కన్నడ సినిమా రేంజుని 'కేజీఎఫ్' సినిమా ఎంతో మార్చేసింది. హీరోహీరోయిన్, దర్శకుడితో పాటు మూవీ కోసం పనిచేసిన చాలామంది మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదే ఫ్రాంచైజీలో రెండు చిత్రాల్లోనూ చాలావరకు పాటలు పాడిన సింగర్ అనన్య భట్ కూడా మంచి పేరు సొంతం చేసుకుంది. ఇప్పుడు ఈమె తిరుమలలో చాలా సింపుల్‌గా పెళ్లి చేసుకుంది.
(ఇదీ చదవండి: నాన్న చనిపోలేదు.. ధర్మేంద్ర కూతురి షాకింగ్ పోస్ట్)
కన్నడలో ఫోక్ సింగ్స్, సినిమా పాటలు పాడే అనన్య భట్.. ఆదివారం (నవంబరు 09) వివాహం చేసుకుంది. తనలానే సంగీత పరిశ్రమకు చెందిన డ్రమ్మర్ మంజునాథ్‌తో ఏడడుగులు వేసింది. తిరుమలలో జరిగిన ఈ శుభకార్యం.. కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో చాలా సింపుల్‌గా జరిగిపోయింది. తన పెళ్లి గురించి అనన్య.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. ఈ క్రమంలోనే టాలీవుడ్ సింగర్ మంగ్లీతో పాటు తోటి గాయనీగాయకులు అనన్యకు శుభాకాంక్షలు చెబుతున్నారు.
అనన్య.. 'కేజీఎఫ్' ఒరిజినల్ వెర్షన్‌లోని మెహబూబా, ధీర ధీర, సుల్తాన్ పాటలు పాడింది. అలానే తెలుగు వెర్షన్‌లోని 'తరగని బరువైనా' అంటూ సాగే తల్లి సెంటిమెంట్ సాంగ్ కూడా పాడింది. ఇది కాకుండా 'పుష్ప' కన్నడ వెర్షన్‌లోని 'సామి సామి' పాటలో వినిపించే గొంతు ఈమెదే. రీసెంట్ టైంలో తెలుగులో అయితే 'షష్టిపూర్తి', 'గరివిడి లక్ష‍్మి' సినిమాల్లో ఈమె పాటలు పాడింది.
(ఇదీ చదవండి: సర్‌ప్రైజ్.. మహేశ్-రాజమౌళి 'గ్లోబ్ ట్రాటర్' సాంగ్ రిలీజ్)




