ఇన్నిరోజులు అసలు సినిమా తీస్తున్న విషయమే బయటకు రానీయకుండా జాగ్రత్తపడిన రాజమౌళి.. ఇప్పుడు మాత్రం అన్ని సడన్ సర్‌ప్రైజులు ఇస్తున్నాడు. ఈనెల 15న హైదరాబాద్‌లో మహేశ్ బాబు 'SSMB29' మూవీకి సంబంధించి భారీ ఈవెంట్ జరగనుంది. దీన్ని హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనున్నారు. ఈ క్రమంలోనే మహేశ్, ప్రియాంక చోప్రా వీడియో బైస్ట్ ఇప్పటికే రిలీజ్ చేశారు.
అలానే కొన్నిరోజుల క్రితం ఇదే సినిమాలో విలన్‌గా నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. కుంభ పాత్రలో కనిపించనున్నట్లు పేర్కొన్నారు. అయితే వీల్ ఛైర్‌లో ఉన్న పృథ్వీరాజ్ లుక్‌పై చాలా ట్రోల్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఎలాంటి ప్రకటన లేకుండా 'గ్లోబ్ ట్రాటర్' అనే పాటని రిలీజ్ చేశారు. హీరోయిన్ శ్రుతి హాసన్ దీన్ని పాడటం విశేషం.
'సంచారి.. సంచారి' అని సాగే లిరిక్స్.. హీరో గురించి చెప్పకనే చెబుతున్నట్లు ఉన్నాయి. ఈ పాటని సినిమా కోసమే స్వరపరిచారా లేదంటే ఈ వారం జరగబోయే ఈవెంట్ కోసమా అనేది తెలియాల్సి ఉంది. శ్రుతి హాసన్ పాడింది అంటే కచ్చితంగా మూవీలో ఉంటుందనే అనుకోవచ్చేమో?


