'సల్మాన్‌ ఖాన్‌' బర్త్‌డే వేడుకలో ధోనీ.. వీడియో వైరల్‌ | MS Dhoni With His Family Attend To Salman Khan 60th Birthday Celebrations, Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

'సల్మాన్‌ ఖాన్‌' బర్త్‌డే వేడుకలో ధోనీ.. వీడియో వైరల్‌

Dec 27 2025 9:52 AM | Updated on Dec 27 2025 10:03 AM

MS Dhoni WITH HIS FAMILY ATTEND TO SALMAN KHAN BIRTHDAY

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ నేడు 60వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ  వేడుకలు పాన్వెల్‌లోని తన ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యుల మధ్య జరిగాయి. ఎంతో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో భారత క్రికెట్‌ టీమ్‌ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని కూడా పాల్గొన్నారు. వారిద్దరూ చాలాకాలంగా మంచి స్నేహితులు కావడంతో తన భార్య సాక్షి, కుమార్తె జివాతో కలిసి ధోనీ వెళ్లారు. ఈ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఫోటోగ్రాఫర్స్‌ ధోని కారును చుట్టుముట్టారు.

సల్మాన్‌ఖాన్‌ పుట్టినరోజు వేడుకలో కేవలం తన కుటుంబ సభ్యులతో పాటు హైప్రొఫైల్‌ ఉన్న స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. భారత మాజీ కెప్టెన్ ధోనీ ఉదయం తన వాహనంలో వెళ్తుండగా ఫోటోగ్రాఫర్స్‌ వెంబడించారు. దీంతో ధోనీ కూడా సున్నితంగా తమ కారుకు దారి ఇవ్వాలని కోరారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement