రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌..? ఎల్లుండే ఆఖరి మ్యాచ్‌? | Rohit Sharma likely to retire from international cricket after India vs England Lords ODI | Sakshi
Sakshi News home page

IND vs ENG: రోహిత్‌ శర్మ రిటైర్మెంట్‌..? ఎల్లుండే ఆఖరి మ్యాచ్‌?

Jul 17 2026 4:12 AM | Updated on Jul 17 2026 4:33 AM

Rohit Sharma likely to retire from international cricket after India vs England Lords ODI

PC: BCCI Twitter

టీమిండియా స్టార్ ఓపెనర్‌, మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నాడా?  అంటే అవునానే అంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఆదివారం(జూలై 19) ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌నున్న మూడో వ‌న్డే అతడి చివరి ఇంటర్ననేషనల్ మ్యాచ్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. 

అయితే ఇది రోహిత్ త‌నంతంట తాను తీసుకున్న నిర్ణ‌యం కాద‌ని, సెల‌క్ట‌ర్ల ఒత్తిడి మేర‌కే అత‌డు త‌ప్పుకొంటున్నాడ‌ని జాతీయ మీడియాలో క‌థ‌నాలు వెలువ‌డుతున్నాయి. ఇప్పటికే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ హిట్‌మ్యాన్‌తో మాట్లాడి భవిష్యత్తు ప్రణాళికలపై పూర్తి స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.  2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మకు చోటు లేదని అగార్క‌ర్ చెప్పిన‌ట్లు స‌మాచారం.

అత‌డి స్థానంలో యువ ఓపెన‌ర్ య‌శ‌స్వి జైశ్వాల్‌కు అవ‌కాశ‌మివ్వ‌నున్న‌ట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ తమ కథనంలో రాసుకొచ్చింది. జైశ్వాల్ తాను ఆడిన ప్రతీ మ్యాచ్‌లో నూ అద్భుతంగా రాణిస్తున్నప్పటికి, జట్టులో ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీ లేకపోవడంతో అతడికి చోటు దక్కడం లేదు.

ఈ క్రమంలోనే 2027 వన్డే ప్రపంచకప్ నాటికి యశస్విని పూర్తి స్ధాయి ఓపెన‌ర్‌గా సిద్దం చేయాల‌ని మేనెజ్‌మెంట్ భావిస్తోంది. ముఖ్యంగా రోహిత్ శ‌ర్మ వ‌య‌స్సును కూడా  సెల‌క్ట‌ర్లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. వచ్చే వరల్డ్‌ కప్‌ నాటికి 40 ఏళ్ల 6 నెలలకు పైగా వయసు ఉండే రోహిత్‌ ఫిట్‌నెస్‌పై కూడా బీసీసీఐకి సందేహాలు ఉండటంతో ఈ నిర్ణయానికి  వచ్చిన‌ట్లు సమాచారం. 

అసంతృప్తిలో రోహిత్!
అయితే ఈ నిర్ణయంపై రోహిత్ శర్మ అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే అత‌డు  బీసీసీఐ పెద్దలతో మాట్లాడిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. రోహిత్ ఇప్ప‌టికే  టీ20ఐలు, టెస్టుల నుంచి తప్పుకోగా..  వన్డే క్రికెట్ మాత్రమే ఆడుతున్నారు. అత‌డు టెస్టుల నుంచి తప్పుకున్నప్పటి నుంచి, రోహిత్ భవిష్యత్తుపై సెలెక్షన్ కమిటీ టీమ్ మేనేజ్‌మెంట్‌తో నిరంతరం చర్చిస్తూనే ఉంది. కాగా రోహిత్‌ ఇటీవల ఆశించిన విధంగా రోహిత్‌ ఆడలేకపోతున్నాడు. 

సిడ్నీలో 121 నాటౌట్‌ ఇన్నింగ్స్‌ తర్వాత 11 మ్యాచ్‌లు ఆడిన 35.18 సగటుతో 387 పరుగులు చేశాడు. వీటిలో 3 అర్ధ సెంచరీలు ఉన్నా... అతని స్థాయిలో బ్యాటింగ్‌లో దూకుడు కనిపించలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో రెండు వన్డేల్లో కలిపి 68 బంతుల్లో 37 పరుగులే చేయగలిగాడు. 

ఇక వన్డేల్లో 3 డబుల్‌ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా గుర్తింపు ఉన్న రోహిత్‌ 19 ఏళ్ల కెరీర్‌లో 287 వన్డేల్లో 48.58 సగటుతో 11,757 పరుగులు చేశాడు. వీటిలో 33 సెంచరీలు, 62 అర్ధసెంచరీలు ఉన్నాయి.
చదవండి: అదే మా కొంపముంచింది.. చాలా బాధగా ఉంది: శుబ్‌మన్‌ గిల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement