అర్జెంటీనాతో ఫైనల్‌.. స్పెయిన్‌ను వణికిస్తున్న గాయం! | Spain Star-Lamine-Yamal-Injury Scare-Ahead FIFA WC Final Vs Argentina | Sakshi
Sakshi News home page

అర్జెంటీనాతో ఫైనల్‌.. స్పెయిన్‌ను వణికిస్తున్న గాయం!

Jul 17 2026 8:03 AM | Updated on Jul 17 2026 8:31 AM

Spain Star-Lamine-Yamal-Injury Scare-Ahead FIFA WC Final Vs Argentina

Photo Credit: FIFA Twitter

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026 చివ‌రి అంకానికి చేరుకుంది. ఆదివారం జ‌ర‌గనున్న ఫైన‌ల్లో డిఫెండింగ్ చాంపియ‌న్ అర్జెంటీనాతో స్పెయిన్ అమీతుమీకి సిద్ధ‌మైంది. అయితే 16 ఏళ్ల త‌ర్వాత ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్‌ను సొంతం చేసుకోవాల‌ని క‌ల‌లు కంటున్న స్పెయిన్‌కు ఊహించ‌ని షాక్ తగిలింది. ఆ జ‌ట్టు స్టార్ ఆట‌గాడు లామినె య‌మాల్ తొడ కండ‌రాల గాయంతో బాధ‌ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.  

స్పెయిన్ ప్రాక్టీస్ స‌మ‌యంలో లామినె తొడ‌కు పెద్ద కట్టు వేసుకున్న ఫొటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. తొడ నొప్పితో బాధ‌ప‌డుతున్న య‌మాల్‌కు ఫిజియో చికిత్స చేస్తున్న వీడియో బ‌య‌టికి వ‌చ్చింది. నొప్పితో బాధ‌ప‌డిన యామినే ల‌మాల్ ప్రాక్టీస్‌కు దూరంగా ఉండిపోయాడు. 

ఫ్రాన్స్‌తో జ‌రిగిన సెమీస్‌లో ఆట 22వ నిమిషంలో లుకాస్ డిగ్నే పెనాల్టీ బాక్స్ వ‌ద్ద లామినె య‌మాల్‌ను కింద‌ప‌డేయ‌డంతో అత‌ని ఎడ‌మ తొడ‌కు తీవ్ర గాయ‌మైంది. అయితే నొప్పిని భ‌రిస్తూనే య‌మాల్ మ్యాచ్ మొత్తం కొన‌సాగాడు. స్పెయిన్ విజ‌యం త‌ర్వాత హోటల్ రూమ్‌కు చేరిన అనంత‌రం లామినె తొడ‌నొప్పి మ‌రింత తీవ్ర‌త‌ర‌మైన‌ట్లు స‌మాచారం.

దీంతో స్పెయిన్ జ‌ట్టు బ‌స చేస్తున్న‌ డ‌ల్లాస్‌లోని హోటల్‌కే వైద్య సిబ్బందిని పిలిపించి ల‌మాల్‌కు చికిత్స అందించారు. ఈ నేప‌థ్యంలోనే అత‌డి ఎడ‌మ తొడ‌కు భారీ క‌ట్టు క‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. తొడ గాయంతో ప్రాక్టీస్‌కు దూరంగా ఉండిపోయిన లామినె య‌మాల్ అర్జెంటీనాతో ఫైన‌ల్ మ్యాచ్ ఆడుతాడా లేదా అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. 

19 ఏళ్ల లామినె య‌మాల్ స్పెయిన్ జ‌ట్టులో కీల‌క ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో ఒక్క గోల్ మాత్ర‌మే చేసిన‌ప్ప‌టికీ జ‌ట్టుపై అత‌డి ప్ర‌భావం చాలానే ఉంటుంది. 

Read: టీ20లపై మోజు.. వన్డేలు ఆడడం మరిచిన విండీస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement