కార్డిఫ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 44 ఓవర్లలో 233 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (65), శ్రేయస్ అయ్యర్ (66) రాణించడంతో భారత్ ఈమాత్రం స్కోరైనా చేయగలిగింది.
ఓ దశలో (178-3) భారీ స్కోర్ చేసేలా కనిపించిన భారత్.. విరాట్ కోహ్లి ఔటయ్యాక వరుసగా వికెట్లు కోల్పోయింది. శ్రేయస్ క్రీజ్‌లో పాతుకుపోయినప్పటికీ.. అతడికి ఎవరు పెద్దగా సహకరించలేదు. ఆఖర్లో బుమ్రా (20 నాటౌట్) బ్యాట్ ఝులిపించడంతో భారత్ 230 పరుగుల మార్కును తాకగలిగింది. అట్కిన్సన్ వేసిన ఇన్నింగ్స్ 43వ ఓవర్‌లో బుమ్రా 3 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.
అంతకుముందు భారత ఇన్నింగ్స్‌ను రోహిత్ శర్మ (26), శుభ్‌మన్ గిల్ (31) ఓ మోస్తరు ఆరంభాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ స్థానంలో ఆడుతున్న ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే ఔటై నిరాశపరిచారు. గత మ్యాచ్‌లో అద్భుత అర్ద శతకాలతో సత్తా చాటిన వాషింగ్టన్ సుందర్ (2), అక్షర్ పటేల్ (1) ఈ మ్యాచ్‌లో చేతెల్తేశారు.
విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యారు. జోఫ్రా ఆర్చర్ వరుస బంతుల్లో అక్షర్, దూబేలను ఔట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపటికే గుర్నూర్ బ్రార్ 7 పరుగుల వద్ద ఔటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ తొమ్మిదో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రసిద్ద్ కృష్ణ (0) ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, అట్కిన్సన్ తలో 3 వికెట్లతో సత్తా చాటగా.. సాకిబ్ మహమూద్ 2, సామ్ కర్రన్, విల్ జాక్స్ చెరో వికెట్ తీశారు. కాగా, 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ తొలి వన్డే గెలిచి 1-0 ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.


