భర్తతో విడాకులు.. సింగర్‌కు క్యాబ్‌ డ్రైవర్‌ వేధింపులు! | Female Singer Incident In Hyderabad, Check More Details Inside | Sakshi
Sakshi News home page

భర్తతో విడాకులు.. సింగర్‌కు క్యాబ్‌ డ్రైవర్‌ వేధింపులు!

Jun 5 2025 9:59 AM | Updated on Jun 5 2025 10:53 AM

Female singer incident in hyderabad

హైదరాబాద్: భర్తతో విడాకులు తీసుకున్న ఓ ఫిమేల్‌ సింగర్‌ను క్యాబ్‌ డ్రైవర్‌ వేధింపులకు గురిచేశాడు. అతనితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసి కుటుంబ సభ్యులకు పంపుతానని, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే..

బేగంపేట ప్రకాష్‌నగర్‌కు చెందిన గాయనికి 2012లో వివాహం జరగ్గా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్తతో వచ్చిన మనస్పర్థల కారణంగా 2024లో విడాకులు తీసుకుంది. అయితే సింగర్‌ విడాకులు తీసుకున్న విషయం తెలుసుకున్న బల్కంపేటకు చెందిన క్యాబ్‌ డ్రైవర్‌ ఉమామహేష్‌ గతంలో 2006లో ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను ఆమెకు పంపించి బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో బాధితురాలు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement