హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. నరంలో రోజు రోజుకు డ్రగ్స్ వినియోగం పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (HNEW), మాసబ్ ట్యాంక్ పోలీసులు కలిసి చేసిన ఆపరేషన్‌లో డ్రగ్స్ సబ్-పేడ్లర్లను అరెస్ట్ చేశారు. అయితే, తాజాగా మాసబ్‌ట్యాంక్ పోలీసులు మరోసారి తెలంగాణ ‘ఈగల్ టీం’తో నిర్వహించిన దాడుల్లో భారీగా కొకైన్‌తో పాటు ప్రమాదకరమైన 43గ్రాముల ఎండిఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు జరిపిన ఈ ఆపరేషన్‌లో ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ పేడ్లర్లను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారికి రెగ్యులర్ కస్టమర్ల లిస్ట్‌లో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడని తేలింది. వీరి నుంచి అతను రెగ్యులరర్‌గా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే, విషయం తెలుసుకున్న అమన్ ప్రీత్ సింగ్ పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. గతంలో కూడా అతను సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారని తెలుస్తోంది.


