు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ పురస్కారం ప్రకటించి గౌరవించింది. -
స్ఫూర్తి: తలవంచని పాట
పాడటం తప్పు కాదు... అదొక అద్భుతమైన కళ అయితే ఆ కళ కొందరికి కంటగింపుగా మారింది కశ్మీర్లో బహిరంగ వేదిక ఎక్కి ఒక అమ్మాయి పాట పాడటం అనేది అంత తేలికైన విషయం కాదు! వెర్రితలలు వేసే వెక్కిరింపులతో పాటు, ‘ప్రాణాలు తీస్తాం’ అని బెదిరింపులు కూడా ఎదురవుతుంటాయి. ఆ బెదిరింపులకు భయపడి ఉంటే కశ్మీర్‌లోని మారుమూల పల్లెలో పుట్టిన షాజియా బషీర్ గాయనిగా అంతర్జాతీయ స్థాయిలో రాణించేది కాదు. ఎంతోమంది యువకళాకారులకు స్ఫూర్తిని ఇచ్చి ఉండేది కాదు... దక్షిణ కశ్మీర్‌లోని తాజివర అనే ఊళ్లో పుట్టింది షాజియ. చిన్నప్పటి నుంచి పాటలు అద్భుతంగా పాడేది. సంగీతంలో ఎక్కడా శిక్షణ తీసుకోకపోయినా, ఆ అందమైన ప్రకృతే ఆమెకు రాగాలు నేర్పిందేమో అన్నట్లుగా ఉండేది. పెరిగి పెద్దయ్యాక కూడా ఆమె పాట బాటను వీడలేదు. మిలే సుర్ (డిడి కశ్మీర్) అనే టీవీ కార్యక్రమానికి ఎంపిక కావడం తన జీవితాన్ని మలుపు తిప్పింది. రకరకాల వడపోతల తరువాత ఎంపికైన నలుగురిలో తానొక్కతే అమ్మాయి. ఈ కార్యక్రమంతో షాజియాకు గాయనిగా ఎంతో పేరు వచ్చింది. మరోవైపు ‘రేడియో కశ్మీర్’ కోసం తాను పాడిన పాటలు సూపర్‌హిట్ అయ్యాయి. ఏ ఊళ్లో సంగీత కార్యక్రమం జరిగినా తనను పిలిపించి పాడించేవారు. బాలీవుడ్ మసాలా పాటలు కాకుండా కశ్మీరి సంప్రదాయ జానపదగీతాలను పాడి అలరించేది. కొత్తతరానికి అవి కొత్త పాటలు, పాతతరానికి అవి మళ్లీ గుర్తు చేసుకునే మధురమైన పాటలు. ఎక్కడికైనా బస్‌లోనే వెళ్లేది. ఎంత రాత్రయినా తల్లిదండ్రులు తన కోసం బస్‌స్టాప్‌లో ఎదురు చూసేవారు. ఒకవైపు షాజియా గానమాధుర్యానికి అబ్బురపడి మెచ్చుకునేవాళ్లతో పాటు, మరోవైపు ‘వేదికలు ఎక్కి పాడడం ఏమిటి. ఊరూరూ తిరగడం ఏమిటీ’ అని విమర్శించేవాళ్ల సంఖ్య కూడా పెరిగింది. బెదిరింపులు కూడా వచ్చాయి. ఆ రోజులన్నీ తనకు నిద్రలేని రాత్రులే. ఈ వెక్కిరింపులు, బెదిరింపులను తట్టుకోవడం తన వల్ల కాదనుకొని ఒకానొక సమయంలో ‘పాట’కు శాశ్వతంగా దూరంగా జరగాలని అనుకుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు, సోదరుడు ధైర్యం చెప్పారు. తనను పాటకు మరింత దగ్గర చేశారు. ఇంగ్లాండ్ నుంచి ఆస్ట్రేలియా వరకు ఎన్నెన్నో దేశాల్లో తన పాటల అమృతాన్ని పంచింది షాజియ. నసీమ్ అక్తర్ మెమోరియల్ అవార్డ్, బక్షీ మెమోరియల్ కమిటీ అవార్డ్, సంగీత్ నాటక్ అకాడమీ... లాంటి ఎన్నో అవార్డ్లు అందుకున్న షాజియ సూఫీగీతాలతో పాటు హిందూ భక్తిగీతాలను మధురంగా ఆలపించడంలో అద్భుతం అనిపించుకుంది. 2014లో తండ్రి చనిపోవడంతో షాజియ గొంతులో దుఃఖం తప్ప ఏమీ లేకుండా పోయింది. అవి తనకు చీకటి రోజులు. అదేసమయంలో తండ్రి మాట ‘నువ్వు పాట ఎప్పుడూ ఆపవద్దు’ గుర్తుకు వచ్చి మళ్లీ పాడటం మొదలుపెట్టింది. తన పాట ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చింది. షాజియాను ఆదర్శంగా తీసుకొని ఈ తరం యువతులు సంగీతరంగంలో రాణిస్తున్నారు. ‘ఏ రంగంలో అయినా కష్టపడడం తప్ప విజయానికి దగ్గరి దారి అనేది లేదు’ అంటున్న షాజియా కష్టపడే తత్వానికి ఆత్మస్థైర్యాన్ని కూడా జోడించింది. -
ఏఆర్ రెహమాన్ పరిచయం చేసిన సింగర్లు
లతా అతని కోసం ‘జియా జలే జాన్ జలే’ పాడింది. ఆశా భోంస్లే ‘మై హూ రంగీలారే’ పాడింది. చిత్ర ‘కన్నానులే’తో అశేష అభిమానులను పొందింది. ‘చిన్ని చిన్ని ఆశ’ పాడిన మిన్మిని ఆ ఒక్క పాటతో చరిత్రలో నిలిచిపోయింది. ఏ.ఆర్.రహమాన్ కొత్త సంగీతం మాత్రమే తేలేదు. భారతీయ సంగీతంలో కొత్త గాయనీమణుల గొంతులెన్నో తెచ్చాడు. ‘గుంజుకున్నా.. నిన్ను ఎదలోకే’ పాడిన శక్తిశ్రీ గోపాలన్ గొంతు అతడు వినిపించకపోతే తెలిసేదా. లోకం ఒమిక్రాన్ కలకలంలో ఉంది. ఇవాళ ఈ పాటలే కాసింత స్వస్థత. ప్రతి పాట పాడటానికీ ఒక కోకిల పుట్టి ఉంటుంది. చేయాల్సింది ఏమిట్రా అంటే ఆ కోకిలను వెతకడం. సరైన చివురు ఉన్న కొమ్మపై కూచోబెట్టి కూకూ అనిపించడం. సుశీల, జానకి, చిత్ర... వీళ్లే ఎన్ని కొమ్మల మీద వాలతారు? ప్రతిసారి తమ గొంతు విప్పుతారు. కొత్త గొంతులు రావాలి. వేల కోకిలమ్మలు పాటల చెట్టుపై వాలాలి అనుకున్నవాడు ఏ.ఆర్.రహమాన్. అతడే బాల సుబ్రహ్మణ్యం ఏక గాయకుడిగా వెలుగుతున్నప్పుడు అనేకమంది మేల్ సింగర్స్‌ను తీసుకువచ్చాడు. అతడే జానకి, చిత్రలకు అలవాటు పడిన చెవులకు కొత్త స్త్రీ గొంతుక లు వినిపించాడు. 1992లో తన తొలి సినిమా ‘రోజా’లో ఒక్క పాట కూడా జానకి, సుశీల వంటి సీనియర్లకు ఇవ్వలేదు రహమాన్. సినిమాను నిలబెట్టిన ‘చిన్ని చిన్న ఆశ’ పాటను కూడా చిత్రకు ఇవ్వలేదు. ఆ పాటకు కొత్త గాయని మిన్మినిని ఎంచుకున్నాడు. ఆ సినిమా తెలుగు, తమిళ, హిందీ వెర్షన్లకు మిన్మినియే పాడింది. ‘జాబిలిని తాకి ముద్దులిడ ఆశ... వెన్నెలకు తోడై ఆడుకొను ఆశ’... ఆ తర్వాత ఆ గాయని అనారోగ్య కారణాల రీత్యా పాటకు దూరమైంది. కాని ఇప్పటికీ ఆ పాటే ఆమెకు గుర్తింపు, ఉనికి, ఉపాధి అయ్యింది. కన్నులతో చూసేదీ గురువా... ‘జీన్స్’ ఈ పాట ఇప్పటికీ డాన్స్ నంబర్. ఐశ్వర్య రాయ్ స్టేజ్ మీద స్టెప్పులేస్తుంటే థియేటర్లో ఆడియన్స్ జత కలిశారు. కాని ఆ పాటలో ఒక కొత్తదనం ఉంటుంది. ఏమిటది? దానిని ఏఆర్ రహమాన్ క్లాసికల్ సింగర్ నిత్యశ్రీ మహదేవన్ చేత పాడించాడు. ఆమె మహాగాయని పట్టమ్మాళ్ మనవరాలు. ఆమెకు ఇదే తొలి సినిమా గీతం. అందుకే ఆ ఫ్రెష్‌నెస్. ఒక సొగసు. ‘బొంబాయి’ సినిమాలో ‘కన్నానులే’ పాటను చిత్ర చేత పాడించాను రహమాన్. దానిని మణిరత్నం ముందు స్పీడ్ నంబర్‌గా కోరాడు. కాని చివరి నిమిషంలో మెలొడీ ఉండాలి... అందరూ కన్నార్పకుండా ‘వినాలి’ అన్నాడు. ఆ సూఫీ స్టయిల్ గీతం చిత్రకు ఎక్కడలేని గుర్తింపు తెచ్చింది. అందమైన ప్రేమరాణి బాలూ కుమార్తె ఎస్.పి. పల్లవి మంచి గాయని. కాని ఆమె ఆ రంగాన్ని సీరియస్‌గా ఎంచుకోలేదు. కాని రహమాన్ తనకున్న చనువు కొద్దీ పల్లవితో ఒక పాట పాడించాడు. అదే ‘ప్రేమికుడు’లోని ‘అందమైన ప్రేమరాణి చేయి తగిలితే’. అదే పాటకు బాలూ కూడా గొంతు అందించారు. చిన్న వయసులోనే మరణించిన గాయని స్వర్ణలత చేత రహమాన్ పెద్ద హిట్స్ పాడించాడు. ‘ప్రేమికుడు’లోని ‘ముక్కాలా ముకాబలా’లో ‘తుపాకీ లోడ్ చేసి గురి పెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా’ అని స్వర్ణలత పాడిన అందం రహమాన్ వల్లే సాధ్యం. ఈ స్వర్ణలతే ‘బొంబాయి’లో ‘కుచ్చికుచ్చి కునమ్మా పిల్లనివ్వు’ పాడింది. కొంచెం నిప్పు కొంచెం నీరు మణిరత్నం తీసిన ‘దొంగ దొంగ’ ఆడాల్సినంత ఆడలేదు. కాని అందులోని పాట నేటికీ నిలుచుని ఉంది. అదే ‘కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయి నా మేనిలోనా’. ఈ పాటను అనుపమ చేత పాడించాడు రహమాన్. పల్లవి చివర ‘చంద్రలేఖా’...అనే ఆలాపన ఒక తరంగంలా వ్యాపిస్తుంది. ఈ పాట పాడుతున్నట్టుగా ఉండదు. అరుస్తున్నట్టుగా, నీల్గుతున్నట్టుగా, రహస్యం చెబుతున్నట్టుగా ఉంటుంది. ఇటీవలి ఇండియన్ ఐడెల్ గాయని షణ్ముఖ ప్రియ ఈ స్టయిల్లోనే పాడుతుంది. అనుపమ ఆ తర్వాత ఎక్కువ పాటలు పాడలేదు. కాని ఈ పాట ఆమెకు ఇప్పటికీ పాస్‌పోర్ట్. రంగీలారే మన రామ్‌గోపాల్ వర్మ ద్వారా రహమాన్ హిందీలో ప్రవేశించాడు. తొలి సినిమా ‘రంగీలా’. మొదటిసారి ఆశాభోంస్లే చేత పాడించాడు. ‘యాయిరే యాయిరే జోర్ లగాకే నాచెరే’... అరవై దాటిన ఆశాభోంస్లేకు కొత్త హుషారు వచ్చింది ఆ పాటతో. అదే సినిమాలో ‘తన్హా తన్హా యహాపే జీనా’ ఆశా గొంతులో మరింత సరసంగా వినిపించింది. ఆ తర్వాత లతా మంగేష్కర్ చేత రహమాన్ ‘దిల్ సే’లో పాడించాడు. ‘దియా జలే జాన్ జలే’ పాట బహుశా పాడిన కొత్తరకం పాటల్లో ముఖ్యమైనది. ‘దిల్సే’లో సూపర్‌హిట్ అయిన ‘ఛయ్య ఛయ్య’ కోసం సప్న అవస్థిని వెతికి ఆమె వల్ల పాటకు కొత్త ఫీల్ తెచ్చాడు. ఎందరో గాయనులు ‘కడలి’లో ‘గుంజుకున్నా’ పాడిన శక్తిశ్రీ గోపాలన్, ‘ఇందిర’లో ‘లాలి లాలి అని’ పాడిన హరణి, ‘రోబో’లో ‘కిలిమంజారో భళా భలిమంజారో’ పాడిన చిన్మయి, ‘జంటిల్మన్’ లో ‘నెల్లూరు నెరజాణ’ పాడిన మహలక్ష్మి అయ్యర్, ‘శివాజీ’లో ‘వాజి వాజి వాజి రారాజే నా శివాజీ’ పాడిన మధుశ్రీ... వీరంతా తెలుగు పాటకు కొత్త గుబాళింపును తెచ్చారు రహమాన్ వల్ల. ఇవాళ రహమాన్ పుట్టినరోజు. వేయి పాటలు అతడు చేయనీ. పదివేల కొత్త గాయనీమణుల గళాలు వినిపించనీ. -
Fenty's Fortune: మీకేమైనా తెలుసా... వాట్స్ మై నేమ్?
బాబిడోస్ సింగర్ రిహాన రైటర్, నటి, ఫ్యాషన్ డిజైనర్ కూడా. ‘మ్యూజిక్ ఆఫ్ ది సన్’ ఆల్బమ్ ఆమెను లోకానికి పరిచయం చేసింది. ‘ఏ గర్ల్ లైక్ మీ’ రిహానను బిల్‌బోర్డ్‌లో అగ్రస్థానంలో నిలిపింది. ‘గుడ్ గర్ల్ గాన్ బ్యాడ్’ ఆమెకు ఎంతో మంది అభిమానులను సంపాదించింది. ‘అంబ్రెల్ల’ పాట ‘గ్రామీ అవార్డ్’ను తెచ్చిపెట్టింది. మీరు ఏ కాస్త తీరిగ్గా ఉన్నా....‘వాట్స్ మై నేమ్’ పాటను అందుకోండి...‘యూ ఆర్ సో అమేజింగ్’ అని, ‘వుయ్ ఫౌండ్ లవ్’ పాటను ‘వుయ్ ఫౌండ్ లవ్ ఇన్ ఏ హోప్లెస్ ప్లేస్ ఎల్లో డైమండ్ ఇన్‌ది లైట్’ అంటూ బేషుగ్గా పాడుకోవచ్చు. ‘రిచెస్ట్ ఫిమేల్ మ్యూజిషియన్ ఆన్ ది ప్లానెట్’గా ఘనత సాధించిన రిహాన సెల్ఫ్–మేడ్ ఆర్టిస్ట్. రిహాన ‘రిచెస్ట్’ కావడానికి మ్యూజిక్ మాత్రమే కారణం కాదు...ఆమె మంచి ఎంటర్ప్రెన్యూర్ కూడా. చదవండి: పదేళ్ల బాలుడికి అంతర్జాతీయ యంగ్ వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ అవార్డు..!! -
నన్ను విచిత్రంగా చూశారు
ఉషా ఉతుప్... మాంచి జోష్ ఉన్న సింగర్. ఫీమేల్ సింగర్ అంటే వాయిస్ సున్నితంగా ఉండాలి అనుకునే ఆలోచనని తన బేస్ వాయిస్‌తో బద్దలుకొట్టారు. పేద్ద బొట్టు, తల నిండా పువ్వులు, చీర కట్టుతోనే మనందరికీ ఎప్పుడూ కనిపిస్తారు. కెరీర్ స్టార్టింగ్‌లో తన వేషధారణ వల్ల ఎదుర్కొన్న ఓ విచిత్ర అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘కెరీర్ స్టార్టింగ్‌లో నైట్ క్లబ్లో పాటలు పాడేదాన్ని. నైట్ క్లబ్‌కి కూడా చీర కట్టుకొని వెళ్లేదాన్ని. అక్కడికి వచ్చిన వాళ్లంతా నన్ను స్టైజ్ మీద చూసి ‘ఈ అమ్మ ఏం పాడుతుందిలే..’ అన్నట్టుగా నన్ను విచిత్రంగా చూసేవారు. తీరా నేను పాడటం అయిపోయిన తర్వాత ‘వావ్’ అన్నట్టుగా ముఖాలు పెట్టేవారు. చాలా మంది అనుకుంటారు ఉషా ఉతుప్ అనగానే చీర, పెద్ద బొట్టుతో కనిపిస్తారు.. ఇది మార్కెటింగ్ స్ట్రాటెజీ అని. కానీ అలా ఏం కాదు. నేను చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా అమ్మగారు ఎప్పుడూ చీరే కట్టుకునేవారు. నాకు తెలిసిన డ్రెస్ అదొక్కటే. అలాగే నేను చీర కట్టుకొని వెళ్లడం వల్ల నైట్‌క్లబ్‌కి ఫ్యామిలీలు కూడా రావడం స్టార్ట్ అయ్యారు. అలా నైట్ క్లబ్ ఫ్యామిలీ ప్లేస్‌లా మారిపోయింది. ఆడియన్స్‌లో చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అలాగే భార్యలందరికీ తమ భర్తల మీద ఓ భరోసా ఉండేది. నా శరీరాకృతి, నా అందం చూసి వాళ్ల భర్తల మనసు చలించదు అని (నవ్వుతూ)’’ అంటూ తన మీద తానే జోక్ వేసుకుంటూ, పాత అనుభవాలను పంచుకున్నారు ఉషా ఉతుప్. -
ప్రముఖ గాయని రాణి మృతి
టాలీవుడ్ సీనియర్ గాయని కె. రాణి (75) ఇక లేరు. హైదరాబాద్ కల్యాణ్ నగర్‌లోని తన పెద్ద కుమార్తె విజయ ఇంట శుక్రవారం రాత్రి ఆమె మృతి చెందినట్టు చిన్న కుమార్తె కవిత ధృవీకరించారు. 1942లో కర్ణాటకలోని తుముకూరు పట్టణంలో కిషన్, లలిత దంపతులకు జన్మించారామె. అసలు పేరు కె. ఉషారాణి. ఈ కుటుంబం కడపలో స్థిరపడింది. 8 ఏళ్ల వయసు నుంచే పాటలు పాడటం ప్రారంభించారు. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘దేవదాసు’ చిత్రంలో ‘అంతా భ్రాంతియేనా.. జీవితానా వెలుగింతేనా’, ‘చెలియ లేదు.. చెలిమి లేదు..’ అనే పాటలతో రాణి పాపులర్ అయ్యా రు. ‘బాటసారి, జయసింహ, ధర్మదేవత, సంపూర్ణ రామాయణం, లవకుశ’ వంటి పలు చిత్రాల్లో తన మధురమైన గానంతో శ్రోతలను అలరించారు. ఆమె పాడిన చివరి చిత్రం ‘విశాల హృదయాలు’. ఆ సినిమాలో ఆమె ‘ఒక్క మాట..’ అనే పాట పాడారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, బెంగాలీ, సింహళ, ఉజ్బెక్ వంటి పలు భాషలలో సుమారు 500 పాటలు పాడారామె. శ్రీలంక జాతీయ గీతం కూడా ఆలపించారు రాణి. రాష్ట్రపతి భవన్లో తన గానామృతంతో అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణని ఆకట్టుకున్న ఘనత రాణి సొంతం. సింహళ, ఉజ్బెక్ భాషలలో పాడిన తొలి ఇండియన్ సింగర్ ఆమె కావడం విశేషం. అలాగే, అప్పటి జాతీయ కాంగ్రెస్ నేత కె. కామరాజ్ ‘మెల్లిసై రాణి’ అనే బిరుదు ఇచ్చారు. 1966లో జి. సీతారామరెడ్డితో రాణి వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఇంట్లో రాణి ఉంటున్నారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
వీరాభిమాని అశ్లీల వీడియోలు.. సింగర్ షాక్!
ముంబై : వీరాభిమానం తప్పుదోవ పడితే చివరికి కటకటాలపాలు కావాల్సిందే. తనను కలుసుకోవడం లేదన్న కారణంగా ఓ ఫీమేల్ సింగర్‌కు అసభ్య సందేశాలు, వీడియోలు పంపండంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని అంబోలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. 26 ఏళ్ల యువతి పలు బాలీవుడ్ మూవీలకు ప్లే బ్లాక్ సింగర్‌గా చేశారు. ఆమెకు బిహార్‌కు చెందిన రాజేశ్‌కుమార్ శుక్లా(30) వీరాభిమాని. తన ఆరాధ్య సింగర్‌ను ఎలాగైనా కలవాలని రెండు వారాల కిందట ముంబైకి వచ్చాడు. ఎలాగోలా కష్టపడి ఆమె ఫోన్ నెంబర్, అడ్రస్ సేకరించాడు. మిమ్మల్ని కలుసుకోవాలని ఉందని పలుమార్లు సందేశాలు పంపినా సింగర్ పట్టించుకోలేదు. ఇదే అదునుగా భావించిన ఆ వీరాభిమాని కీచకపర్వం మొదలుపెట్టాడు. నన్ను కలుసుకోవా నీ పని చెబుతానంటూ ఆమెకు అసభ్య సందేశాలు, అశ్లీ వీడియోలు పంపసాగాడు. వేధింపులను భరించలేని సింగర్ తన తల్లితో కలిసి అంబోలీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వీరాభిమాని అని చెప్పి ఓ వ్యక్తి వేధిస్తున్నాడని, తనను కలవడానికి బిహార్ నుంచి వచ్చా అని ఫోన్లు, మెస్సేజ్‌లు చేస్తున్నాడన్నారు. ఐపీసీ 354డీ, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. తన ఆరాధ్య సింగర్ కలుసుకునేందుకు నిరాకరించడంతో ఈ పిచ్చి చేష్టలకు పాల్పడినట్లు నిందితుడు శుక్లా అంగీకరించాడు. -
అపురూపం: తియ్యని స్వరానుబంధం
లతామంగేష్కర్ - పి.సుశీల నైటింగేల్స్ ఆఫ్ ఇండియా. జాతి గర్వపడే కోయిలలు. ఒకరు ఉత్తరాన్ని ఏలితే ఇంకొకరు దక్షిణాది సంగతి చూసుకున్నారు. అనుకరణకు ఏమాత్రం వీలు కాని తియ్యటి గొంతులు వారివి. భాష ఉచ్ఛారణలో, భావ ప్రకటనలో ఇప్పటివారికి వారే డిక్షనరీ! లతాజీకి సుశీలగారంటే ఎంతో అభిమానం. అలాగే సుశీలగారికి లతాజీ అంటే గురుభావం! గాత్రం రీత్యా, రూపం రీత్యా ఇద్దరికీ దగ్గర పోలికలు ఉండటంతో అక్కాచెల్లెళ్లలా అనిపిస్తారు. లతాజీ కూడా సుశీలగారిని తన నాల్గవ చెల్లెలుగా భావిస్తారు. చెన్నై ఎప్పుడొచ్చినా సుశీలగారిని చూడకుండా వెనుదిరిగేవారు కాదు లతాజీ. అలాగే బొంబాయి వెళితే లతాజీని కలవకుండా వచ్చేవారు కాదు సుశీల! ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ గాయిని... ఇలా వ్యక్తిగత అవార్డులను భారత ప్రభుత్వం 1969 నుంచి ఇవ్వడం ప్రారంభించింది. ప్రవేశపెట్టిన తొలి సంవత్సరమే జాతీయ స్థాయిలో ఉత్తమ గాయనిగా పి.సుశీలగారు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఏవీయం అధినేత మెయ్యప్పన్ చెట్టియార్‌గారు చెన్నైలో సుశీలగారికి పెద్ద అభినందన సభ ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా లతామంగేష్కర్ విచ్చేశారు. తన సాటి గాయనికి దక్కిన ఈ గౌరవానికి లతాజీ పొంగిపోయి బొంబాయి నుండి ప్రత్యేకంగా వచ్చి సత్కరించడమే కాకుండా మరుసటిరోజు సుశీలగారి ఇంటికి వెళ్లి ఆమెకు బంగారు నెక్లెస్‌ను కూడా బహుకరించారు. అది ఆమె ఉన్నత వ్యక్తిత్వానికి నిదర్శనం. ఆ సందర్భంగా వారిద్దరూ కాఫీ తాగుతూ ముచ్చటించుకుంటున్న స్టిల్(పైన) అప్పటిదే. ఆ మధ్య కేంద్ర ప్రభుత్వం సుశీలగారికి పద్మభూషణ్ ప్రదానం చేసిన సందర్భంలో తన మానసిక గురువు అయిన లతాజీ ఆశీస్సులు తీసుకోవడానికి బొంబాయి వెళ్లినప్పుడు వారిరువురూ కాఫీ సేవిస్తూ కబుర్లాడుకుంటున్న దృశ్యాన్నీ (కింది ఫొటో) చూడవచ్చు. సంవత్సరాలు మారాయి! కానీ వారి మధ్య సంబంధాలు మారలేదు! వారి అనుబంధం, స్వర బంధం అంత తియ్యనిదీ, చెరగనిదీ, తరగనిదీ కాబట్టే ఇన్నేళ్లయినా... ఎన్నాళ్లయినా అలా కొనసాగుతూనే ఉంది... ఉంటుంది!! - ఫొటోలు, రచన: సంజయ్ కిషోర్


